Shuru
Apke Nagar Ki App…
ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
M S SRIDHAR
ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.1
- బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.1
- మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.1
- టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి...... టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.1
- మంచిర్యాల: సింగపూర్ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.1
- ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.1
- శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు2
- ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.1