Shuru
Apke Nagar Ki App…
బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Syed Rafi
బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీశైలం డ్యాం కు జూరాల జలాశయం నుంచి ఇన్ ఫ్లో 2,45,183 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయం కు వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో జూరాల జలాశయం నుంచి 2,45,183 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, జలాశయ ప్రస్తుత నీటి మట్టం 863.90. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 118 . 6216 టీఎంసీలుగా నమోదైంది.1
- జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.1
- రోడ్డు రూపు రేఖలు మారేది ఎప్పుడు.? వ్యవసా కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి (కోడుమూరు శూరు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో కనికే హంపయ్య సర్కిల్ చుట్టూ పరిధిలో రోడ్డు గుంతలు ఏర్పడి అద్వాన స్థితిగా మారినది. గుంతలు పడిన రోడ్డులో వాహనదారులు అనేక ఇక్కట్లు పడి ద్విచక్ర వాహనదారులు ఐతే ఏకంగా క్రిందపడి ఆసుపత్రుల పాలౌవుతున్నారు. ప్రమాదాలకు గురి అవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది. అప్పటి కాంట్రాక్టర్ తారు రోడ్డును క్వాలిటీతో వేసి ఉంటే ఇలా డ్యామేజ్ జరిగేది కాదు. క్వాలిటీ లేని తార రోడ్డు వేయడంతో కొద్ది రోజులకే ఇలా వాహనాలు వెళ్లలేని పరిస్థితి గుంతలు ఏర్పడ్డవీ. ఇక్కడి నుంచి బళ్లారి కి భారీ వాహనాలు వెళుతుంటాయి అందుకే క్వాలిటీతో ఉన్న తార రోడ్డును వేయవలసిందిగా రోడ్డు భవనాల శాఖ అధికారులను కోరుచున్నాము.ఇప్పటికైనా స్పందించి ఆర్.అండ్.బి. అధికారులు నిద్రమత్తును వీడి. గుంతలు లేని కొత్త తారు రోడ్డు వేసి ప్రమాదాలను నివారించాలని అధికారులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అని సిపిఐ అనుబంధ సంస్థ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య ఆచారి, మాజీ వార్డ్ మెంబర్ జి. రామాంజనేయులు, వాహనదారులు కోరుచు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ వారు మాట్లాడారు.2
- రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం కడప నగరంలోని బాలాజీ నగర్‌లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు. టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్‌తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందే మురుగు కుంటలు కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి. దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు: 1. ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి 2. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి 3. మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.1
- తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత మార్కాపురం జిల్లా కేంద్రం ఎస్టేట్ లోని మదర్ ఇండియా మోడ్రన్ రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరకే బియ్యం అమ్మ కాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో మార్కెట్లో ధరలు ఇబ్బందికరంగా నెలకొన్న పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కేజీ 52 రూపాయలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లుల యజమానుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రైస్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల యొక్క కష్టాలను తెరిచేందుకు ప్రభుత్వం తగ్గింపు ధరలతో బియ్యం విక్రయించే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీలైనంతవరకు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పేద రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తక్కువ రైస్ మిల్లులో ఉన్న వారి ముందుకు వచ్చి పేదలకు తక్కువ ధరకు బియ్యం అందజేస్తున్నదన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1
- దళిత గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు జి. చంద్రశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జక్కరయ్య మాట్లాడుతూ, జులై 16 నుంచి 26 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన "అసమానతలు లేని సమాజం కోసం సామాజిక శంఖారావం" అధ్యయన యాత్రలో దళితవాడల్లో అనేక సమస్యలు వెలుగుచూశాయని తెలిపారు. మైదుకూరు మండలంలోని 10 గ్రామాల్లో పర్యటించగా, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసించడం, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు లేకపోవడం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న చోట్ల రోడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అభివృద్ధి గురించి చెబుతున్న మాటలకు దళిత గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. "గడపగడపకు టీడీపీ" కార్యక్రమాన్ని దళిత గ్రామాల్లో నిర్వహించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. దళితుల సంక్షేమానికి ఉన్న చట్టాలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. దళిత గ్రామాల్లోని మౌలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస, కేవీపీఎస్, ఆవాజ్ నాయకులు గురయ్య, షరీఫ్, ఖాదర్ బాషా, రవి, సుధాకర్, ఇమామ్ ఓబులేసు, లక్ష్మీదేవి, తామస్, లక్ష్మయ్య, బాలరాజుతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.1
- శ్రీశైలానికి భారీ ఇన్ ఫ్లో.. 118 టీఎంసీలకు చేరిన నిల్వ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి శ్రీశైలానికి 2,45,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. ప్రాజెక్ట్ పరంగా పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.90 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118.6216 టీఎంసీలు నిల్వ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాలేదు.1