Shuru
Apke Nagar Ki App…
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి మక్తల్ గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లు. అవస్థ పడుతున్న వాహనదారులు మరియు గ్రామస్తులు అధ్వానంగా మారిన తునికి మక్తల్ రోడ్డు ప్రజా దర్బార్ వర్గల్ సెప్టెంబర్ 15, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి మక్తల్ గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లు. అవస్థ పడుతున్న వాహనదారులు మరియు గ్రామస్తులు. ఎన్నో రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించాలని గ్రామస్తులు మరియు వాహనదారులు కోరుకుంటున్నారు.
PITLA KANAKA RAJU PRAJA PILUPU
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి మక్తల్ గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లు. అవస్థ పడుతున్న వాహనదారులు మరియు గ్రామస్తులు అధ్వానంగా మారిన తునికి మక్తల్ రోడ్డు ప్రజా దర్బార్ వర్గల్ సెప్టెంబర్ 15, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి మక్తల్ గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లు. అవస్థ పడుతున్న వాహనదారులు మరియు గ్రామస్తులు. ఎన్నో రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించాలని గ్రామస్తులు మరియు వాహనదారులు కోరుకుంటున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆవాస్ యోజన ఇండ్లపై ప్రధాని మోడీ పేరు ఉండాలి : ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.2 లక్షల చొప్పున నిధులు అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఇళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఉన్న ఆవాస్ యోజన పథకం చిహ్నాన్ని తప్పనిసరిగా ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలను ప్రజలకు తెలిసేలా పథకం గుర్తును ఇళ్లపై ఏర్పాటు చేయాలని కోరారు.1
- తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. - ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. - అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. - భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. - - నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది.1
- న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ స్వాధీనం ఘట్‌కేసర్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని న్యూ ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బేకరీలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా గడువు తీరిన ఫుడ్ కలర్, హాట్ చిల్లీ ప్యాకెట్లు, మఫిన్ మిక్స్ పౌడర్, కొబ్బరి తురుము, 10 ట్రేల గుడ్లు, బ్రెడ్, వనస్పతి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో బేకరీ యజమాని షేక్ అక్బర్ (35), సూపర్‌వైజర్ **షేక్ నజీర్ బాషా (22)**ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు ఇద్దరినీ ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఆహార వ్యాపార సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.3
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- తెలంగాణ రాష్ట్రంలో రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్నా ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా వుందనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇందిరామ పిల్ల పేరుతో పాటు పీఎం ఏవై లోగో పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు పేదలకు ఇస్తున్న ఇండ్లలో రెండు లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూకేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.రైస్ మిల్లర్లుపై విజలెన్స్ దాడులు హైయామైన చర్యనీ అన్నారు. బుధువారం రోజున మెదక్ పట్టణములోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రైస్ మిల్లర్లు అసోసియేషన్ సభ్యులుతో చర్చలు జరపాలి. రైస్ మిల్లర్లు పై విజలెన్స్ దాడులు చెయ్యడం సబబు కాదని అన్నారు. రైస్ మిల్లు పై దాడులు ఆపకపోతే బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు సివిల్ సప్లై ఎం డి తో చర్చిస్తారు అందర్నీ దొంగలుగా చూడడం సబబు కాదన్నారు. రైస్ మిల్ యజమాన్యాలతో చర్చలు జరిపి రైస్ మిల్లు మిల్లు యధావిధిగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గత మూడు సంవత్సరాలుగా మిల్లులకు ఇచ్చిన దాన్యం బియ్యం కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్లు ధాన్యం పేరుకు పోయిందన్నారు గోదాము లేవన్నారు వచ్చే నెలలో వచ్చే దాన్యం కు ఎక్కడ పెడతారని ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా అసెంబ్లీ సమావేశాలు పక్కదారి పట్టించారన్నారు. 22b నిషేధిత భూములను చర్చ లేదన్నారు ఎలాంటి చర్య లేదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ .తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారింగానిర్వహించాలన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులతో పాటు ముస్లింలు కూడా పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారుఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాదామల్లేష్ గౌడ్ గడ్డం శ్రీనివాస్ రాగి రాములు నాయాని ప్రసాద్ విజయ్ కుమార్ రజింత్ రెడ్డి పంజా విజయ్ కుమార్ సురేష్ శ్రీనివాస్ బేడ్ల సత్యనారాయణ, ప్రభాకర్ బైండ్ల వీణ ,.లక్ష్మి శైలజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- బీసీ రాజ్యాధికారమే లక్ష్యం – మల్లన్న పాదయాత్రకు జనగామ జిల్లా సంఘీభావం* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యం – మల్లన్న పాదయాత్రకు జనగామ జిల్లా సంఘీభావం* తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు *సెప్టెంబర్ 17న* చేపట్టనున్న బీసీ రాజ్యాధికార *పాదయాత్రను* విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే డిమాండ్‌తో తీన్మార్ మల్లన్న గారు చేపడుతున్న పాదయాత్రకు సంఘీభావంగా జనగామ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, బహుజనుల రాజకీయ భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. “మన రాజ్యం – మన అధికారం” అనే నినాదంతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, సెప్టెంబర్ 17న జరిగే బీసీ రాజ్యాధికార పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్, నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మౌనిక యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పిట్టల సురేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇల్లందుల రవి ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సమ్మయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు దండురాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వెంబటి అజయ్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గంగరాజు జిల్లా కార్యదర్శి మంద దిలీప్, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- గిరిజన తండాల్లో బీరస్ పార్టీ పదార్థం ఆవిష్కరించి మాజీ సీఎం కేసీఆర్ పాలాభిషేకం చేయాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి పిలుపు గిరిజనులకు4%రిజర్వేషన్లు 10 శాతానికి పెంచింది కేసీఆరే తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..సెప్టెంబర్ 17న ప్రతి తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలి.మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి..గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేస్తూ సెప్టెంబర్ 17న మెదక్ జిల్లాలో ప్రతి తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం నిర్వహించాలనిపిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గిరిజనుల స్వయం పాలన కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.గిరిజనుల విద్యా, సామాజిక అభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 10 శాతం రిజర్వేషన్ కారణంగా గిరిజన విద్యార్థులకు విద్యా రంగంలో ప్రయోజనం కలుగుతోందని, వైద్య విద్యలో ఏటా విద్యార్థులకు సీట్లు లభిస్తున్నాయని తెలిపారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన కృషిని గుర్తుచేసుకునేందుకే సెప్టెంబర్ 17న ప్రతి తండాలో క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకే సర్పంచులుగా అవకాశం కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. తండాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రోడ్లు లేని పలు తండాలకు రహదారులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.మెదక్ పట్టణంలో బంజారా భవన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించామని గుర్తు చేశారు. నిధులు కూడా మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ హయాంలో తండాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ,ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదని, కాంగ్రెస్ నాయకుల పాలనగా మారిందని ఆరోపించారు. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల హక్కులు, సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.అనంతరరం సుల్తాన్‌పూర్ తండా సర్పంచ్ రమేష్, గిరిజన నాయకులు శ్రీను నాయక్, రంజిత్ నాయక్, ధన్ సింగ్ లు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పాలన కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందనిఅన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి వారి హక్కులకు గుర్తింపు కల్పించారని తెలిపారు.కేసీఆర్ హయాంలో తండాలకు పంచాయతీ హోదా కల్పించడంతో పాటు రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాల్లో సమస్యలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు.మెదక్ పట్టణంలో బంజారా భవన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు రద్దు చేసిందని ఆరోపించారు.గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. తండాలకు గతంలో కల్పించిన మౌలిక వసతులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న మెదక్ జిల్లాలోని అన్ని తండాల్లో బిఆర్‌ఎస్ జెండాలు ఎగురవేసి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్,జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఏం లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్ హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం అంజ గౌడ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా. నరేందర్, నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్,ప్రభు రెడ్డి,ఆర్కే శ్రీనివాస్,సాప సాయిలు, మార్గం. ఆంజనేయులు, శ్రీహరి, ప్రభాకర్, మంగ్యా,ఫుల్ సింగ్, ధన్ సింగ్,పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- ఇస్లాంపూర్ తండాలో చిరుత కలకలం.. లేగ దూడ మృతి, చిరుతను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. తండాకు చెందిన లంబాడి రాజు పొలం వద్ద పశువులను కట్టేసి ఉంచగా, సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో లేగ దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, తండావాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించి, దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సర్పంచ్ కోరారు.1