logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బద్వేలు 23వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. -టీడీపీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా, బద్వేలు, ఆగస్టు 01: బద్వేలు పట్టణంలోని 23వ వార్డు లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా(బిగ్ బాస్), పీఆర్సీ భాష లు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులు,ఒంటరిమహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల నెలా గౌరవంగా పెన్షన్ అందుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

3 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
f9ad7782-3267-4fd0-886c-4510470c91bb

బద్వేలు 23వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. -టీడీపీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా, బద్వేలు, ఆగస్టు 01: బద్వేలు పట్టణంలోని 23వ వార్డు లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా(బిగ్ బాస్), పీఆర్సీ భాష లు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం

20f2e5c7-68af-4fff-b3bd-9022f0ac4cbb

మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులు,ఒంటరిమహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల నెలా గౌరవంగా పెన్షన్ అందుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తాత రమేష్ కోవూరు ఏఎంసీ చైర్మన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తాత రమేష్ కోవూరు నియోజకవర్గం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని తాతా రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని ఘనంగా సన్మానించారు.
    2
    కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తాత రమేష్ 
 

కోవూరు ఏఎంసీ చైర్మన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తాత రమేష్ 
కోవూరు నియోజకవర్గం 
కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని తాతా రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని ఘనంగా సన్మానించారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    1
    ఆర్టీసీ డిపో మేనేజర్‌ని సస్పెండ్ చేయాలి: సీపీఐ యం ఎల్ లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని సీపీఐ (యం ఎల్) లిబరేషన్ పార్టీ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమపై డిపో మేనేజర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టమన్నారు. అపరిశుభ్రత మురుగునీటి సమస్య ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
    1
    ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం
ఘనంగా "శనివారం గుడి పిలుస్తోంది" కార్యక్రమం, దిగ్విజయంగా 21 వారం హిందువులం వారి బంధువులం.. పత్తికొండ అభయాంజనేయస్వామి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమం
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు
పత్తికొండ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ఈ వారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు తరలివచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో,  ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సమరసత్ సేవ ఫౌండేషన్, గిడ్డయ్య అన్నగారు, స్వామివారికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేశాయి. గ్రామం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహిళల కోసం నిర్వహించిన డీఐపీ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో లాటరీ విధానంలో రంగమ్మ అనే మహిళ అదృష్టవంతురాలిగా ఎంపిక కావడంతో ఆమెకు చీరను బహూకరించి సత్కరించారు. చీర అందుకున్న రంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర మహిళలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకరోజు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. "గుడి పిలుస్తోంది" కార్యక్రమం ద్వారా కుటుంబాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమాభిమానాలు బలపడతాయని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆలయ నిర్వాహకులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ​పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: ​టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.​15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ​నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ​సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.​ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ​పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. 
ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ:
​టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.​15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ​పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
​నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
​సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.​ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి
    1
    విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న  సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు.

-పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి
విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న  సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు.
-పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
    1
    వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026:
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.
    1
    సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు
జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    1
    మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను  జిల్లా కలెక్టర్  ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? -దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? -దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    1
    అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? 

-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? 
-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.