వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్న కోరుట్ల సేవా బ్యాంక్ జగిత్యాల జిల్లా కోరుట్ల: సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సేవా బ్యాంక్ వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సేవా బ్యాంక్ ద్వారా అర్హులైన సభ్యులకు వారి అవసరాలను బట్టి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే రోజువారీ పొదుపు పథకం, సేవింగ్స్ ఖాతాలు, టర్మ్ డిపాజిట్ల వంటి సదుపాయాల ద్వారా ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తోంది. రోజువారీ డిపాజిట్లను సభ్యుల ఇంటి వద్దకే వచ్చి సేకరించే విధానం కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సేవా బ్యాంక్ అందిస్తున్న పొదుపు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు BMC అహ్మద్ అబ్దుల్ నయీం. మరియు ఇలియాస్ అహ్మద్ ఖాన్. నయీం తదితరులు పాల్గొన్నారు
వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్న కోరుట్ల సేవా బ్యాంక్ జగిత్యాల జిల్లా కోరుట్ల: సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సేవా బ్యాంక్ వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సేవా బ్యాంక్ ద్వారా అర్హులైన సభ్యులకు వారి అవసరాలను బట్టి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే రోజువారీ పొదుపు పథకం, సేవింగ్స్ ఖాతాలు, టర్మ్ డిపాజిట్ల వంటి సదుపాయాల ద్వారా ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తోంది. రోజువారీ డిపాజిట్లను సభ్యుల ఇంటి వద్దకే వచ్చి సేకరించే విధానం కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సేవా బ్యాంక్ అందిస్తున్న పొదుపు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు BMC అహ్మద్ అబ్దుల్ నయీం. మరియు ఇలియాస్ అహ్మద్ ఖాన్. నయీం తదితరులు పాల్గొన్నారు
- వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్న కోరుట్ల సేవా బ్యాంక్ జగిత్యాల జిల్లా కోరుట్ల: సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సేవా బ్యాంక్ వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సేవా బ్యాంక్ ద్వారా అర్హులైన సభ్యులకు వారి అవసరాలను బట్టి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే రోజువారీ పొదుపు పథకం, సేవింగ్స్ ఖాతాలు, టర్మ్ డిపాజిట్ల వంటి సదుపాయాల ద్వారా ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తోంది. రోజువారీ డిపాజిట్లను సభ్యుల ఇంటి వద్దకే వచ్చి సేకరించే విధానం కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సేవా బ్యాంక్ అందిస్తున్న పొదుపు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు BMC అహ్మద్ అబ్దుల్ నయీం. మరియు ఇలియాస్ అహ్మద్ ఖాన్. నయీం తదితరులు పాల్గొన్నారు1
- వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. దీపావళి పండుగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. పండుగను జరుపుకున్న అనంతరం, సోమవారం పవిత్రమైన రోజు కావడంతో భీమేశ్వర స్వామివారి దర్శనార్థం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారికి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కల్యాణం, చండీ హోమం, కుంకుమ పూజలు, గండాదీపంలో నూనె పోయడం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు లింగార్చన వంటి వివిధ రకాల పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి స్వయంగా ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షిస్తూ, భక్తుల రద్దీని సమీక్షించారు. క్యూలైన్ల నిర్వహణ మరియు ఇతర వసతులపై ఆలయ అధికారులకు, సిబ్బందికి పలు ముఖ్యమైన సూచనలు అందించారు.1
- రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: విప్ ఆది శ్రీనివాస్ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మర్రిపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, మారుపాకలో వ్యవసాయ గోదాంను ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మర్రిపల్లి చెరువు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.1
- పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.1
- డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు అందించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు తెలియజేస్తూ మంగళవారం సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ , చందుర్తి , కోనరావుపేట పీహెచ్ సిల ఆశా వర్కర్లతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా ఆది శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయశీల , గాయత్రి , జమున , లత , మమత , లక్ష్మీ , అరుణ , జ్యోతి , రత్నమాల , హేమలత , ఉమ , రేఖ తదితరులు పాల్గొన్నారు.2
- శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉచిత పులిహోర ప్రసాద వితరణ ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల కోసం ఉదయం పూట ఉచిత పులిహోర ప్రసాద వితరణను ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి సోమవారం ప్రారంభించారు. ఈ ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి నిర్వహించే 'అన్నపూజ' అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా ఈరోజు నుండి ఉదయం వేళల్లో ఉచిత పులిహోర వితరణను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఈవో రమాదేవి , దీపాల కౌంటర్ వద్ద టెండర్ దారులు ప్రమిదలను ఎంత రేటుకు విక్రయిస్తున్నారో నేరుగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులపై అదనపు భారం పడకుండా, నిర్ణయించిన రూ. 40 లకే దీపాలను అందించాలని కాంట్రాక్టర్‌కు స్పష్టమైన సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు నూగురి నరేందర్, ఎస్.పి.ఎఫ్ సిబ్బంది, హోంగార్డులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.1