Shuru
Apke Nagar Ki App…
నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- మంథని లో మంత్రి శ్రీధర్ బాబు కు వింత నిరసన ఎదురయింది. గోవు ద్వారా గోశాల నిర్వాహకుడు వినతి పత్రం సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబును ఆ కాలనీలో ఉన్న గౌతమేశ్వర గోశాల నిర్వహకులు ఆకుల విద్యాసాగర్ వినూత్నంగా వినతి పత్రం సమర్పించారు. గోశాల లోని పార్వతి అనే గోవు ద్వారా గోశాల దీనస్థితిని వినతి పత్రం ద్వారా మంత్రికి విన్నవించారు. మంత్రి కాన్వాయ్ కు ఎదురుగా గోవు గోశాల నిర్వహకుడు రావడంతో మంత్రి కారు దిగి అతని వద్దకు వెళ్ళాడు. గోశాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని సహాయం చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. గతంలో పలుమార్లు వినతులు సమర్పించిన ఎవరూ పట్టించుకోలేదని, గోవుకు వినతి పత్రం కట్టి మీ దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. గోవు వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి గోవుకు అరటిపండు తినిపించి శ్రీపాద ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని గోశాల నిర్వాహకునికి మంత్రి హామీ ఇచ్చారు.2
- భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..1
- హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- Post by Vedam chamdu Vedam1
- మెట్‌పల్లి, ఏప్రిల్ 13: మెట్‌పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్‌టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనితీరు దోచుకో, దాచుకో అనే విధంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి, దోచుకో దాచుకో నైజం కాంగ్రెస్ ది కాదని దానికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ దేనని విమర్శించారు. చేసిన ఆరోపణ పై కేటీఆర్ కు దమ్ముంటే కేంద్రంలోని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు సోదరి కవితక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఓటమి భయంతో కేటీఆర్ ఏదిపడితే ఆది మాట్లాడుతున్నారని ఆరోపించారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు.1