logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.

17 hrs ago
user_Bellampalli news
Bellampalli news
Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
17 hrs ago

ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సింగరేణి మారుపేర్ల బాధితులు సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారానికి శాసనమండలిలో సమస్యను ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతగా రామగుండం ప్రాంతానికి చెందిన మారుపేర్ల బాధితులు ఆదివారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి మారుపేర్ల సమస్యతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అనేక పాదయాత్రలు, సింగరేణి కార్యాలయాల ముట్టడులు, నిరసనలు, అమర నిరాహార దీక్షలు వంటి వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను కొనసాగించామని అన్నారు. ఒకవైపు ఉద్యమాలను కొనసాగిస్తూనే, మరోవైపు శాంతియుతంగా తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, పలుమార్లు మెమోరాండాలు అందజేసి తమ బాధలను వివరించామని శ్రావణ్ గౌడ్ తెలిపారు. బాధితుల సమస్యను అర్థం చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొంతవరకు ముందుకు సాగిందని, అయితే ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కమిటీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన మారుపేర్ల బాధితుల కుటుంబాలకు త్వరగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని లక్కా శ్రావణ్ గౌడ్ కోరారు. అలాగే ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన INTUC నాయకుడు జనక్ ప్రసాద్, రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి కి,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు, అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లకు మారుపేర్ల బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మారుపేర్ల బాధితులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్, దన్నాడ రాజు, డిష్ బాబు, తిరుమల శ్రీనివాస్, ఇంజంపల్లి ఓం ప్రకాశ్, పుట్ట అనిల్ కుమార్, షేక్ బాబర్, శేఖర్, రవి, గుర్రం సుధాకర్, రమేష్, అంజయ్య,హరీష్ యాదవ్ తదితర మారుపేర్ల బాధితులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.
    1
    సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సింగరేణి మారుపేర్ల బాధితులు 
సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారానికి శాసనమండలిలో సమస్యను ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతగా రామగుండం ప్రాంతానికి చెందిన మారుపేర్ల బాధితులు ఆదివారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి మారుపేర్ల సమస్యతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అనేక పాదయాత్రలు, సింగరేణి కార్యాలయాల ముట్టడులు, నిరసనలు, అమర నిరాహార దీక్షలు వంటి వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాలను కొనసాగించామని అన్నారు.
ఒకవైపు ఉద్యమాలను కొనసాగిస్తూనే, మరోవైపు శాంతియుతంగా తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, పలుమార్లు మెమోరాండాలు అందజేసి తమ బాధలను వివరించామని శ్రావణ్ గౌడ్ తెలిపారు.
బాధితుల సమస్యను అర్థం చేసుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్  గారు శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి, కమిటీ ఏర్పాటు దిశగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొంతవరకు ముందుకు సాగిందని, అయితే ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న కమిటీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన మారుపేర్ల బాధితుల కుటుంబాలకు త్వరగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని లక్కా శ్రావణ్ గౌడ్ కోరారు.
అలాగే ఈ సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన INTUC నాయకుడు జనక్ ప్రసాద్, రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి కి,ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కు, అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లకు మారుపేర్ల బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మారుపేర్ల బాధితులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి మారుపేర్ల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్, దన్నాడ రాజు, డిష్ బాబు, తిరుమల శ్రీనివాస్, ఇంజంపల్లి ఓం ప్రకాశ్, పుట్ట అనిల్ కుమార్, షేక్ బాబర్, శేఖర్, రవి, గుర్రం సుధాకర్, రమేష్, అంజయ్య,హరీష్ యాదవ్ తదితర మారుపేర్ల బాధితులు, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    1
    ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ. ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”. ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు? ‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి. ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది? కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు? “తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా? బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి. అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    3
    గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ.
ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు.
నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”.
ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు?
‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి.
ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది?
కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు?
“తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి.
ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా?
బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి.
అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్
మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.
    1
    జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును ఛేదించిన గోదావరిఖని 1టౌన్ పోలీసులు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి మృతి చెందిన కేసును గోదావరిఖని 1 టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జెట్టి నవీన్ కుమార్, సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు ఏసిపి ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జ్, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదేవిధంగా sccl లో పనిచేస్తున్న ఓవర్ మెన్ బొమ్మకంటి రవి కుమార్ ను ocp -05 మైన్ వద్ద అదుపులోకి తీసుకోడమైనది. *నిందితుల వివరాలు* A-1. జెట్టి నవీన్ కుమార్, తండ్రి పేరు కొమురయ్య, వయస్సు 38 సంవత్సరాలు, ముదిరాజ్, వృత్తి: సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల, సీసీసీ నస్పూర్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్. నివాసం: ఇంటి నం. 7-57/1, జీపీ రావు కాలనీ, గారెపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలం. A-2. బొమ్మకంటి రవి కుమార్, తండ్రి పేరు సత్తయ్య, వయస్సు 35 సంవత్సరాలు, బీసీ-బి (పద్మశాలి), వృత్తి: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 2 & 2A ఇన్‌క్లైన్ మైన్‌లో ఓవర్‌మన్. నివాసం: ఇంటి నం. 3-2, బుద్ధ ఖుర్ద్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. *పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు* - నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు - నిందితులకు చెందిన రెండు సెల్ఫోన్లు - ట్యాబ్ *వివరాల్లోకి వెళితే...* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతీ అనుమానస్పద స్థితి లో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన కేసులో రామగుండం పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలు మేరకు పెద్దపల్లి డీసీపీ గారి పర్యవేక్షణ లో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా ఫుటేజీ, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ సాంకేతిక ఆధారంగా ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించారు. నిందితుడైన నవీన్ కుమార్‌కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా నవీన్ కుమార్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కాలేజీకి వచ్చే క్రమంలో యువతితో నిందితుడికి సాన్నిహిత్యం ఏర్పడి, అనంతరం అది ప్రేమ సంబంధంగా మారింది. దాన్ని పెళ్లి వరకు తీసుకుపోవాలని నిందితుడు అనుకున్నాడు. 📌యువతి డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని OU యూనివర్సిటీలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ నిమిత్తం గోదావరిఖని వచ్చిన సమయం లో బొమ్మకంటి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతి నిందితుడు నవీన్ కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా ఉండటాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేక యువతిపై అతనికి తీవ్ర ఆగ్రహం పెరిగి, ఆమెను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకొని సెప్టెంబర్ 12, 2026న యువతిని హత్య చేసేందుకు నవీన్ కుమార్ ముందస్తు ప్రణాళిక ప్రకారం . కాలేజీకి వెళ్లే సమయంలో తన స్నేహితుడి ఇంటి వద్ద పురుగుల మందు తీసుకొని, దానిని వాటర్ బాటిల్‌లో నింపుకుని తన ఈకోస్పోర్ట్ కారులో పెట్టుకొని సెప్టెంబర్ 12న సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వస్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులోకి ఎక్కించుకున్నాడు. అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో గొడవపడి, యువతిని మానసికంగా రవికుమార్ చే బలాత్కరించబడినందు వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాపించి ఆమె ఫోన్లో ఫోటోలు తీసి, ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ముందే సిద్ధం చేసుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. దీంతో పురుగుల మందు ఆమె గొంతులోకి వెళ్లి కారులోనే స్పృహ కోల్పోయి మృతురాలిని సకాలంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ, తన నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగా వైద్య సహాయం అందించడంలో జాప్యం చేశాడు. *హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం* యువతి వెంటనే మృతి చెందకపోవడంతో నిందితుడు కొంతసేపు కారును వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆలస్యం చేశాడు. అనంతరం యువతి స్పృహ కోల్పోయిన తర్వాత, ఆమె మొబైల్ ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రి సుమారు 7:30 నుంచి 7:45 గంటల మధ్య యువతిని ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుండి తప్పించుకొని నవీన్ కుమార్ పారిపోయినాడు. యువతి చికిత్స పొందుతూ మరుసటిరోజు చనిపోయినది. *నేరం బయటపడుతుందనే భయంతో ఆధారాల ధ్వంసానికి ప్రయత్నం* యువతి మృతితో తన నేరం బయటపడుతుందనే భయంతో నిందితుడు కారును కడిగి, సూసైడ్ నోట్, పురుగుల మందు బాటిల్, మొబైల్ సిమ్‌లను కావాలనే సాక్షాలను దొరకకుండా మాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. *సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు* కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ తదితర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించి కేసునుఛేదించారని అని డీసీపీ తెలిపారు . అదేవిధంగా బొమ్మకంటి రవి కుమార్ అదేవిధంగా, మృతురాలు శిక్షణ నిమిత్తం వచ్చిన సమయంలో నిందితుడు ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ పరిచయం పెంచుకొని మాటలు కలిపి అనంతరం ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడినట్లు ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు, మరియు మృతురాలు సింగరేణి అధికారులకు ఇచ్చిన దరఖాస్తు అట్టి దరఖాస్తు పై సింగరేణి అధికారుల నిర్లక్ష్యం మరియు నిందితుడు రవికుమార్ పై ఆరోపించిన ఆరోపణల పైన దర్యాప్తు కొనసాగుతోంది.
    2
    సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును ఛేదించిన గోదావరిఖని 1టౌన్ పోలీసులు

గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి మృతి చెందిన కేసును గోదావరిఖని 1 టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జెట్టి నవీన్ కుమార్, సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు ఏసిపి ఆధ్వర్యంలో గోదావరిఖని బ్రిడ్జ్, గంగానగర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదేవిధంగా sccl  లో పనిచేస్తున్న ఓవర్ మెన్ బొమ్మకంటి రవి కుమార్ ను ocp -05 మైన్ వద్ద అదుపులోకి తీసుకోడమైనది. 
*నిందితుల వివరాలు*
A-1. జెట్టి నవీన్ కుమార్, తండ్రి పేరు కొమురయ్య, వయస్సు 38 సంవత్సరాలు, ముదిరాజ్, వృత్తి: సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల, సీసీసీ నస్పూర్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్. నివాసం: ఇంటి నం. 7-57/1, జీపీ రావు కాలనీ, గారెపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలం.
A-2. బొమ్మకంటి రవి కుమార్, తండ్రి పేరు సత్తయ్య, వయస్సు 35 సంవత్సరాలు, బీసీ-బి (పద్మశాలి), వృత్తి: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 2 & 2A ఇన్‌క్లైన్ మైన్‌లో ఓవర్‌మన్. నివాసం: ఇంటి నం. 3-2, బుద్ధ ఖుర్ద్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.
*పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు*
- నేరానికి ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు
- నిందితులకు చెందిన రెండు సెల్ఫోన్లు   
- ట్యాబ్
*వివరాల్లోకి వెళితే...*
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  యువతీ అనుమానస్పద  స్థితి లో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన కేసులో రామగుండం పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలు మేరకు పెద్దపల్లి డీసీపీ గారి పర్యవేక్షణ లో గోదావరిఖని ఏసిపి మడత రమేష్ శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా ఫుటేజీ, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ సాంకేతిక ఆధారంగా ఆధారాలను విశ్లేషించి కేసును ఛేదించారు. నిందితుడైన నవీన్ కుమార్‌కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా నవీన్ కుమార్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కాలేజీకి వచ్చే క్రమంలో యువతితో నిందితుడికి సాన్నిహిత్యం ఏర్పడి, అనంతరం అది ప్రేమ సంబంధంగా మారింది. దాన్ని పెళ్లి వరకు తీసుకుపోవాలని నిందితుడు అనుకున్నాడు.
📌యువతి డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని OU యూనివర్సిటీలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ నిమిత్తం గోదావరిఖని వచ్చిన సమయం లో బొమ్మకంటి రవికుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతి నిందితుడు నవీన్ కు దూరంగా ఉంటూ రవికుమార్‌తో సన్నిహితంగా ఉండటాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేక యువతిపై అతనికి తీవ్ర ఆగ్రహం పెరిగి, ఆమెను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకొని సెప్టెంబర్ 12, 2026న యువతిని హత్య చేసేందుకు నవీన్ కుమార్ ముందస్తు ప్రణాళిక ప్రకారం . కాలేజీకి వెళ్లే సమయంలో తన స్నేహితుడి ఇంటి వద్ద పురుగుల మందు తీసుకొని, దానిని వాటర్ బాటిల్‌లో నింపుకుని తన ఈకోస్పోర్ట్ కారులో పెట్టుకొని సెప్టెంబర్ 12న సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో వస్తున్న యువతిని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద తన కారులోకి ఎక్కించుకున్నాడు. అనంతరం ఎన్టీపీసీ, ఎఫ్‌సీఎల్, ఐఓసీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో గొడవపడి, యువతిని మానసికంగా రవికుమార్ చే బలాత్కరించబడినందు వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాపించి ఆమె ఫోన్లో ఫోటోలు తీసి, ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ముందే సిద్ధం చేసుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. దీంతో పురుగుల మందు ఆమె గొంతులోకి వెళ్లి కారులోనే స్పృహ కోల్పోయి మృతురాలిని సకాలంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించే అవకాశం ఉన్నప్పటికీ, తన నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగా వైద్య సహాయం అందించడంలో జాప్యం చేశాడు.
*హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం*
యువతి వెంటనే మృతి చెందకపోవడంతో నిందితుడు కొంతసేపు కారును వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆలస్యం చేశాడు. అనంతరం యువతి స్పృహ కోల్పోయిన తర్వాత, ఆమె మొబైల్ ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. రాత్రి సుమారు 7:30 నుంచి 7:45 గంటల మధ్య యువతిని ఆమె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుండి తప్పించుకొని నవీన్ కుమార్ పారిపోయినాడు.   యువతి చికిత్స పొందుతూ మరుసటిరోజు చనిపోయినది. 
*నేరం బయటపడుతుందనే భయంతో ఆధారాల ధ్వంసానికి ప్రయత్నం*
యువతి మృతితో తన నేరం బయటపడుతుందనే భయంతో నిందితుడు కారును కడిగి, సూసైడ్ నోట్, పురుగుల మందు బాటిల్, మొబైల్ సిమ్‌లను కావాలనే సాక్షాలను దొరకకుండా మాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 
*సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు*
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ తదితర సాంకేతిక ఆధారాలను సమగ్రంగా పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించి కేసునుఛేదించారని  అని డీసీపీ తెలిపారు . అదేవిధంగా బొమ్మకంటి రవి కుమార్ అదేవిధంగా, మృతురాలు శిక్షణ నిమిత్తం వచ్చిన సమయంలో నిందితుడు ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ పరిచయం పెంచుకొని మాటలు కలిపి అనంతరం ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడినట్లు ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.    కేసులో సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు, మరియు మృతురాలు సింగరేణి అధికారులకు ఇచ్చిన దరఖాస్తు అట్టి దరఖాస్తు పై సింగరేణి అధికారుల నిర్లక్ష్యం మరియు నిందితుడు రవికుమార్ పై ఆరోపించిన ఆరోపణల పైన దర్యాప్తు కొనసాగుతోంది.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి
    1
    రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ
రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు
ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    3
    BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను  అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా?
పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్‌లో దొంగల హల్‌చల్.. గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో ఈ చోరీలు జరిగాయి. దుర్శేడ్ ఏటీఎంలోకి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు దుండగులు, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఏటీఎంలోకి ప్రవేశించగానే వారు సీసీ కెమెరాలపై ఒక రకమైన ద్రవాన్ని చల్లి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఏటీఎంలో ఎంత నగదు పోయిందనేది ఇంకా తెలియరాలేదు. దొంగతనానికి పాల్పడినప్పుడు నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లోవ్‌లు ధరించి తమ గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీ కార్యాలయానికి అలారం వెళ్లింది. దీంతో వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో మహబూబ్‌నగర్‌లో ఇలాగే ఒక ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసి రూ. 2.30 లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే విషయంపై పోలీసు అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
    1
    కరీంనగర్‌లో దొంగల హల్‌చల్.. గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలలో ఈ చోరీలు జరిగాయి. దుర్శేడ్ ఏటీఎంలోకి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు దుండగులు, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. 
ఏటీఎంలోకి ప్రవేశించగానే వారు సీసీ కెమెరాలపై ఒక రకమైన ద్రవాన్ని చల్లి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేశారు. ఈ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తిమ్మాపూర్ ఏటీఎంలో ఎంత నగదు పోయిందనేది ఇంకా తెలియరాలేదు.
దొంగతనానికి పాల్పడినప్పుడు నిందితులు టోపీలు, కళ్లద్దాలు, మాస్కులు, గ్లోవ్‌లు ధరించి తమ గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీ కార్యాలయానికి అలారం వెళ్లింది. దీంతో వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. దొంగలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వాహనాన్ని ట్రేస్ చేయడానికి టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణలో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో మహబూబ్‌నగర్‌లో ఇలాగే ఒక ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసి రూ. 2.30 లక్షలు ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే విషయంపై పోలీసు అధికారులు బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.