పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు పెద్దపల్లి, జూలై 31, 2026 (శుక్రవారం పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు పెద్దపల్లి, జూలై 31, 2026 (శుక్రవారం): తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లి తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని తెలంగాణ రక్షణ సేన పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితక్క గారు పార్టీలో చేరిన వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, తెలంగాణ ప్రజల హక్కుల సాధన, కార్మికులు, రైతులు, యువత, మహిళల సంక్షేమం కోసం పార్టీ చేపడుతున్న ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తున్న కృషిని చూసి తాము స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు పెద్దపల్లి, జూలై 31, 2026 (శుక్రవారం పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు పెద్దపల్లి, జూలై 31, 2026 (శుక్రవారం): తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గారి
ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివెళ్లి తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని తెలంగాణ రక్షణ సేన పార్టీలో అధికారికంగా
చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితక్క గారు పార్టీలో చేరిన వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, తెలంగాణ ప్రజల హక్కుల సాధన, కార్మికులు, రైతులు, యువత, మహిళల సంక్షేమం కోసం పార్టీ చేపడుతున్న ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు
మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తున్న కృషిని చూసి తాము స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఎమ్మెల్యే గంగుల కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విమర్శించారు.బీఆర్‌ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు,రూ.5 లక్షల ఉచిత ప్రమాద భీమా,చలాన్ల రద్దు అందించామని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రకటించిన రూ.12 వేల సాయం,రూ.1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు.2
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.1