Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీజి ప్రభుత్వం రూ.115 కోట్లకు పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది.
Pv sivakumar
ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీజి ప్రభుత్వం రూ.115 కోట్లకు పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...1
- రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం కడప నగరంలోని బాలాజీ నగర్‌లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు. టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్‌తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందే మురుగు కుంటలు కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి. దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు: 1. ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి 2. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి 3. మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.1
- ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు శుభవార్త... ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీజి ప్రభుత్వం రూ.115 కోట్లకు పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది.1