logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మైనర్ బాలిక వివాహం కేసు.. ఇద్దరికి రిమాండ్ బాల్య వివాహం జరిపించిన కుటుంబ సభ్యులపైనా కేసులు గుడిహత్నూర్ ఇంద్రవెల్లి మండలానికి చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడితో పాటు, ప్రేమ పేరుతో ఆమెను అపహరించిన మరో యువకుడిని గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో బాల్య వివాహం జరిపించిన ఇరు కుటుంబాల సభ్యులపైనా కేసులు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు. మూడు నెలల క్రితం మైనర్ బాలికకు కొల్హరీ గ్రామానికి చెందిన రూప్ సింగ్‌తో వివాహం జరగగా, ఈ నెల 25న బాలిక కనిపించడం లేదంటూ అతడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో బాలిక అదే గ్రామానికి చెందిన గుణవంత్ రావ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొచ్చారు. విచారణలో బాలిక మైనర్ అని నిర్ధారణ కావడంతో రూప్ సింగ్‌పై బాల్య వివాహం, గుణవంత్ రావ్‌పై మైనర్‌ను అపహరించిన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ వెల్లడించారు. గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.

8 hrs ago
user_Shaik Mahmood
Shaik Mahmood
Gudihatnoor, Adilabad•
8 hrs ago
e41c8416-c313-45c5-8250-bee3c12d3192

మైనర్ బాలిక వివాహం కేసు.. ఇద్దరికి రిమాండ్ బాల్య వివాహం జరిపించిన కుటుంబ సభ్యులపైనా కేసులు గుడిహత్నూర్ ఇంద్రవెల్లి మండలానికి చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడితో పాటు, ప్రేమ పేరుతో ఆమెను అపహరించిన మరో యువకుడిని గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో బాల్య వివాహం జరిపించిన ఇరు కుటుంబాల సభ్యులపైనా కేసులు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు. మూడు నెలల క్రితం మైనర్ బాలికకు కొల్హరీ గ్రామానికి చెందిన రూప్ సింగ్‌తో వివాహం జరగగా, ఈ నెల 25న బాలిక కనిపించడం లేదంటూ అతడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో బాలిక అదే గ్రామానికి చెందిన గుణవంత్ రావ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొచ్చారు. విచారణలో బాలిక మైనర్ అని నిర్ధారణ కావడంతో రూప్ సింగ్‌పై బాల్య వివాహం, గుణవంత్ రావ్‌పై మైనర్‌ను అపహరించిన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ వెల్లడించారు. గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆదిలాబాద్: కోతకు గురైన పొచ్చర వంతెన.. రాకపోకలకు ఇబ్బంది ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర వాగు వద్ద గల వంతెన కోతకు గురైంది. ఈ రోడ్డు మార్గం గుండా అనునిత్యం కప్పర్ల, బండల్ నాగపూర్ జామిడీ గ్రామాలకు చెందిన వాహనదారులు రాకపోకలను కొనసాగిస్తారు. వంతెన వద్ద పూర్తిగా గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
    1
    ఆదిలాబాద్: కోతకు గురైన పొచ్చర వంతెన.. రాకపోకలకు ఇబ్బంది
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర వాగు వద్ద గల వంతెన కోతకు గురైంది. ఈ రోడ్డు మార్గం గుండా అనునిత్యం కప్పర్ల, బండల్ నాగపూర్ జామిడీ గ్రామాలకు చెందిన వాహనదారులు రాకపోకలను కొనసాగిస్తారు. వంతెన వద్ద పూర్తిగా గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ 
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    18 hrs ago
  • గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా గోరింటాకు సంబరాలు నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆషాడమాసం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోరింటాకు విశిష్టత,ఆరోగ్యం, సంస్కృతి సంప్రదాయం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు,అధ్యాపకులు సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని ఒకరికొకరు పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు.గోరింటాకు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.
    1
    గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా గోరింటాకు సంబరాలు 
నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆషాడమాసం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గోరింటాకు విశిష్టత,ఆరోగ్యం, సంస్కృతి సంప్రదాయం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు,అధ్యాపకులు సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని ఒకరికొకరు  పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు.గోరింటాకు కేవలం అలంకరణకే కాదు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • Promise made ✅ Promise delivered ✅ As promised, the Modi government has stood firmly with students against paper leaks and exam fraud. With the passage of the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026, India has taken a decisive step towards a fair, transparent and credible examination system.
    1
    Promise made ✅
Promise delivered ✅

As promised, the Modi government
has stood firmly with students against paper leaks and exam fraud.
With the passage of the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026, India has taken a decisive step towards a fair, transparent and credible examination system.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    9 hrs ago
  • బోరజ్ మండలంలోని పెనుగంగా నదికి పెరిగిన వరద నీరు....... భోరజ్ మండలంలోని పెనుగంగా నదికి శుక్రవారం వరద నీరు పోటెత్తింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద నీరు తరలిరావడంతో పెనుగంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దని, చేపల వేటకు లేదా ఈతకు వెళ్లే సాహసం చేయవద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలియజేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
    1
    బోరజ్ మండలంలోని పెనుగంగా నదికి పెరిగిన వరద నీరు.......
భోరజ్ మండలంలోని పెనుగంగా నదికి శుక్రవారం వరద నీరు పోటెత్తింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద నీరు తరలిరావడంతో పెనుగంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దని, చేపల వేటకు లేదా ఈతకు వెళ్లే సాహసం చేయవద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలియజేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్‌తో కవ్వాల్‌లో భయాందోళన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    1
    చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్‌తో కవ్వాల్‌లో భయాందోళన
జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది.
స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • దిగ్రాస్ వంతెనను ముంచెత్తిన పెన్‌గంగా నది: నిలిచిన రవాణా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగా నది ఉగ్రరూపం దాల్చింది. దిగ్రాస్ వద్ద ఉన్న ప్రధాన వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదాలు జరగకుండా చూసేందుకు పోలీసులు వంతెన వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరూ వంతెన దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు హెచ్చరించారు
    1
    దిగ్రాస్ వంతెనను ముంచెత్తిన పెన్‌గంగా నది: నిలిచిన రవాణా

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగా నది ఉగ్రరూపం దాల్చింది. దిగ్రాస్ వద్ద ఉన్న ప్రధాన వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదాలు జరగకుండా చూసేందుకు పోలీసులు వంతెన వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరూ వంతెన దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు హెచ్చరించారు
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.