Shuru
Apke Nagar Ki App…
NH -16 ట్రావెల్స్ బస్సు బోల్తా... 12 మందికి తీవ్ర గాయాలు ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారి NH-16 పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున తేలప్రోలు సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులకు తీవ్ర రక్తగాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలింపు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనుక నుంచి వస్తున్న ఓ లారీ, బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొన్న లారీ. లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Sai

More news from తెలంగాణ and nearby areas
- Breaking ఖమ్మం .....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.. ....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట .....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి ....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం ....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు ......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి ......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి ......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ .....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం .....జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది ..... ....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు1
- కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.1
- రాజనగరం నియోజవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మోద కొండమ్మ అమ్మవారు జతర మహోత్సవం1
- దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.1
- నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం.. రైతుల హర్షం! నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.1
- *ఘనంగా ఎంపీ కేసినేని శివనాధ్ జన్మదిన వేడుకలు...* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి కార్యాలయం నందు విజయవాడ పార్లమెంటు మెంబర్ కేసునేని శివనాద్(చిన్ని )గారి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు...* *ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు...*3