Shuru
Apke Nagar Ki App…
శ్రీశైలానికి భారీ ఇన్ ఫ్లో.. 118 టీఎంసీలకు చేరిన నిల్వ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి శ్రీశైలానికి 2,45,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. ప్రాజెక్ట్ పరంగా పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.90 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118.6216 టీఎంసీలు నిల్వ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాలేదు.
NAVADEEP
శ్రీశైలానికి భారీ ఇన్ ఫ్లో.. 118 టీఎంసీలకు చేరిన నిల్వ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి శ్రీశైలానికి 2,45,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. ప్రాజెక్ట్ పరంగా పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.90 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118.6216 టీఎంసీలు నిల్వ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాలేదు.
More news from తెలంగాణ and nearby areas
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు TRP నేత తీన్మార్ మల్లన్న పిలుపు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనమందరం జీతాలు తీసుకోకుండా ఉందాం అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కష్టాల్లో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మనం అండగా ఉండాలని తెలిపారు.1
- కేశంపేట:దత్తాయపల్లిలో ఘనంగా పోచమ్మ, మైసమ్మ బోనాల మహోత్సవం కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామంలో పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ మన తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు అద్దం పడుతుందని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడిపల్లి భాస్కర్, డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.1
- 47 టీఎంసీల సమ్మక సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం రేవంత్ వదులుతుండు: హరీష్ రావు 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయి GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చే వరకు జీతాలు వద్దు : తీన్మార్ మల్లన్న ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ పూర్తిగా అందే వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ జీతాలు తీసుకోకుండా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్ల మధ్య జీవనం సాగిస్తున్నారని, అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులంతా వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని,వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందేలా చూడాలని ఆయన కోరారు.1
- ఆత్మనిర్భరతో మేలైన పంట ఉత్పత్తి ........ ఏఓ పవన్ కుమార్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, మణికంఠపురం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చౌడు భూములు తక్కువ సారవంతమైన భూములను పచ్చిరొట్ట ఎరువుల సాగుతో స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకంతో పప్పు దినుసుల విస్తీర్ణం మరియు మేలైన పంట ఉత్పత్తి పెరుగుతుందని ఏఓ తెలిపారు.1
- శ్రీశైలానికి భారీ ఇన్ ఫ్లో.. 118 టీఎంసీలకు చేరిన నిల్వ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి శ్రీశైలానికి 2,45,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. ప్రాజెక్ట్ పరంగా పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.90 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118.6216 టీఎంసీలు నిల్వ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాలేదు.1