Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేతో అనుసంధానం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారితో TG, APరాష్ట్రాల తోపాటు దక్షిణాది- ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద సమావేశంలో మాట్లాడారు. నాగ్ పూర్-అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
ARUNKUMAR
ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేతో అనుసంధానం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారితో TG, APరాష్ట్రాల తోపాటు దక్షిణాది- ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద సమావేశంలో మాట్లాడారు. నాగ్ పూర్-అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
More news from తెలంగాణ and nearby areas
- నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం.. రైతుల హర్షం! నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.1
- ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*2
- గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ లో గౌడభవనం కోసం స్థలం కేటాయింపు జరిగేలా సహకరించండి జిల్లా ఐక్య గౌడసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కి వినతి పత్రం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 3: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడభవన నిర్మాణం కోసం పట్టణ పరిధిలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కు ఐక్యగౌడసంఘాల ఆధ్వర్యంలో గౌడ కులప్రముఖులు వినతి పత్రం సమర్పించా రు వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అత్యంత సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్య క్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్ టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్ గాడిపెళ్లి చరణ్ గౌడ్ గోపా రాష్ట్రనాయకులు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్ మోకుదెబ్బ జిల్లాఅధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్ గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ గౌడసంఘం జిల్లాబాద్యులు పెద్ది వెంకన్న గౌడ్ గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు గుదె వీరన్నగౌడ్ జర్నలిస్ట్ సంఘాల బాధ్యులు ఉమ్మగాని మధుగౌడ్ బాలగాని నవీన్ గౌడ్ చిర్రగోని ఉదయ్ ధీర్ గౌడ్ గౌడ యువజనసంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు నలమాస సాయిగౌడ్ ఉపాధ్యక్షులు గుదే యుగంధర్ గౌడ్ జై గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు కాంచాని శంకర్ గౌడ్ నెల్లికుదరు మండలం అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్ జై గౌడ్ జిల్లా నాయకులు మూల సురేష్ గౌడ్ గాడిపల్లి అనిల్ గౌడ్ గండి రాజేష్ గౌడ్ గౌడ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు1
- Breaking ఖమ్మం .....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.. ....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట .....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి ....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం ....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు ......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి ......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి ......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ .....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం .....జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది ..... ....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు1
- మహబూబాబాద్ లో గౌడభవనం కోసం స్థలం కేటాయింపు జరిగేలా సహకరించండి.. జిల్లా ఐక్య గౌడసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కి వినతి... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడభవన నిర్మాణం కోసం పట్టణ పరిధిలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కు ఐక్యగౌడసంఘాల ఆధ్వర్యంలో గౌడ కులప్రముఖులు వినతి పత్రం సమర్పించారు. *వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అత్యంత సానుకూలంగా స్పందించారు.* ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు. *తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్, టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్, గాడిపెళ్లి చరణ్ గౌడ్, గోపా రాష్ట్రనాయకులు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్, మోకుదెబ్బ జిల్లాఅధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్, గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్, గౌడసంఘం జిల్లాబాద్యులు పెద్ది వెంకన్న గౌడ్, గోపా జిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు గుదె వీరన్నగౌడ్, జర్నలిస్ట్ సంఘాల బాధ్యులు ఉమ్మగాని మధుగౌడ్, బాలగాని నవీన్ గౌడ్, చిర్రగోని ఉదయ్ గౌడ్, గౌడ యువజనసంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు నలమాస సాయిగౌడ్, ఉపాధ్యక్షులు గుదే యుగంధర్ గౌడ్, జై గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు కాంచాని శంకర్ గౌడ్. నెల్లికుదరు మండలం అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్, జై గౌడ్ జిల్లా నాయకులు మూల సురేష్ గౌడ్, గాడిపల్లి అనిల్ గౌడ్, గండి రాజేష్ గౌడ్, గౌడ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు*1
- కుక్కల గుంపులు.. దోమల దండయాత్ర! నేలకొండపల్లి మండల ప్రజలకు తప్పని తిప్పలు అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి వీధి కుక్కలు, దోమల బెడదతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి నేలకొండపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు, దోమల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు దోమల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు సరైన చర్యలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు, దోమల నివారణ కోసం ఫాగింగ్, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.1
- ఎన్నికల హామీలు ఎక్కడ..? గీత కార్మికుల్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ దంతాలపల్లిలో గీత కార్మికుల చైతన్య సభ.. ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలిరావాలని పిలుపు ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ (KGKS) రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో వేలాది గీత కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టి వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, ప్రమాద మరణాలపై రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ బకాయిల చెల్లింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి గౌడల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు మహబూబాబాద్ (మానుకోట) నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే "గీతన్నల చైతన్య యాత్ర"ను విజయవంతం చేయాలని, గీత కార్మికులు, గౌడ సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.. గీత కార్మికుల హక్కులు సాధించే వరకు మా ఉద్యమం ఆగదు" అని రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బబ్బూరి ఉప్పలయ్య, బుర్ర సుధాకర్, తాళ్లపల్లినర్సయ్య, జిల్లా గౌడ సంఘం నాయకులు, మండల సభ్యులు బుర్ర శ్రీనివాస్, చీకటి రామనర్సయ్య, బుర్ర మహిపాల్, కుర్యావుల గణేష్, బుర్ర లింగన్న, కుర్యావుల రమేష్ గుండగాని లింగన్న, కొత్త అంతయ్య , అన్నంత రాములు, దేశగాని అశోక్ లతో పాటు సభ్యులు, గీత కార్మికులు, గౌడ సంఘ ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4