పాడి గేదెపై చిరుత పులి దాడి భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....... *పాడి గేదెపై చిరుత పులి దాడి అంటూ భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు* లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని బంగారుచెలక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి పాడి గేదెపై దాడి చేసిందంటూ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. బంగారుచెలక గ్రామానికి చెందిన కంటెం వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పాడి గేదె అడవి సమీపంలో మేస్తుండగా అకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చిన చిరుతపులి దానిపై దాడి చేసి పట్టుకుందని ఇది గమనించిన తాము వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు తోటి గేదెలన్నీ మూకుమ్మడిగా అరుస్తూ రంకెలు వేయడంతో భయపడిన చిరుత అక్కడ నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను బట్టి చిరుత పులి అని, దానితో పాటు పిల్ల కూడా ఉందని గ్రామస్తులకు తెలియజేసి హెచ్చరికలు జారీ చేశారని, ఒంటరిగా ఎవరు పొలాల వద్దకు వెళ్లవద్దని రాత్రి సమయంలో బయటకు వెళ్ళవద్దని సమూహంగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు టమకా కూడా వేయించారని అన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పులి అని నిర్ధారించకుండా పొంతన లేని సమాచారం ఇస్తున్నారు.
పాడి గేదెపై చిరుత పులి దాడి భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....... *పాడి గేదెపై చిరుత పులి దాడి అంటూ భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు* లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని బంగారుచెలక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి పాడి గేదెపై దాడి చేసిందంటూ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. బంగారుచెలక గ్రామానికి చెందిన కంటెం వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పాడి గేదె అడవి సమీపంలో మేస్తుండగా అకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చిన చిరుతపులి దానిపై దాడి చేసి పట్టుకుందని ఇది గమనించిన తాము వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు తోటి గేదెలన్నీ మూకుమ్మడిగా అరుస్తూ రంకెలు వేయడంతో భయపడిన చిరుత అక్కడ నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను బట్టి చిరుత పులి అని, దానితో పాటు పిల్ల కూడా ఉందని గ్రామస్తులకు తెలియజేసి హెచ్చరికలు జారీ చేశారని, ఒంటరిగా ఎవరు పొలాల వద్దకు వెళ్లవద్దని రాత్రి సమయంలో బయటకు వెళ్ళవద్దని సమూహంగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు టమకా కూడా వేయించారని అన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పులి అని నిర్ధారించకుండా పొంతన లేని సమాచారం ఇస్తున్నారు.
- పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*1
- మారుతున్న భద్రాచలం రామాలయ రూపురేఖలు.. వేగంగా పనులు.... భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు నిర్మాణాలను తొలగిస్తూ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల రాకపోకలకు ప్రస్తుతం తూర్పు వైపు మార్గాన్ని అందుబాటులో ఉంచారు. రూ.200.89 కోట్లతో చేపట్టే పనులను విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అని– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.1
- *భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్ భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.1
- కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.1
- పాడి గేదెపై చిరుత పులి దాడి భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....... *పాడి గేదెపై చిరుత పులి దాడి అంటూ భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు* లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని బంగారుచెలక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి పాడి గేదెపై దాడి చేసిందంటూ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. బంగారుచెలక గ్రామానికి చెందిన కంటెం వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పాడి గేదె అడవి సమీపంలో మేస్తుండగా అకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చిన చిరుతపులి దానిపై దాడి చేసి పట్టుకుందని ఇది గమనించిన తాము వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో పాటు తోటి గేదెలన్నీ మూకుమ్మడిగా అరుస్తూ రంకెలు వేయడంతో భయపడిన చిరుత అక్కడ నుంచి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను బట్టి చిరుత పులి అని, దానితో పాటు పిల్ల కూడా ఉందని గ్రామస్తులకు తెలియజేసి హెచ్చరికలు జారీ చేశారని, ఒంటరిగా ఎవరు పొలాల వద్దకు వెళ్లవద్దని రాత్రి సమయంలో బయటకు వెళ్ళవద్దని సమూహంగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు టమకా కూడా వేయించారని అన్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పులి అని నిర్ధారించకుండా పొంతన లేని సమాచారం ఇస్తున్నారు.1
- ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి (సవరించిన రూపం) రంగం భవిష్యవాణిలో స్వర్ణలత. "ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు? నేను ఎందుకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి? నేను మీ మాటలను గౌరవిస్తున్నాను. కానీ మీరు నా మాటను ఆచరిస్తున్నారా? నేను కోరింది మీరు చేస్తున్నారా? మీ ఆపదల్లో నేను అండగా నిలిచాను. మీకు వచ్చిన కష్టాలను తొలగించాను. నా పిల్లలను ఎప్పుడూ కాపాడుతున్నాను. ఏ ప్రమాదం వచ్చినా వారికి రక్షణగా ఉంటాను. కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదు. ఈ సంవత్సరం నేను మీకు హెచ్చరిస్తున్నాను. భారీ వర్షాలు కురుస్తాయి. వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నా భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను. అయితే నా మాటలను గౌరవించి, ధర్మాన్ని పాటిస్తూ, భక్తితో నడుచుకోవాలి. అప్పుడు నా అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది."1
- కోయంబత్తూర్‌లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....1