Shuru
Apke Nagar Ki App…
*ఘనంగా ఎంపీ కేసినేని శివనాధ్ జన్మదిన వేడుకలు...* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి కార్యాలయం నందు విజయవాడ పార్లమెంటు మెంబర్ కేసునేని శివనాద్(చిన్ని )గారి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు...* *ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు...*
Seelam Ashok Reddy
*ఘనంగా ఎంపీ కేసినేని శివనాధ్ జన్మదిన వేడుకలు...* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి కార్యాలయం నందు విజయవాడ పార్లమెంటు మెంబర్ కేసునేని శివనాద్(చిన్ని )గారి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు...* *ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు...*
More news from తెలంగాణ and nearby areas
- నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం.. రైతుల హర్షం! నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.1
- గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. భద్రత దృష్ట్యా బస్సులో లోపలికి వెళ్లి నిలబడాలని కండక్టర్ సూచించగా, అతను ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.1
- దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.1
- వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం.. ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు . మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు1
- కుక్కల గుంపులు.. దోమల దండయాత్ర! నేలకొండపల్లి మండల ప్రజలకు తప్పని తిప్పలు అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి వీధి కుక్కలు, దోమల బెడదతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి నేలకొండపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు, దోమల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు దోమల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు సరైన చర్యలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు, దోమల నివారణ కోసం ఫాగింగ్, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.1
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి సమీక్ష దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.1
- భరణిపాడులో చిన్నారిపై వీధి కుక్కల దాడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గుల్లపూడి నరసింహారావు కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.2