logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యుత్ బిల్లుల చెల్లింపులో పాత ERO విధానాన్ని కొనసాగించాలి : పిక్కిలి వెంకటేశ్వర్లు డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ శ్రీనివాసులు కు పాత ERO విధానాన్ని పునరుద్ధరించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

1 hr ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

విద్యుత్ బిల్లుల చెల్లింపులో పాత ERO విధానాన్ని కొనసాగించాలి : పిక్కిలి వెంకటేశ్వర్లు డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ శ్రీనివాసులు కు పాత ERO విధానాన్ని పునరుద్ధరించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    1
    బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది
ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని  వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
  • విజయ్ చికిత్సకు వైసీపీ అండగా రూ. 85 వేలు ఆర్థిక సాయం.. భరోసా చాలా రోజుల నుంచి వాస్కులర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దకడబుర్ గ్రామానికి చెందిన హరిజన విజయ్ కు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు /పత్తికొండ నియోజకవర్గం పరిశీలకులు వై.సీతా రామిరెడ్డి అలాగే మండల వైస్సార్సీపీ నాయకులు అందరు కలిసి చికిత్స నిమిత్తం 85000 రూపాయలు భార్య మారెమ్మ కు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల్ కన్వినర్ బి.రామ్ మోహన్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు బి. చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆర్ రామలింగారెడ్డి, దొడ్డిమేకల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్,మాజీ ఎంపీపీ రఘురామ్, బ్రహ్మయ్య ఆచారి,ముక్కరన్న, అర్లప్ప, ప్రసాద్, రాజు, సుందరం, ఏసన్న, కుమార్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    విజయ్ చికిత్సకు వైసీపీ అండగా రూ. 85 వేలు ఆర్థిక సాయం.. భరోసా 
చాలా రోజుల నుంచి వాస్కులర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దకడబుర్ గ్రామానికి చెందిన హరిజన విజయ్ కు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు /పత్తికొండ నియోజకవర్గం పరిశీలకులు వై.సీతా రామిరెడ్డి అలాగే మండల వైస్సార్సీపీ నాయకులు అందరు కలిసి  చికిత్స నిమిత్తం 85000 రూపాయలు భార్య మారెమ్మ కు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల్ కన్వినర్ బి.రామ్ మోహన్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు బి. చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆర్ రామలింగారెడ్డి, దొడ్డిమేకల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్,మాజీ ఎంపీపీ రఘురామ్, బ్రహ్మయ్య ఆచారి,ముక్కరన్న, అర్లప్ప, ప్రసాద్, రాజు, సుందరం, ఏసన్న, కుమార్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_మంచోది రాజు
    మంచోది రాజు
    Local News Reporter మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.
    1
    పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా
కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.
    user_ABHI LOHITH
    ABHI LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఏసీబీ వలకు చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:ఆగస్టు 20 ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు *తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!* * *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!* * *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు. - నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు. - ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. - డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. *సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు* - ఇప్పటివరకు 8 ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు. - తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు. - యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు. - హస్తినాపురంలో – 1 ప్లాట్‌. - విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌. - రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. - హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. - హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.
    2
    ఏసీబీ వలకు చిక్కిన  ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి 
హైదరాబాద్:ఆగస్టు 20
ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి,
ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు
*తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ  సోదాలు!*
* *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!*
* *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*.
ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు.
- నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు.
- ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు.
- డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు.
*సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు*
- ఇప్పటివరకు 8 ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు.
- తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు.
- యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు.
- హస్తినాపురంలో – 1 ప్లాట్‌.
- విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌.
- రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి.
- హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు.
- హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగం వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పంటాలని సదుద్దేశంతో వరుణ యాగం చేపట్టడం జరిగిందని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన వరుణ యాగంలో వారు మాట్లాడుతూ.. రైతుపైనే అనేక వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయని, అలాంటి రైతు సమృద్ధిగా పంటలు పండించాలంటే వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.
    1
    వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగం 
వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పంటాలని సదుద్దేశంతో వరుణ యాగం చేపట్టడం జరిగిందని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన వరుణ యాగంలో వారు మాట్లాడుతూ.. రైతుపైనే అనేక వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయని, అలాంటి రైతు సమృద్ధిగా పంటలు పండించాలంటే వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    29 min ago
  • వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    1
    వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    1
    డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి
నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. 
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు
ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.  గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. 
డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty
    1
    #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty 
Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty
    user_Phatan dastagir kham
    Phatan dastagir kham
    రాయచోటి, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ 10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    1
    పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ
10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.