logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుమలలో హైదరాబాద్ మహిళ అదృశ్యం హైదరాబాద్‌కు చెందిన 58 ఏళ్ల ఎన్. జానకి శనివారం తిరుమలలో అదృశ్యమయ్యారు. సాయంత్రం దర్శనం అనంతరం బస్సు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలున్నందున వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకిని ఎక్కడైనా గుర్తిస్తే 81218 42103 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

2 hrs ago
user_Telangana news
Telangana news
మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
2 hrs ago
d63c13c7-d6c5-4e85-abc6-2299be1e0b8a

తిరుమలలో హైదరాబాద్ మహిళ అదృశ్యం హైదరాబాద్‌కు చెందిన 58 ఏళ్ల ఎన్. జానకి శనివారం తిరుమలలో అదృశ్యమయ్యారు. సాయంత్రం దర్శనం అనంతరం బస్సు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలున్నందున వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకిని ఎక్కడైనా గుర్తిస్తే 81218 42103 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్ పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.
    4
    మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. 
జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్ పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో  భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది  ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    52 min ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    54 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జ్యోతిరావు పూలే జయంతిని టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు.సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన మహనీయుడని కొనియాడారు. జ్యోతిరావు పూలే దంపతులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా వెనుకడుగు వేయకుండా, విద్యకు పునాది వేసి సమాజాన్ని చైతన్యవంతం చేశారని తెలిపారు.భారతదేశంలో మహిళల విద్యాభివృద్ధికి మార్గం చూపిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాధించడం మన అందరి బాధ్యత అని అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జ్యోతిరావు పూలే ఆశయాల దారిలోనే పాలన సాగించారని గుర్తు చేశారు.విద్యార్థులు, యువత జ్యోతిరావు పూలే ఆదర్శాలను తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.కె అప్రోచ్ ఎండి సమీర్ లింగంపల్లి అబ్బి ప్రశాంత్ సత్యనారాయణ రాజు ముజ్జు రమేష్ నరేంద్ర పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జ్యోతిరావు పూలే జయంతిని టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు.సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన మహనీయుడని కొనియాడారు. జ్యోతిరావు పూలే దంపతులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా వెనుకడుగు వేయకుండా, విద్యకు పునాది వేసి సమాజాన్ని చైతన్యవంతం చేశారని తెలిపారు.భారతదేశంలో మహిళల విద్యాభివృద్ధికి మార్గం చూపిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాధించడం మన అందరి బాధ్యత అని అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జ్యోతిరావు పూలే ఆశయాల దారిలోనే పాలన సాగించారని గుర్తు చేశారు.విద్యార్థులు, యువత జ్యోతిరావు పూలే ఆదర్శాలను తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.కె అప్రోచ్ ఎండి సమీర్ లింగంపల్లి అబ్బి ప్రశాంత్ సత్యనారాయణ రాజు ముజ్జు రమేష్ నరేంద్ర పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
    1
    జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. 
వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్  ఏలేటి చంద్రారెడ్డి  ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.