logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుక్కల గుంపులు.. దోమల దండయాత్ర! నేలకొండపల్లి మండల ప్రజలకు తప్పని తిప్పలు అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ, ఫాగింగ్‌ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి వీధి కుక్కలు, దోమల బెడదతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి నేలకొండపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు, దోమల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు దోమల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు సరైన చర్యలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు, దోమల నివారణ కోసం ఫాగింగ్‌, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

2 hrs ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago

కుక్కల గుంపులు.. దోమల దండయాత్ర! నేలకొండపల్లి మండల ప్రజలకు తప్పని తిప్పలు అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ, ఫాగింగ్‌ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి వీధి కుక్కలు, దోమల బెడదతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి నేలకొండపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు, దోమల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు దోమల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు సరైన చర్యలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు, దోమల నివారణ కోసం ఫాగింగ్‌, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
    1
    పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి
*సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం.. ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు . మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు
    1
    వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి...

వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం..
ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు .  మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
    1
    దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి
నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేతో అనుసంధానం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారితో TG, APరాష్ట్రాల తోపాటు దక్షిణాది- ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద సమావేశంలో మాట్లాడారు. నాగ్ పూర్-అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
    1
    ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేతో అనుసంధానం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారితో TG, APరాష్ట్రాల తోపాటు దక్షిణాది- ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద సమావేశంలో మాట్లాడారు. నాగ్ పూర్-అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి సమీక్ష దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.
    1
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా 
అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి సమీక్ష
దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • అద్దె ఇళ్లల్లో నివసించే చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి. నరసరావుపేట : అద్దె ఇంట్లో నివసించే చేనేత కార్మికులకు పథకాలు వర్తించడం లేదని చేనేతల కార్మికుల కోసం శీలం నేని వెంకటేశ్వర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కరెంటు మీటర్ లేదని ఇంటి పన్ను కాగితాలు కావాలంటూ ఆంక్షలు పెట్టి అద్దె ఇళ్లలో ఉండే చేనేతలకు పథకాలు వర్తించకుండా చేస్తున్నారని ఈ విషయమై ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
    1
    అద్దె ఇళ్లల్లో నివసించే చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి.
నరసరావుపేట : అద్దె ఇంట్లో నివసించే చేనేత కార్మికులకు పథకాలు వర్తించడం లేదని చేనేతల కార్మికుల కోసం శీలం నేని  వెంకటేశ్వర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కరెంటు మీటర్ లేదని ఇంటి పన్ను కాగితాలు కావాలంటూ ఆంక్షలు  పెట్టి అద్దె ఇళ్లలో ఉండే చేనేతలకు పథకాలు వర్తించకుండా చేస్తున్నారని ఈ విషయమై ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.