Shuru
Apke Nagar Ki App…
వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...
Saddala Adi
వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయదుర్గం విద్యుత్ శాఖ ఏఈ గా జయకృష్ణ బాధ్యతలు స్వీకరణ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా రాయదుర్గం విద్యుత్ శాఖ నూతన ఏఈ గా జయకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి కార్పొరేట్ నుంచి రాయదుర్గం ఏఈగా బదిలీపై వచ్చినట్లు తెలిపారు. రాయదుర్గంలో అనేక విద్యుత్ సమస్యలు ఉన్నాయని మూడు నెలల్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తానని ఆయన మీడియాతో తెలిపారు. వినియోగదారుల సైతం తమకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో ఏఈ గా పనిచేసిన బాలచంద్రను కళ్యాణదుర్గం కు చేసిన విషయం తెలిసిందే.1
- దళిత గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు జి. చంద్రశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జక్కరయ్య మాట్లాడుతూ, జులై 16 నుంచి 26 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన "అసమానతలు లేని సమాజం కోసం సామాజిక శంఖారావం" అధ్యయన యాత్రలో దళితవాడల్లో అనేక సమస్యలు వెలుగుచూశాయని తెలిపారు. మైదుకూరు మండలంలోని 10 గ్రామాల్లో పర్యటించగా, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసించడం, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు లేకపోవడం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న చోట్ల రోడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అభివృద్ధి గురించి చెబుతున్న మాటలకు దళిత గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. "గడపగడపకు టీడీపీ" కార్యక్రమాన్ని దళిత గ్రామాల్లో నిర్వహించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. దళితుల సంక్షేమానికి ఉన్న చట్టాలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. దళిత గ్రామాల్లోని మౌలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస, కేవీపీఎస్, ఆవాజ్ నాయకులు గురయ్య, షరీఫ్, ఖాదర్ బాషా, రవి, సుధాకర్, ఇమామ్ ఓబులేసు, లక్ష్మీదేవి, తామస్, లక్ష్మయ్య, బాలరాజుతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.1
- శ్రీశైలం నుంచి రాయలసీమకు వెంటనే నీరు విడుదల చేయాలి: సాగునీటి సాధన సమితి నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేసి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య, కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితుల నాయకులు, రైతులు పాల్గొన్నారు.4
- పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.1
- గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందే మురుగు కుంటలు కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి. దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు: 1. ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి 2. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి 3. మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.1
- మెగా డీఎస్సీపై జగన్ విమర్శలు తగవు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ అమలులో మంత్రి నారా లోకేశ్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వాటిని ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ విషయంలో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవని స్పష్టం చేశారు.1
- Post by Chandraiah Pochampally1
- పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది. ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు4
- కామన్వెల్త్ గేమ్స్ లో మన భారత క్రీడాకారులు ప్రపంచానికి చాటి చెప్పారు! భారత్ ఆడితే గెలుస్తుంది... గెలిచి చరిత్ర సృష్టిస్తుంది 🏆🏅 మన హీరోలందరికీ హృదయపూర్వక శుభాభినందనలు 🏅🏆 మిమ్మల్ని చూసి 140 కోట్ల భారతీయులు గర్వంగా తల ఎత్తుకున్నారు మీ ప్రతి చెమట బొట్టులో దేశభక్తి కనిపించింది మీ ప్రతి పతకం వెనుక "భారత్ మాతా కీ జై" వినిపించింది... 🏅13 స్వర్ణం ..🥈 17రజత..🥉 9కాంశ్య ... మొత్తం 🏅39 పతకాలు... 🇮🇳ఒకటే గర్వం...అదే భారతం🇮🇳 కామన్వెల్త్ గేమ్స్ లో మన భారత క్రీడాకారులు ప్రపంచానికి చాటి చెప్పారు... భారత్ ఆడితే గెలుస్తుంది... గెలిచి చరిత్ర సృష్టిస్తుంది.... ఇది కేవలం పతకాలు కాదు... ఇది కొత్త భారత్ యొక్క ఆత్మవిశ్వాసం ఈ విజయాల వెనుక ఎవరు ఉన్నారు? ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజి గారి దూరదృష్టి నాయకత్వం ✅ Khelo India - గ్రామాల నుండి హీరోలను తీసుకొచ్చింది ✅ TOPS Scheme - ఒలింపిక్ క్రీడాకారులకు నేరుగా ఆర్థిక సహాయం ✅ రికార్డు బడ్జెట్ - క్రీడారంగానికి వేల కోట్ల పెట్టుబడులు ✅ వరల్డ్ క్లాస్ స్టేడియాలు - యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ... గతంలో క్రీడాకారులు సొంత ఖర్చుతో ఆడేవారు ఇప్పుడు మోదీ గారు పతకం తెచ్చిన ప్రతి క్రీడాకారుడికి దేశం అండగా ఉంటుంది అన్నారు 🇮🇳మోదీజి గారి మాట🙏 "మన క్రీడాకారులు పతకాలు గెలిచినప్పుడు తిరంగా ఎగురుతుంది... కోట్లాది యువతకు స్ఫూర్తి వస్తుంది ".... గతంలో క్రీడలంటే నిర్లక్ష్యం... ఇప్పుడు క్రీడలంటే గౌరవం 🚩 🙏మన క్రీడాకారులకు సెల్యూట్🙏 🚩 🚩 👑మోదీజి గారి నాయకత్వానికి జై👑 🚩 🇮🇳 🚩👑భారత్ మాతా కీ జై👑🚩 🇮🇳1