Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్ లో రేపు అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో 👌మెగా job మేళా. 100 ఉద్యోగాలు. #appolopharmacy #jobmela
Chandraiah Pochampally
హైదరాబాద్ లో రేపు అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో 👌మెగా job మేళా. 100 ఉద్యోగాలు. #appolopharmacy #jobmela
More news from Jayashankar Bhupalapally and nearby areas
- హైదరాబాద్ లో రేపు అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో 👌మెగా job మేళా. 100 ఉద్యోగాలు. #appolopharmacy #jobmela1
- కాంగ్రెస్ సర్కార్ లో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చిందని ఓ రైతు ఆందోళనతో అన్నారు. ఇది దండగ పాలన.. రేవంత్ రెడ్డి వచ్చి అడిగినా ఆయనకు ఓటేయ్యం అని నికార్స్ గా చెప్పాడు. నీళ్లు, యూరియా సరైన సమయానికి అందక, రాక, లేక పంటలే పండట్లేదు.. అంతో ఇంతో పండిన పంటను ప్రభుత్వం కొనడము లేదు, దీనికి తోడు ప్రకృతి సహకరించక, కష్టపడి అంతో ఇంతో పంటలు పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడి అట్లా... నష్టపోవడం జరుగుతుంది. మా రైతుల బాధలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీర్చలేదు తీరుస్తారో... లేదో ఆ నమ్మకము కూడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.1
- శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.1
- వంచనగిరిలో కోటగండి మైసమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ... వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంచనగిరి గ్రామం నుంచి శ్రీ శ్రీ శ్రీ కోటగండి మైసమ్మ తల్లి ఆలయం వరకు బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు హాజరై భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు వెయ్యి మంది భక్తులు బోనాలతో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గీసుగొండ పోలీసులు, క్యూఆర్టీ సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రిస్తూ భక్తులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీసు శాఖ, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తుల సమన్వయంతో బోనాల మహోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసినట్లు గీసుగొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపారు.1
- నేతకాని' పేరుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి డిమాండ్ వినిపించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ *'నేతకాని' పేరుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి డిమాండ్ వినిపించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ:* పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు *శ్రీ గడ్డం వంశీకృష్ణ* నేతకాని సామాజిక వర్గం ఆత్మగౌరవానికి సంబంధించిన కీలక సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర *సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్* ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి, ప్రభుత్వ రికార్డుల్లో తప్పుగా నమోదైన *'నెట్కాని'* అనే పేరును సరిచేసి, అసలు పేరు *నేతకాని* గా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి వీరేంద్ర కుమార్ ఈ అంశానికి సంబంధించిన పూర్తి పరిపాలనా విధానాన్ని ఎంపీ వంశీకృష్ణకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన రావడంతో పాటు, *రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI)* మరియు *జాతీయ ఎస్సీ కమిషన్* నుంచి అవసరమైన సిఫార్సులు అందిన అనంతరం పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో, ముఖ్యంగా *లక్ష్మణ్ కుమార్* గారితో కూడా చర్చించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణమే అధికారిక లేఖను కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో నేతకాని వర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. *"నేతకాని సమాజం గౌరవం, ఆత్మగౌరవం, గుర్తింపుకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రతి దశను స్వయంగా ఫాలోఅప్ చేస్తాను.*ప్రభుత్వ రికార్డుల్లో సరైన పేరు 'నేతకాని' నమోదయ్యే వరకు మా కృషి కొనసాగుతుంది"* అని ఆయన పేర్కొన్నారు. నేతకాని సమాజానికి చారిత్రక న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేస్తూ, అవసరమైన అన్ని అనుమతులు, సిఫార్సులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.1
- సింగరేణి విద్యుత్ సరఫరా పునరుద్దరించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బోడ జనార్దన్ అన్నారు. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని పలు బస్తీలలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పర్యటించినప్పుడు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగరేణి విద్యుత్ సరఫరా లేక సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడం, సింగరేణి జనరల్ మేనేజర్ పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. సింగరేణి జిఎం మానవతా దృక్పథంతో స్పందించి సింగరేణి కార్మికులు, కార్మికేతర్లు ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకునేంత వరకు సింగరేణి విద్యుత్తును పునరుద్దరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఎమ్మెల్యే గడ్డం స్థానికంగా ఉండి సింగరేణి జిఎంతో, ఇటు ప్రభుత్వం విద్యుత్ సంస్థ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.1
- ప్రియ స్నేహితులారా ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఆయనకు కృపా క్షేమము సమాధానం నెమ్మది ప్రశాంతత మీ జీవితంలో కుమ్మరించబడును గాక గాడ్ బ్లెస్స్ యు1