logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డా.ఎల్.జితేందర్‌కు ఎయిర్ ఫిల్ట్రేషన్ పరికరంపై డిజైన్ పేటెంట్ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి), కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌లో భౌతికశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. ఎల్. జితేందర్ పరిశోధన, ఆవిష్కరణ రంగంలో మరో విశిష్ట గుర్తింపును సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. డా. జితేందర్ ఎయిర్ ఫిల్ట్రేషన్ డివైస్ (గాలి శుద్ధీకరణ పరికరం)డిజైన్ కు భారత ప్రభుత్వ పేటెంట్లు, డిజైన్లు మరియు ట్రేడ్‌మార్కుల కంట్రోలర్ జనరల్ కార్యాలయం (Office of the Controller General of Patents, Designs & Trade Marks, Govt. of India) ద్వారా డిజైన్ పేటెంట్ నంబర్ 509018-001 మంజూరైంది. డాక్టర్ జితేందర్ మలేసియా కి చెందిన యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కొలాబరేషన్ లో సంయుక్తంగా ఈ ఘనత సాధించారు. గాలి శుద్ధీకరణ మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వినూత్న సాంకేతిక పరిష్కారాల అభివృద్ధిలో ఈ డిజైన్ పేటెంట్ ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. ఈ గుర్తింపు డా. జితేందర్ పరిశోధనా దృక్పథానికి, శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు డా. ఎల్. జితేందర్‌ను అభినందించారు. కళాశాలలో పరిశోధన, ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ ఆలోచనలను మరింత ప్రోత్సహించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.

1 day ago
user_Gautham
Gautham
Local News Reporter హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
1 day ago
0288862a-d635-44f9-ae86-1ccb5c2fca96

డా.ఎల్.జితేందర్‌కు ఎయిర్ ఫిల్ట్రేషన్ పరికరంపై డిజైన్ పేటెంట్ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి), కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌లో భౌతికశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. ఎల్. జితేందర్ పరిశోధన, ఆవిష్కరణ రంగంలో మరో విశిష్ట గుర్తింపును సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. డా. జితేందర్ ఎయిర్ ఫిల్ట్రేషన్ డివైస్ (గాలి శుద్ధీకరణ పరికరం)డిజైన్ కు భారత ప్రభుత్వ పేటెంట్లు, డిజైన్లు మరియు ట్రేడ్‌మార్కుల కంట్రోలర్ జనరల్ కార్యాలయం (Office of the Controller General of Patents, Designs & Trade Marks, Govt. of India) ద్వారా డిజైన్ పేటెంట్ నంబర్ 509018-001 మంజూరైంది. డాక్టర్ జితేందర్ మలేసియా కి చెందిన యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కొలాబరేషన్ లో సంయుక్తంగా ఈ ఘనత సాధించారు. గాలి శుద్ధీకరణ మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వినూత్న సాంకేతిక పరిష్కారాల అభివృద్ధిలో ఈ డిజైన్ పేటెంట్ ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. ఈ గుర్తింపు డా. జితేందర్ పరిశోధనా దృక్పథానికి, శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు డా. ఎల్. జితేందర్‌ను అభినందించారు. కళాశాలలో పరిశోధన, ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ ఆలోచనలను మరింత ప్రోత్సహించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
    1
    మెట్ పల్లిలో కవిత పర్యటనలో జేబుదొంగల చేతివాటం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యకర్తల రద్దీలో మమేకమైన దుండగులు ఒకరి జేబులో నుంచి రూ.17 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.2 వేల చొప్పున నగదు అపహరించారు. అనుమానితుడిని పట్టుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు  అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్ర అప్పగించారు. అనుమానితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    1
    వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో  శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు       మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.
    4
    దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా?
దారి కోసం.. దండయాత్రా?
ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్
ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా?
సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం!
అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన
దంతాలపల్లి  మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో  శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు       మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    Photographer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.
    1
    పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ 
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా
తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    1
    కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్.....
మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ
*ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు
లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్  అన్నారు.
నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్  ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్  అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న  మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి  ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు.
వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు.
సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు.
CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు.
సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు.
ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
    1
    తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది

మా తాతకు ముగ్గురు భార్యలు

ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు

- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది
మా తాతకు ముగ్గురు భార్యలు
ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు
- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    59 min ago
  • కరీంనగర్ జిల్లా తనుగులలో అదృశ్యమైన వ్యక్తి హత్య... తల్లి అక్క బావలే నిందితులని తేల్చిన పోలీసులు మద్యం మత్తులో నిత్యం కన్న తల్లిని వేధింపులకు గురి చేసి ఇటీవల అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తల్లితో పాటు అక్క బావ నే నిందితులను నిర్థారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబు వృత్తి రీత్యా సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే క్రమేణా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తుంటే మూడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. దీంతో కూలి పనిచేసుకొని జీవించే తల్లిని, అక్క బావతో మద్యం మత్తులో నిత్యం గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన తల్లి అక్క బావ మరో నలుగురితో కలిసి మంచానికి కట్టి ఉరి వేసి హత్య చేశారు. మృత దేహాన్ని తీసుకెళ్లి రాజబాబు వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టారు. అనంతరం పోలీసులకు రాజబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానాలు రావడంతో అదుపులో తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో తామే హత్య చేసి పూడ్చి పెట్టమని నిందితులు ఒప్పుకోవడం తో నిందితులను రాజబాబును పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కు తరలించారు. అయితే మద్యం సేవించి నిత్యం వేధించడమే హత్యకు గల కారణాలనీ పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపారు
    2
    కరీంనగర్ జిల్లా తనుగులలో అదృశ్యమైన వ్యక్తి హత్య... తల్లి అక్క బావలే నిందితులని తేల్చిన పోలీసులు
మద్యం మత్తులో నిత్యం కన్న తల్లిని వేధింపులకు గురి చేసి ఇటీవల అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తల్లితో పాటు అక్క బావ నే నిందితులను నిర్థారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి  రాజబాబు వృత్తి రీత్యా సుతారి పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే క్రమేణా తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తుంటే మూడు సంవత్సరాల క్రితం భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. దీంతో కూలి పనిచేసుకొని జీవించే తల్లిని, అక్క బావతో మద్యం మత్తులో నిత్యం గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన తల్లి అక్క బావ మరో నలుగురితో కలిసి మంచానికి కట్టి ఉరి వేసి హత్య చేశారు. మృత దేహాన్ని తీసుకెళ్లి రాజబాబు వ్యవసాయ బావి వద్ద పూడ్చి పెట్టారు. అనంతరం పోలీసులకు రాజబాబు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానాలు రావడంతో అదుపులో తీసుకొని విచారించారు. పోలీసు విచారణలో తామే హత్య చేసి పూడ్చి పెట్టమని నిందితులు ఒప్పుకోవడం తో నిందితులను రాజబాబును పూడ్చి పెట్టిన స్థలానికి తీసుకువచ్చి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కు తరలించారు. అయితే మద్యం సేవించి నిత్యం వేధించడమే హత్యకు గల కారణాలనీ పోస్టుమార్టం అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపారు
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి చర్యలు వేగవంతం చేయాలి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలి:జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐ పి ఎస్ లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలు తదితర పునరావాస ప్రయోజనాలు కల్పించే అంశాలపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి పునరావాస ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తులు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పునరావాస ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జీ, ములుగు డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు రామ్మోహన్, రవీందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి చర్యలు వేగవంతం చేయాలి
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలి:జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐ పి ఎస్ 
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలు తదితర పునరావాస ప్రయోజనాలు కల్పించే అంశాలపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి పునరావాస ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తులు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పునరావాస ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జీ, ములుగు డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు రామ్మోహన్, రవీందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    3 hrs ago
  • రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    4
    రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది
సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.