ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు జలకళ... మత్తడి దూకే అవకాశం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. భారీగా వచ్చి చేరుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే నర్మాల ప్రాజెక్టును సందర్శించిన మానేర్ జలకళను పరిశీలించారు. నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రెండు టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు లో ప్రస్తుతం 1.7 టిఎంసీలకు నీరు చేరింది. కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. ఇదే స్థాయిలో వరద వస్తే గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు జలకళ... మత్తడి దూకే అవకాశం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. భారీగా వచ్చి చేరుతుండటంతో ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే నర్మాల ప్రాజెక్టును సందర్శించిన మానేర్ జలకళను పరిశీలించారు. నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రెండు టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు లో ప్రస్తుతం 1.7 టిఎంసీలకు నీరు చేరింది. కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. ఇదే స్థాయిలో వరద వస్తే గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
- అన్ని రైల్ మిల్లులలో విజిలెన్స్ దాడులు జరగాలి.సియంఆర్ బియ్యం అమ్ముకున్న వారి పైన పిడి యాక్ట్ పెట్డాలి. గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ విజిలెన్స్ దాడులలో వివక్ష ఎందుకు. పెద్దవారిని వదిలి పేట్టి చిన్న రైస్ మిల్లుల మీద కేసులు పెడుతున్నారు. కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు పెద్దఎత్తున అక్రమాలు చేసిన వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలి పెడుతున్నారని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం పెద్దలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సివిల్ సప్లయ్ వ్యవస్థకు తూట్లు పొడిచిన వారిని, అనేక అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడంలో అర్థం ఏమిటని వారు అన్నారు. కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు మరియు కొందరు బడా రైస్ మిల్లర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును ప్రతిపక్ష పార్టీ కూడ ముగబోయయిఅని ఇంతా పెద్దఎత్తున సియంఆర్ బియ్యం గల్లంతు కావడం అంటే దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని వారు అన్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న కరీంనగర్ సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఏసీకే బకాయిదారులుటెండర్ నిబంధనల ఉల్లంఘన చేసి జిల్లాలో వందల ఏసీకే బకాయిలు ఉన్నప్పటికీ, 2022-23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం వేలంలో బకాయి డబ్బులు చెల్లించని వారికి మరియు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలలో ధాన్యం నిల్వ లేనట్లు తేలిన 25% పెనాల్టీ చెల్లించాలన్న నాటి సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూన్న వ్యక్తులకు మళ్లీ మళ్ళీ ధాన్యాన్ని కట్టబెట్టడంలో మతులాబు ఏమిటని వారు అన్నారు. చిన్న మిల్లర్లపై కక్షసాధింపు చర్యలు బడా మిల్లర్లకు నిబంధనలకు విరుద్ధంగా లాభం చేకురుస్తూ సామాన్య, చిన్న రైస్ మిల్లర్లపైన మాత్రం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ జిల్లాలో ఆనిబంధనను పక్కనపెట్టి అధికారుల అలసత్వం ప్రదర్శించడం వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని వారు అన్నారు. కొన్ని రైస్ మిల్లులలో స్టాక్ లేకుండానే అక్రమ షిఫ్టింగ్ కొంతమంది బడా రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వ లేకపోయినా, ఉన్నట్లు చూపించి 25% పెనాల్టీ పడకుండా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల పైన త్వరలోనే ఆధారాలతో సహా పిర్యాదు చేస్తామని వారు అన్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై మరియు మిల్లర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు1
- *శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు* *రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్* *--రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు... ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు..రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.4
- విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు సుమారు రెండు గ్రామాలు కలిపి 40 మంది పైగా ప్రతిరోజు జనగాం పోయే ఆర్టీసీ బస్సు రావడం లేదని నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిశారు వారి ఆవేదన చెప్పారు వెంటనే స్పందించి బస్సు వేయాలని ఆర్ఎం జనగామ కోరారు నారాయణపూర్ పోచన్నపేట మీదుగా జనగాం వెళ్లే జనగామ డిపో కు చెందిన RTC బస్ ఉదయం ట్రిప్పు రావడంలేదని స్కూల్ విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు లు సుమారుగా రెండు గ్రామాలు కలిపి 40 కి పైబడి విద్యార్థులు ప్రతిరోజు నారాయణపురం పోచన్నపేట గ్రామాల నుండి జనగాం వెళ్లి చదువుకునే వీలుగా ఈ బస్సు ఉండేది కానీ గత నాలుగు రోజుల నుండి ఈ బస్సు రావడం లేదని రెండు గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి వారి స్కూళ్లకు మరియు కాలేజీలకు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బస్సు రాకపోవడతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మసూద్ గారి చొరవతో మరియు జిల్లా కార్యదర్శి దత్రపు నరేష్ ఇట్టి విషయం తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థులకు నష్టం జరగకూడదని ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని జనగామ డిపో మేనేజర్ ఉషా గారితో మాట్లాడి సమస్య పరిష్కరించి వెంటనే పార్టీ సర్వీస్ను తిరిగి యధావిధిగా అదే టైం కు జనగామ వరకు నడపాలని కోరగా వారు స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు1
- విస్తృత స్థాయిలో జనగామ నగరంలో వాటర్ ప్లాంట్ ల తనిఖీ... జిల్లా కేంద్రమైన జనగామ నగరంలో మున్సిపల్ అధికారులు విస్తృత స్థాయిలో పాల కేంద్రాలను, వాటర్ ప్లాంట్ లను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు.బుధవారం ఉదయం ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈరోజు ఉదయం కొన్ని పాల సెంటర్లను,వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేసి వాటి శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ నుండి వచ్చే రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.1
- తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.1
- శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.1
- కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.2
- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ *డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15వ తారీకు లోపు డివిజన్ కమిటీలు నియమించాలి* *పార్టీ బలోపేతం కోసం ప్రతి నెలలో మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం* స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యుల సమావేశం లో అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీకు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలి. కమిటీలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్చార్జిగా నియమించడం జరుగుతుంది. వీరు ఆయా డివిజన్లోని కార్యకర్తలను డివిజన్ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను సమన్వయ పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే, ప్రతిష్టంగా ఉంటాం, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేసినామని ఆలోచించాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, దానికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి. అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాలి, పార్టీ మీ మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చింది. మీ అందరి మీద గురుతరమైన బాధ్యత ఉంది. డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వరుసగా మూడు కార్యక్రమాలకు హాజరు కాకపోతే వారిని పదవుల నుండి తొలగించడం జరుగుతుంది. సర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరును ఎన్రోల్ చేయించాలి, అనార్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలి ఇది మీ బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులుఈ పర్వత మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,వంగల విద్యాసాగర్, గంట కళ్యాణి,మూల రవీందర్ రెడ్డి, నేహాల్, ఇమ్రాన్, కిమ్ ఫహాద్ ,కోడూరు రవీందర్ గౌడ్, దన్న సింగ్,కుంభాల రాజకుమార్,కలీముద్దీన్, రేగొండ సందీప్, పొన్నం మధు, అమేర్,వసీం,సరిల్ల రతన్ రాజు, మిరియాల రవీందర్ రెడ్డి, మూల జైపాల్, లైక్,గడప అజయ్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కొలగాని అనిల్,సత్తినేని శ్రీకాంత్, బషీరుద్దీన్, అహమ్మద్ అలీ, హాజీ, సాయిని తిరుపతి, ఖదీర్, దండి రవీందర్,మంద మహేష్, ఇమ్రాన్ఘని,కపిల్ మాధవ్, పెంట శేఖర్, అట్టేపు వేణు,శిల్ప,రోళ్ళ సతీష్, జీలకర్ర రమేష్,చిలుక హనుమంత రెడ్డి, జ్యోతి రెడ్డి, వీర దేవేందర్, మాలోతు మహాలక్ష్మి, మాజీద్ అలీ ఖాన్, రాహుల్, అందే శంకర్, హైమద్, స్వప్న శ్రీ, పాషా,3
- సినిమా సీరియల్ లో చాన్స్ అని సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఛాన్స్ ఇస్తానంటే అసలే నమ్మొద్దు : ఒక మహిళ ఆవేదన *ఒంటి మీద చేయి వేయనిదే ఎవడూ ఛాన్స్ లు ఇవ్వడు..!* సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఎవడైనా సినిమాల్లో సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామంటే అస్సలే నమ్మొద్దు..! వాడితో సెక్స్ కమిట్మెంట్ లేనిదే ఎవడూ అవకాశమివ్వడు..! సినిమా రంగంలోకి ఆడవాళ్లు రావొద్దు... ఈ రొంపిలో దిగకండి..! సినిమా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కచ్చితంగా కమిట్ అయినవాళ్లే..! ఓ యువతి సంచలన ఆరోపణలు... స్వీయ అనుభవాలను వివరిస్తూ వీడియో విడుదల..!1