logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అద్దె ఇళ్లల్లో నివసించే చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి. నరసరావుపేట : అద్దె ఇంట్లో నివసించే చేనేత కార్మికులకు పథకాలు వర్తించడం లేదని చేనేతల కార్మికుల కోసం శీలం నేని వెంకటేశ్వర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కరెంటు మీటర్ లేదని ఇంటి పన్ను కాగితాలు కావాలంటూ ఆంక్షలు పెట్టి అద్దె ఇళ్లలో ఉండే చేనేతలకు పథకాలు వర్తించకుండా చేస్తున్నారని ఈ విషయమై ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

18 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

అద్దె ఇళ్లల్లో నివసించే చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి. నరసరావుపేట : అద్దె ఇంట్లో నివసించే చేనేత కార్మికులకు పథకాలు వర్తించడం లేదని చేనేతల కార్మికుల కోసం శీలం నేని వెంకటేశ్వర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కరెంటు మీటర్ లేదని ఇంటి పన్ను కాగితాలు కావాలంటూ ఆంక్షలు పెట్టి అద్దె ఇళ్లలో ఉండే చేనేతలకు పథకాలు వర్తించకుండా చేస్తున్నారని ఈ విషయమై ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు.
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • Breaking ఖమ్మం .....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.. ....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట .....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి ....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం ....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు ......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి ......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి ......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ .....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం .....జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది ..... ....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు
    1
    Breaking
ఖమ్మం 

.....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల 

మంత్రి తుమ్మల కామెంట్స్..

....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట

.....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి

....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం

....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు 

......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి 

......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి 

......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ

.....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం 

.....జాతీయ రహదారులు
రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ

 ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది 

.....

....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం. ​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.
    1
    లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం.
​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. 
సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    19 hrs ago
  • కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.
    1
    కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు 
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అనంతరం ఆయన నాయనమ్మ కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మనవడికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.నామ కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
    1
    గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అనంతరం ఆయన నాయనమ్మ కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మనవడికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.నామ కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు................... నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
    1
    వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు...................
నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    22 hrs ago
  • భరణిపాడులో చిన్నారిపై వీధి కుక్కల దాడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గుల్లపూడి నరసింహారావు కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
    2
    భరణిపాడులో చిన్నారిపై వీధి కుక్కల దాడి
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గుల్లపూడి నరసింహారావు కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.