Shuru
Apke Nagar Ki App…
భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు.. అమ్మవారి సేవలో మంత్రి జూపల్లి హైదరాబాద్‌లోని రామభక్ష బండ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందన్నారు.
NAVADEEP
భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు.. అమ్మవారి సేవలో మంత్రి జూపల్లి హైదరాబాద్‌లోని రామభక్ష బండ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...1
- యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి* *డీ యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి* *జగన్ రెడ్డి కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదు* *ప్రజలను మభ్యపెట్టాలని దీక్షలతో ఇబ్బంది పెట్టాలని చుస్తే టీడీపీ పార్టీ సహించదు* ఎమ్మిగనూరు నియోజకవర్గం లో డీ యస్ సి లో అవకతవకలు జరిగాయాని వైసీపీ చేస్తున్న దొంగ దీక్షలు మానుకోవాలని ఎమ్మిగనూరు పట్టణ కోశాధికారి విజయలక్ష్మి గారు హితావు పలికారు. ఈరోజు మహా ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులకు సోమప్ప సర్కిల్ సాక్షిగా బ్యానర్ చూపిస్తూ సవాల్ విసిరారు.గత వైసీపీ హయాంలో మెగా డీ యస్ సి హామీ నీ మరిచి డీ యస్ సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ రెడ్డి ఈరోజు డీ యస్ సి గురించి మాట్లాడటం విడ్డురం అని తెలిపారు. మా లోకేష్ బాబు గారు బహిరంగ సవాల్ విసిరిన ఎందుకు జగన్ రెడ్డి తప్పించుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు. దాదాపు రెండువందలకు పైగా కేసులు వేపించిన హైకోర్టు మోటిక్కయాలు వేసిన వైసీపీ కి సిగ్గు రాలేదని ఆమె ఏద్దేవా చేశారు.వైసీపీ దీక్షలలో ఒక్కరైనా అన్యాయం జరిగింది అనే డీ యస్ సి అభ్యర్తి ఉన్నారా? అని ప్రశ్నించారు. రౌడీ మూకలను దీక్షలలో కూర్చోబెట్టి పబ్లిక్ కి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎన్ని దొంగ దీక్షలు చేసిన ర్యాలీ లు చేసిన కూటమి మాట ప్రకారం ప్రతీ యేటా మెగా డీ యస్ సి ఇస్తుంది నిరుద్యోగులు జీవితలలో వెలుగు నింపుతుందని ఆమె తెలిపారు. నిన్న డీ యస్ సి లో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు పై నుండి వైసీపీ కి వార్నింగ్ ఇచ్చారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు మీ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని విజయలక్ష్మి హెచ్చరించారు.1
- ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.1
- విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను... విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణలోని నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.1
- కోడుమూరు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ భరో.. *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ బరో* కోడుమూరు : ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్షాల నాయకులు రాజు, శేషుకుమార్, గఫుర్ మియ్యా, మోహన్ లు మాట్లాడుతూ గత నెలలో విద్యార్ధి, యువత చేపట్టిన ఉద్యమం మోదీ ప్రభుత్వానికి చెమటలు పట్టించ్చిందాన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత తో మోదీ ప్రభుత్వం చేస్తోన్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలన్నారు. అమెరికతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దుచెయ్యాలని, 4 లేబర్ కొడ్లను,విబి జిరాంజీ చట్టాలను రద్దుచెయ్యాలని, అసంగటిత కార్మికులందరికి రు 31/వేలు వేతనం ఇవ్వాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దూల్ల భాస్కర్, బుగిడే మాధవస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు కిషోర్, రాము, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాముడు, జి, రామాంజనేయులు, తిమ్మప్ప, ఢిల్లీ వెంకటేశ్వర్లు,బోయ రామాంజనేయులు, ఆటో యూనియన్ నాయకులు మధు, కాటన్న గారి రామకృష్ణ, హమాలీసంగం నాయకులు వెంకటస్వామి, బజారి, అనిల్, మధు, మణి, మహిళా సంఘం నాయకులు సులోచనమ్మ సీపీయం నాయకులు కామర్తి రాజు, ఈరన్న, లక్ష్మన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.1
- Hyderabad’s Ganga-Jamuni Tehzeeb Shines During Bonalu Celebrations Hyderabad: Bonalu celebrations in Kumarwadi Colony, Edi Bazar, once again showcased the city’s famous Ganga-Jamuni tehzeeb, where people from Hindu and Muslim communities were seen coming together and participating in the festive atmosphere with mutual respect and harmony. During the Bonalu festival, local residents gathered in the area as devotees took part in traditional celebrations and religious rituals. The presence and support of people from different communities reflected Hyderabad’s long-standing culture of peace, brotherhood and communal harmony. The scenes from Kumarwadi Colony are a reminder that festivals can bring people closer and strengthen the bond between communities. Despite differences in religion and traditions, residents stood together and shared the spirit of celebration. Hyderabad has historically been known for its Ganga-Jamuni tehzeeb, where different communities live together, respect each other’s traditions and stand by one another during important occasions. The Bonalu celebrations at Edi Bazar gave a positive message of unity — Hindu aur Muslim jab ek saath khade hote hain, toh Hyderabad ki asli khoobsurti nazar aati hai. Such moments of communal harmony deserve to be highlighted and encouraged, especially at a time when society needs more messages of peace, understanding and brotherhood.1
- మొసలి ముందు కూర్చొని పురోహితుడు పూజలు... బీచుపల్లిలో ఆసక్తికర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్ద ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నదిలో ఉండాల్సిన ఓ మొసలి పుష్కర ఘాటు సమీపంలోని భవనంలోకి రావడంతో భక్తులు,సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.కుంకుమ,పసుపు పుష్పాలతో మొసలికి పూజలు చేశారు.మొసలి వరుణ దేవుని వాహనమని,సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభూక్షింగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు పురోహితుడు తెలిపారు.మొసలికి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.1