logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కీసర పోలీస్ స్టేషన్‌లో మరో లంచం కేసు.. రూ.2 లక్షలు తీసుకుంటూ ఎస్‌ఐ పట్టుబాటు! కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే, తాజాగా మరో ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు వెలుగుచూడటంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే వరుసగా అవినీతి ఆరోపణలు రావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

20 hrs ago
user_Bhaskar Reddy
Bhaskar Reddy
Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
20 hrs ago

కీసర పోలీస్ స్టేషన్‌లో మరో లంచం కేసు.. రూ.2 లక్షలు తీసుకుంటూ ఎస్‌ఐ పట్టుబాటు! కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే, తాజాగా మరో ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు వెలుగుచూడటంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే వరుసగా అవినీతి ఆరోపణలు రావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.
    1
    అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు
హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • వెంకటేశ్వర నగర్‌లో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో మదర్ థెరిస్సా స్కూల్ సమీపంలోని రామ్‌దేవ్ మినీ సూపర్ మార్కెట్‌లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. బీజేపీ నాయకుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాపునకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానికి జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    వెంకటేశ్వర నగర్‌లో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తి నష్టం
హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో మదర్ థెరిస్సా స్కూల్ సమీపంలోని రామ్‌దేవ్ మినీ సూపర్ మార్కెట్‌లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. బీజేపీ నాయకుడు రామ్ ప్రదీప్ మునుగంటి ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షాపునకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో యజమానికి జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు - బాధిత మహిళా ప్రొఫెసర్
    1
    అట్లాస్ జానయ్య వేధింపులు అరికట్టాలని అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసన ర్యాలీ 
వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్
అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య 
మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య
డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు
- బాధిత మహిళా ప్రొఫెసర్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    15 hrs ago
  • అక్రమంగా అండాల సేకరణ: ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు! హైదరాబాద్, నవంబర్ 10: నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అక్రమంగా అండాలు (Eggs) సేకరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని ఐదు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centres) కమిషన్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్స్ సోమవారం బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరయ్యారు. ​ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ (Indira IVF Centre), నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ (Narmada Fertility Centre), ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ (Oasis Fertility Centre), సద్గురు ఏఆర్టీ సెంటర్ (Sadguru ART Centre), పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ (Padmaja Fertility Centre) లపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరైన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తమ వివరణలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంది. ​అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 (ART Act) ప్రకారం అండ దాతల నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం, తగిన వైద్య రక్షణలు కల్పించడం, అండాల సేకరణపై నిర్దేశించిన పరిమితులను పాటించడం తప్పనిసరి. అయితే ఈ ఐదు కేంద్రాలు సదరు నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అన్న కోణంలో కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. మహిళల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రులు ఇచ్చే వివరణలు, సాక్ష్యాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ​కీలక ముఖ్యాంశాలు: - ​మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలపై ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు - ​ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు, పద్మజా ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ప్రతినిధులు హాజరు - ​బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం - ​ఏఆర్టీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ - ​వివరణలు, ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషన్ స్పష్టీకరణ
    1
    అక్రమంగా అండాల సేకరణ: ఐదు ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!
హైదరాబాద్, నవంబర్ 10:
నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అక్రమంగా అండాలు (Eggs) సేకరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని ఐదు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centres) కమిషన్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, సెంటర్ హెడ్స్ సోమవారం బుద్ధభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరయ్యారు.
​ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ (Indira IVF Centre), నర్మదా ఫెర్టిలిటీ సెంటర్ (Narmada Fertility Centre), ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ (Oasis Fertility Centre), సద్గురు ఏఆర్టీ సెంటర్ (Sadguru ART Centre), పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ (Padmaja Fertility Centre) లపై నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరైన ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తమ వివరణలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంది.
​అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 (ART Act) ప్రకారం అండ దాతల నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవడం, తగిన వైద్య రక్షణలు కల్పించడం, అండాల సేకరణపై నిర్దేశించిన పరిమితులను పాటించడం తప్పనిసరి. అయితే ఈ ఐదు కేంద్రాలు సదరు నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అన్న కోణంలో కమిషన్ సమగ్ర విచారణ జరుపుతోంది. మహిళల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం, పునరుత్పత్తి హక్కులకు భంగం వాటిల్లిందా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఆసుపత్రులు ఇచ్చే వివరణలు, సాక్ష్యాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
​కీలక ముఖ్యాంశాలు:
- ​మహిళల నుంచి అక్రమంగా అండాల సేకరణ ఆరోపణలపై ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు
- ​ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు, పద్మజా ఫెర్టిలిటీ కేంద్రాలకు చెందిన ప్రతినిధులు హాజరు
- ​బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరేళ్ల ఎదుట హాజరై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం
- ​ఏఆర్టీ (రెగ్యులేషన్) చట్టం-2021 నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ
- ​వివరణలు, ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషన్ స్పష్టీకరణ
    user_NAINI SHARATH REDDY
    NAINI SHARATH REDDY
    Local News Reporter Balapur, Ranga Reddy•
    2 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
    1
    రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర
గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత
దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన
వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • కీసర పోలీస్ స్టేషన్‌లో మరో లంచం కేసు.. రూ.2 లక్షలు తీసుకుంటూ ఎస్‌ఐ పట్టుబాటు! కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే, తాజాగా మరో ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు వెలుగుచూడటంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే వరుసగా అవినీతి ఆరోపణలు రావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
    1
    కీసర పోలీస్ స్టేషన్‌లో మరో లంచం కేసు.. రూ.2 లక్షలు తీసుకుంటూ ఎస్‌ఐ పట్టుబాటు!
కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ఇదే పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే, తాజాగా మరో ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు వెలుగుచూడటంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే వరుసగా అవినీతి ఆరోపణలు రావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
    1
    మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు
మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.