ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గద్వాల శ్యాసన సభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శ్యాసన సభ్యులు నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర 30 రోజుల ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ల్లో ఒకటి రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు పడాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని , అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గద్వాల శ్యాసన సభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శ్యాసన సభ్యులు నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర 30 రోజుల ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ల్లో ఒకటి రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు పడాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని , అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ శుక్రవారం నంగునూరు మండలంలోని నర్మెట్టలో ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఫ్యాక్టరీ లో అడిషనల్ DGP మహేష్ భగవత్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పలువురు అధికారులు పర్యటించి కార్యక్రమం నిర్వహించనున్న సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజా పాలనలో రైతు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు మరియు ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 22వ తేదీ నాడు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారిక పాసులను జారీ చేయడం జరుగుతుందని, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, స్టాళ్ల సందర్శన, ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరణ, వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యట పర్యటన వివిధ స్థాయిలలో విధులను కేటాయించిన అధికారులు మాత్రమే ఉండి ఆయా శాఖలకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రజలకు సరిపడు మరుగుదొడ్లు, త్రాగునీరు వసతి కల్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టం, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్, వైద్య శిబిరం, పార్కింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ప్రాపర్ గా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, ఉద్యానవన, ఐ అండ్ పిఆర్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించకుండ, జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా,యూత్ డిక్లరేషన్, విద్యా భరోసను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి వేదికగా బడ్జెట్ ప్రతులను చించివేసి విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ... అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయించి మొత్తం బడ్జెట్లో కేవలం (8.22%)ప్రకటించిడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ విద్యాశాఖపై ఉన్న చిత్తశుద్ధితో స్పష్టమైంది. కోఠారి కమిషన్ విద్యారంగానికి 30% నిధులు కేటాయింపులు చేయాలని సూచించినప్పటికి విద్యా కమిషన్ 18% నిధులు కేటాయించాలని చెప్పినప్పటికి ఏ మాత్రం పట్టించుకోకుండా 8.22% నిధులనే కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు. పేద మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటే బడ్జెట్లో కనీసం ఊసేత్తకపోవడం సిగ్గుచేటు ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ జాడలేదు నిరుద్యోగ భృతి అంశం మచ్చుకకైనా బడ్జెట్లో కనిపించకపోవడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఏపాటి ప్రేముందో తేటతెల్లమైంది. యూత్ డిక్లరేషన్ కింద యువతకు వడ్డిలేని 10 లక్షలు రుణాలు, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రస్తావన లేదు,విద్యా భరోసా పత్తా లేకుండా పోయింది. బడ్జెట్లో గురుకుల విద్యాలయాల గురించి ఏమి పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదు. ఈ బడ్జెట్ విద్యార్థి, యువత, నిరుద్యోగ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం జీతాలు వేతనాలు పెన్షన్ల చెల్లింపులకే సరిపోతుందే తప్ప విద్యారంగ సంస్కరణలకు చిల్లి గవ్వ కూడా మిగలదు. రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టి ఈ హామీ ప్రకారం ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 10వ తరగతి పాసయితే రూ.10,000, ఇంటర్ పాసయితే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చి నిన్నటి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు రూ.10 వేల ఫెలోషిప్ ఇస్తామన్నారు.కానీ నిధుల కేటాయింపు మాత్రం శూన్యం. విద్యార్థులు అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం ఉద్యోగల కల్పన కోసం బిఆర్ఎస్వి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటాయి కాంగ్రెస్ పార్టీని దించే వరకు పోరాడుతది ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు కాటం శివ, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, రమేష్ గౌడ్, శీను నాయక్, రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, అవినాష్, పవన్, కొండ గణేష్, రాకేష్, వినోద్ కార్తీక్ తదితరులు పాల్గొనారు.1
- సంగారెడ్డి వైకుంటపురంలో శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలు1
- అనంతపురం నగరంలో 50 వ డివిజన్ లో చెత్త, ప్లాస్టిక్ కొన్ని నెలలుగా కలుస్తున్న పట్టించుకొని అధికారులపై ప్రజల ఆగ్రహం నగరంలో విచ్చలవిడిగా చెత్తను కాలుస్తూ ఉన్నా ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం1
- యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్ పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.3
- Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ *_2026-27 సం,, యొక్క తైబజార్ మరియు పశువుల సంత ఆదాయం 89,00,000/-_* తేదీ:20-03-2026 రోజున గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమీషనర్ R వెంకట గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క *తైబజార్ మరియు పశువుల సంతను* కార్యాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగినది. ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా E. భిక్షపతి రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం 19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది. *కమీషనర్* *పురపాలక సంఘo* *గజ్వేల్-ప్రజ్ఞాపూర్*4
- తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించని తీరు నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నేతృత్వంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం లో వికలాంగులు బట్టలు చింపుకొని, బలుసు ఆకులు తింటూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 'అభయహస్తం' మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తామని ఆర్టీసీ బస్సుల్లో 100% రాయితీతో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల అమలకై బడ్జెట్ లో పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని మోసం చేసిన తీరు బాధాకరమని ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించి 3000 కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని గత రెండేళ్లుగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వికలాంగుల ఆశలపై బట్టి బడ్జెట్ నీళ్లు చల్లిందని వెంటనే బడ్జెట్ మంత్రి బట్టి తన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా వికలాంగుల సంక్షేమానికి పాటుపడేలా 3,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సుధాకర్, సంఘం మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి, వెగ్గలం సత్యం, కీసర సక్కుబాయి, ఉరుముల ఆదయ్య, నరసమ్మ, ఊటుకూరి పద్మ, ముత్తమ్మ, కొల్లూరి నాగరాజు, పబ్బు శంకర్ తదితరులు పాల్గొన్నారు.1
- అనంతపురం అనిల్ కుమార్ గత 4 సంవత్సరాల్లో ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2 లక్షల బట్ట సంచులు ప్రజలకు ఉచితంగా పంచాడు అనంతపురం అనిల్ కుమార్. ఇందులో పాత చీరలతో చేసిన సంచులు , కాన్వాస్ బట్ట తో చేసిన సంచులు , శాటిన్ బట్టతో చేసిన సంచులు ఉండడం విశేషం దీనిద్వారా సుమారు 140 మంది టైలర్లకు ఉపాధి లభించింది తద్వారా వీరు సుమారు 18 లక్షల రూపాయలు కుట్టు కూలి గా సంపాదించారు1