నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాదులో అచ్చినము వచ్చి రెండు రోజులు అవుతుంది మూడు స్కానింగ్ రాసింది రెండు స్కానింగ్ ఇప్పుడు వచ్చినయ్ యూరిన్ రిపోర్ట్ రావాలా మూడు రోజుల కాస్త బాగా స్లో ఉంది లేనివాడు వస్తే ఇబ్బంది మూడు స్కాన్లకు రెండు రోజులు అయితే డాక్టరు శనివారం బుధవారం ఉంటాడట ఇట్లా ఉంటే ఎమర్జెన్సీకి ఎట్లా అక్కడ వెళ్తూనేమో రిపోర్టులో వచ్చిందాకా ఆగమని చెప్తుర్రు బాబు సీరియస్ అవుతుందో ఇక ఎవరు పట్టించుకోలేదు పోచారం శ్రీనివాస్ రెడ్డి లెటర్ రాసి పంపించిన పట్టించుకుంటలేదు నిన్ను ఒక డాక్టర్ సీరియస్ అవుతోంది పోచారం రిపోర్ట్ చేయాలంటూ పోచారం సార్ అసలు సార్ కాసుంటది భయపడతారు పోచారం పోచారం సార్ పంపించినట్టు చూశారు ఇద్దరు ముగ్గురు పట్టించుకున్నారు మేము డాక్టర్లు పట్టించుకుంటుంది ఒక డాక్టర్ అయితే సీరియస్ అయితుంది సార్ శనివారం దాకా మాకు ఇబ్బంది అయితది సార్ పంపించండి సార్ ఈ డాక్టర్ సార్ ఇంకా లేడు సార్ పోచారం సార్ మీరే దీనికి యాక్షన్ తీసుకోవాలా గరీబోడికి పానాల మీద కాస్త ఇబ్బంది
నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాదులో అచ్చినము వచ్చి రెండు రోజులు అవుతుంది మూడు స్కానింగ్ రాసింది రెండు స్కానింగ్ ఇప్పుడు వచ్చినయ్ యూరిన్ రిపోర్ట్ రావాలా మూడు రోజుల కాస్త బాగా స్లో ఉంది లేనివాడు వస్తే ఇబ్బంది మూడు స్కాన్లకు రెండు రోజులు అయితే డాక్టరు శనివారం బుధవారం ఉంటాడట ఇట్లా ఉంటే ఎమర్జెన్సీకి ఎట్లా అక్కడ వెళ్తూనేమో రిపోర్టులో వచ్చిందాకా ఆగమని చెప్తుర్రు బాబు సీరియస్ అవుతుందో ఇక ఎవరు పట్టించుకోలేదు పోచారం శ్రీనివాస్ రెడ్డి లెటర్ రాసి
పంపించిన పట్టించుకుంటలేదు నిన్ను ఒక డాక్టర్ సీరియస్ అవుతోంది పోచారం రిపోర్ట్ చేయాలంటూ పోచారం సార్ అసలు సార్ కాసుంటది భయపడతారు పోచారం పోచారం సార్ పంపించినట్టు చూశారు ఇద్దరు ముగ్గురు పట్టించుకున్నారు మేము డాక్టర్లు పట్టించుకుంటుంది ఒక డాక్టర్ అయితే సీరియస్ అయితుంది సార్ శనివారం దాకా మాకు ఇబ్బంది అయితది సార్ పంపించండి సార్ ఈ డాక్టర్ సార్ ఇంకా లేడు సార్ పోచారం సార్ మీరే దీనికి యాక్షన్ తీసుకోవాలా గరీబోడికి పానాల మీద కాస్త ఇబ్బంది
- Post by Andugula sagargoud2
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోనీ మదీన కాలని లో ఓ ఇంటి వెనుకాల అనుకుని ఉన్న ఖాళీగా ఉన్న స్థలంలో మగ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడం కలకలం రేపింది.స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో నవజాత శిశువును పోలీసులు ఆస్పత్రికి తరలించి వైధ్యo అందిస్తున్నారు కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- Post by Vishwamber Rao2
- బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి తమ టెంట్లను తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఎండలో అయినా నిలబడి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనకు స్థానికంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేస్తూ, తమ టెంట్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు కోరారు. శాంతియుతంగా సమ్మె నిర్వహించుకునే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ప్రభావంతో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం చూపాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.1
- Post by Solanke Ravi2
- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం ఒక అద్భుతమైన వేడుకకు వేదికైంది. అటు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు, ఇటు పాఠశాల భద్రతకు యువత తోడ్పాటు కలగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులను, దాతలను ఒకే వేదికపై సత్కరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిభకు పట్టాభిషేకం పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించింది. కేవలం విద్యార్థులనే కాకుండా, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా శాలువాలు కప్పి, జ్ఞాపికలతో గౌరవించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ గుర్తింపు విద్యార్థుల్లో మరింత పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. మన ఊరి బడి - మన బాధ్యత' గ్రామ యువత తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ పాఠశాల భద్రత కోసం ముందుకొచ్చారు. "మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం" అనే నినాదంతో సుమారు 50 వేల రూపాయల వ్యయంతో 11 సీసీ కెమెరాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. యువకులు జక్కుల నరేష్, బండి కిషన్, ఓడపల్లి నవీన్ ఈ కెమెరాలను ప్రారంభించారు. ఈ నిఘా నేత్రాలు పాఠశాల ఆస్తుల రక్షణకు విద్యార్థుల క్రమశిక్షణ పర్యవేక్షణకు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో యువత పోషిస్తున్న క్రియాశీలక పాత్రను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం కొనియాడారు. నాణ్యమైన విద్యతో పాటు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఆర్టీసీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగాలి ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు ఐపీఎస్ టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడిన ఎస్పీ, ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులను తెలుసుకున్నారు. సమ్మె ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సహించబోమని హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట డియస్పీ ప్రసన్న కుమార్, డిపో మేనేజర్ సురేఖ, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1