గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందే మురుగు కుంటలు కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి. దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు: 1. ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి 2. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి 3. మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.

- *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* కొత్తపల్లి ( నందికొట్కూర్ నియోజకవర్గం): నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొలనుభారతి అమ్మవారిని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో కొలనుభారతి క్షేత్రానికి విచ్చేసిన చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులకు యాదవ సంఘం నాయకులు ఘనంగా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వానాల నీటి సంఘం చైర్మన్ కాగుల శంకర్ యాదవ్, శివపురం మాజీ సర్పంచ్ శేఖర్ యాదవ్, ఎంపీపీ మోహన్ యాదవ్, స్థానిక యాదవ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.1
- జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.1
- ఆత్మనిర్భరతో మేలైన పంట ఉత్పత్తి ........ ఏఓ పవన్ కుమార్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, మణికంఠపురం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చౌడు భూములు తక్కువ సారవంతమైన భూములను పచ్చిరొట్ట ఎరువుల సాగుతో స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకంతో పప్పు దినుసుల విస్తీర్ణం మరియు మేలైన పంట ఉత్పత్తి పెరుగుతుందని ఏఓ తెలిపారు.1
- నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ1
- గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు1
- తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత మార్కాపురం జిల్లా కేంద్రం ఎస్టేట్ లోని మదర్ ఇండియా మోడ్రన్ రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరకే బియ్యం అమ్మ కాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో మార్కెట్లో ధరలు ఇబ్బందికరంగా నెలకొన్న పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కేజీ 52 రూపాయలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లుల యజమానుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రైస్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల యొక్క కష్టాలను తెరిచేందుకు ప్రభుత్వం తగ్గింపు ధరలతో బియ్యం విక్రయించే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీలైనంతవరకు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పేద రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తక్కువ రైస్ మిల్లులో ఉన్న వారి ముందుకు వచ్చి పేదలకు తక్కువ ధరకు బియ్యం అందజేస్తున్నదన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1
- శ్రీశైలం డ్యాం కు జూరాల జలాశయం నుంచి ఇన్ ఫ్లో 2,45,183 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయం కు వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో జూరాల జలాశయం నుంచి 2,45,183 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, జలాశయ ప్రస్తుత నీటి మట్టం 863.90. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 118 . 6216 టీఎంసీలుగా నమోదైంది.1
- ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీజి ప్రభుత్వం రూ.115 కోట్లకు పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది.1