logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రోడ్డు మార్గంపై విభేదాలు… కొట్లాటకు దిగిన గ్రామస్తులు. రహదారి మంజూరు రెండు గ్రామాల మధ్య వివాదం రేపగా..వారు కొట్టుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామం రోడ్డు నిర్మాణానికి ఇటీవల రూ. 90 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. పనులు కోర్రుబయలు గ్రామం మీదుగా చేపట్టనుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం మంగళవారం ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది.

2 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

రోడ్డు మార్గంపై విభేదాలు… కొట్లాటకు దిగిన గ్రామస్తులు. రహదారి మంజూరు రెండు గ్రామాల మధ్య వివాదం రేపగా..వారు కొట్టుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామం రోడ్డు నిర్మాణానికి ఇటీవల రూ. 90 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. పనులు కోర్రుబయలు గ్రామం మీదుగా చేపట్టనుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం మంగళవారం ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశాల మేరకు రాజాంలో మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ మార్చ్ ర్యాలీ చేపట్టారు. మహిళల భద్రతపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహిళలపై వేధింపులు, దాడులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై చట్టపరమైన చర్యలు, రక్షణ మార్గాలపై అవగాహన కల్పించారు.
    2
    VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశాల మేరకు రాజాంలో  మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ మార్చ్ ర్యాలీ చేపట్టారు. మహిళల భద్రతపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహిళలపై వేధింపులు, దాడులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై చట్టపరమైన చర్యలు, రక్షణ మార్గాలపై అవగాహన కల్పించారు.
    user_Journalist naidu
    Journalist naidu
    Graphic designer విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పోలవరం జిల్లా... గంగవరం మండలం కొమరవరం గ్రామం నల్లగొండ అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఉన్నట్టు సమాచారం. తాళ్లపాలెం అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వెళ్లినట్టు తెలుస్తుంది. పెద్దపులి కదలికలపై పొలాల్లోకి వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
    1
    పోలవరం జిల్లా...
గంగవరం మండలం కొమరవరం  గ్రామం నల్లగొండ అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఉన్నట్టు సమాచారం.
తాళ్లపాలెం అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వెళ్లినట్టు తెలుస్తుంది.
పెద్దపులి కదలికలపై పొలాల్లోకి వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
మరోపక్క అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
    user_AP NEWS
    AP NEWS
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నరసన్నపేట : నిరుద్యోగులకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని అన్నారు
    1
    నరసన్నపేట : నిరుద్యోగులకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని అన్నారు
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్ సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్ సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    14 min ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    13 hrs ago
  • ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.
    1
    ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా,భామిని మండలం, బిల్లుమడలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. మూడు ఏనుగుల గుంపులో ఒడిస్సా నుండి వచ్చిన మరో గున్న ఏనుగు చేరడంతో నాలుగు ఏనుగులు కలిపి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అచ్యుతరావు అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటతో పాటు క్షేత్రంలో ఉన్న వ్యవసాయ మోటారు ను ఏనుగులు నాసనం చేసాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా,భామిని మండలం, బిల్లుమడలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. మూడు ఏనుగుల గుంపులో ఒడిస్సా నుండి వచ్చిన మరో గున్న ఏనుగు చేరడంతో నాలుగు ఏనుగులు కలిపి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 
అచ్యుతరావు అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటతో పాటు  క్షేత్రంలో ఉన్న వ్యవసాయ మోటారు ను ఏనుగులు నాసనం చేసాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
    user_Journalist naidu
    Journalist naidu
    Graphic designer విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.