logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్నికల హామీలు ఎక్కడ..? గీత కార్మికుల్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ దంతాలపల్లిలో గీత కార్మికుల చైతన్య సభ.. ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలిరావాలని పిలుపు ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ (KGKS) రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో వేలాది గీత కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టి వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, ప్రమాద మరణాలపై రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ బకాయిల చెల్లింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి గౌడల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు మహబూబాబాద్ (మానుకోట) నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే "గీతన్నల చైతన్య యాత్ర"ను విజయవంతం చేయాలని, గీత కార్మికులు, గౌడ సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.. గీత కార్మికుల హక్కులు సాధించే వరకు మా ఉద్యమం ఆగదు" అని రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బబ్బూరి ఉప్పలయ్య, బుర్ర సుధాకర్, తాళ్లపల్లినర్సయ్య, జిల్లా గౌడ సంఘం నాయకులు, మండల సభ్యులు బుర్ర శ్రీనివాస్, చీకటి రామనర్సయ్య, బుర్ర మహిపాల్, కుర్యావుల గణేష్, బుర్ర లింగన్న, కుర్యావుల రమేష్ గుండగాని లింగన్న, కొత్త అంతయ్య , అన్నంత రాములు, దేశగాని అశోక్ లతో పాటు సభ్యులు, గీత కార్మికులు, గౌడ సంఘ ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

16 hrs ago
user_ఎర్రబోయిన మురళి యాదవ్
ఎర్రబోయిన మురళి యాదవ్
దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
16 hrs ago

ఎన్నికల హామీలు ఎక్కడ..? గీత కార్మికుల్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ దంతాలపల్లిలో గీత కార్మికుల చైతన్య సభ.. ఆగస్టు 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలిరావాలని పిలుపు ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ (KGKS) రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో వేలాది గీత కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టి వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, ప్రమాద మరణాలపై రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్ బకాయిల చెల్లింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి గౌడల సంక్షేమంపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు మహబూబాబాద్ (మానుకోట) నుంచి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే "గీతన్నల చైతన్య యాత్ర"ను విజయవంతం చేయాలని, గీత కార్మికులు, గౌడ సంఘాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.. గీత కార్మికుల హక్కులు సాధించే వరకు మా ఉద్యమం ఆగదు" అని రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బబ్బూరి ఉప్పలయ్య, బుర్ర సుధాకర్, తాళ్లపల్లినర్సయ్య, జిల్లా గౌడ సంఘం నాయకులు, మండల సభ్యులు బుర్ర శ్రీనివాస్,

85a7c46e-eb70-4d6f-8484-21e2c3573d6f

చీకటి రామనర్సయ్య, బుర్ర మహిపాల్, కుర్యావుల గణేష్, బుర్ర

77936ecc-79a2-44b0-83c1-1e52907f5c69

లింగన్న, కుర్యావుల రమేష్ గుండగాని లింగన్న, కొత్త అంతయ్య

1d5be428-d276-437c-8289-5c7b01d9cb26

, అన్నంత రాములు, దేశగాని అశోక్ లతో పాటు సభ్యులు, గీత కార్మికులు, గౌడ సంఘ ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అని– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
    1
    పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం
పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం
నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను
విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు
కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అని– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
    1
    పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి
*సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు................... నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
    1
    వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు...................
నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    21 hrs ago
  • నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు. అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    1
    నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు.
అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • పాడి గేదెపై చిరుత పులి దాడి భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....... *పాడి గేదెపై చిరుత పులి దాడి అంటూ భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు* లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని బంగారుచెలక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి పాడి గేదెపై దాడి చేసిందంటూ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. బంగారుచెలక గ్రామానికి చెందిన కంటెం వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పాడి గేదె అడవి సమీపంలో మేస్తుండగా అకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చిన చిరుతపులి దానిపై దాడి చేసి పట్టుకుందని ఇది గమనించిన తాము వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు తోటి గేదెలన్నీ మూకుమ్మడిగా అరుస్తూ రంకెలు వేయడంతో భయపడిన చిరుత అక్కడ నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను బట్టి చిరుత పులి అని, దానితో పాటు పిల్ల కూడా ఉందని గ్రామస్తులకు తెలియజేసి హెచ్చరికలు జారీ చేశారని, ఒంటరిగా ఎవరు పొలాల వద్దకు వెళ్లవద్దని రాత్రి సమయంలో బయటకు వెళ్ళవద్దని సమూహంగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు టమకా కూడా వేయించారని అన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పులి అని నిర్ధారించకుండా పొంతన లేని సమాచారం ఇస్తున్నారు.
    1
    పాడి గేదెపై చిరుత పులి దాడి  భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....... 
*పాడి గేదెపై చిరుత పులి దాడి అంటూ భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు*
లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని బంగారుచెలక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి పాడి గేదెపై దాడి చేసిందంటూ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. బంగారుచెలక గ్రామానికి చెందిన కంటెం వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పాడి గేదె అడవి సమీపంలో మేస్తుండగా అకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చిన చిరుతపులి దానిపై దాడి చేసి పట్టుకుందని ఇది గమనించిన తాము వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు తోటి గేదెలన్నీ మూకుమ్మడిగా అరుస్తూ రంకెలు వేయడంతో భయపడిన చిరుత అక్కడ నుంచి పారిపోయిందని ప్రత్యక్ష  సాక్షులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను బట్టి చిరుత పులి అని, దానితో పాటు పిల్ల కూడా ఉందని గ్రామస్తులకు తెలియజేసి హెచ్చరికలు జారీ చేశారని, ఒంటరిగా ఎవరు పొలాల వద్దకు వెళ్లవద్దని రాత్రి సమయంలో బయటకు వెళ్ళవద్దని సమూహంగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు టమకా కూడా వేయించారని అన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పులి అని నిర్ధారించకుండా పొంతన లేని సమాచారం ఇస్తున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 min ago
  • సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు
సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    21 hrs ago
  • గుండాల పీహెచ్‌సీపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ మందుల నిల్వలు, సిబ్బంది కొరత, 108 సేవలపై క్షుణ్ణ పరిశీలన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి గడువు, అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వివరాలు సేకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 108 అంబులెన్స్ సేవల పనితీరును సమీక్షించిన బీర్ల అయిలయ్య, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మందుల లభ్యత, గడువు ముగిసే మందుల పరిస్థితి, 108 సేవలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
    1
    గుండాల పీహెచ్‌సీపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ
మందుల నిల్వలు, సిబ్బంది కొరత, 108 సేవలపై క్షుణ్ణ పరిశీలన
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన ఆయన, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి గడువు, అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాలను స్వయంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వివరాలు సేకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం 108 అంబులెన్స్ సేవల పనితీరును సమీక్షించిన బీర్ల అయిలయ్య, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మందుల లభ్యత, గడువు ముగిసే మందుల పరిస్థితి, 108 సేవలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.