కల్లేపల్లిలో అగ్నికి ఆహుతి అయిన ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంట బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కల్లేపల్లిలో అగ్నికి ఆహుతి అయిన ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంట బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
- రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు మానసిక వికలాంగులకు ఆశ్రమ నిర్మాణానికై మరియు గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణానికి స్వంత స్థలం కోసం భూదానయజ్ఞం శాశ్వత సొంత స్థలం,భవన నిర్మాణనికి శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా రూ,, 10,000/- లు ఆర్దికసహాయం అందించి తమ సేవాతత్పరతను చాటారు. మీరు,మీ కుటుంబసభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. చేయి చేయి కలుపండి - మాతృదేవోభవ ఆశ్రమానికి స్వంత స్థలం కోసం తోడ్పాటునందివ్వండి🙏🙏🙏 Google Pay, Phonepe: 9347513830, 79979193651
- బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం సుమారు 5:10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పలు మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చెల్కల కొండల్ రెడ్డి (2 ఎకరాలు), చెల్కల ప్రతాప్ రెడ్డి (2 ఎకరాలు), కేశవ రెడ్డి (3 ఎకరాలు), కౌలు రైతు సుదగోని రాజయ్య (1 ఎకరం)లకు చెందిన మొత్తం సుమారు 8 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో రైతులు, స్థానికులు కలిసి అగ్ని నియంత్రణకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే పంట పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని బెజ్జంకి తహసిల్దార్ కళ్యాణం శ్రీకాంత్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.2
- గన్నేరువరం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మైసంపల్లి మల్లేశం మే డే సందర్భంగా జండా ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల దినోత్సవ సందర్భంగా కార్మికులకు ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చొక్కల శ్రీశైలం, బోయినీ సమ్మయ్య, విలాసారం రాజమల్లు, దొమ్మటి మల్లయ్య,బోయినీ సుధాకర్,తాళ్లపల్లి సంపతి, రాహుల్ లక్ష్మణ్,బోయినీ బాలయ్య,ఔషధ రాజయ్య, అమ్మి గల కొమురయ్య, నగునూరు మల్లయ్య, నరసయ్య, మహేందర్,కోతి మల్లేశం,మహంకాళి ప్రభాకర్, సురేష్,తోట శేఖర్,గొట్టే అంజయ్య,అంజయ్య రియాజు, బోయిన రవి, హనుమాన్ మల్లేశం, తదితర కార్మికులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదం విషయం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీకి తెలియడంతో బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలివెళ్లారు. రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నేత రాంమోహన్ సొదరుని కుటుంబ సభ్యులు మృతి చెందిన విషయం తెలియగానే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. శంషాబాద్ ఏసీపి నాగభూషణం ను వివరాలు అడిగి తెలిసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. సిరిసిల్ల వాసులు మృతి పట్ల కేటీఆర్ దిగ్బాంతిని వ్యక్తం చేశారు.1
- * 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించిన ముఖ్యమంత్రి * సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి2
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక అంబులెన్స్‌కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.1