logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

_*శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న బుట్టా రేణుక* శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న బుట్టా రేణుక _*ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శనం.. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన*_ * _ఎమ్మిగనూరు: పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు._ * _అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు._ * _వినాయక చవితి సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం, గణనాథుని పూజలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది._

8 hrs ago
user_REPOTER KUMAR
REPOTER KUMAR
Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago
3acdff04-108d-4a9d-ae37-ecf0e7b2cfa1

_*శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న బుట్టా రేణుక* శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న బుట్టా రేణుక _*ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శనం.. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన*_ * _ఎమ్మిగనూరు: పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు._ * _అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని శ్రీ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు._ * _వినాయక చవితి సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం, గణనాథుని పూజలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది._

More news from తెలంగాణ and nearby areas
  • సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
    4
    సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ  పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన  చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • జీజీహెచ్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి.. బుట్టా రేణుక కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్‌ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    3
    జీజీహెచ్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి..  బుట్టా రేణుక
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్‌ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    user_PENDEKALLU VEERANNA
    PENDEKALLU VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....!
ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు ఆలూరు నియోజకవర్గం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడి సన్నిధిలో దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ దేవుడిని ప్రార్థించారు. అనంతరం గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. 2026 జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న ప్రేమ, ఆశీర్వాదాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉండాలని కోరుకున్నారు.
    3
    వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు
వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు
ఆలూరు నియోజకవర్గం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయకుడి సన్నిధిలో దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ దేవుడిని ప్రార్థించారు.
అనంతరం గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత కొనసాగాలని వారు ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. 2026 జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న ప్రేమ, ఆశీర్వాదాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉండాలని కోరుకున్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 min ago
  • జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.
    1
    జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    3 hrs ago
  • బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
    4
    బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది

 కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు.
అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది
కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు.
అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
    user_Gowtham
    Gowtham
    ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
    4
    సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన  చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    8 hrs ago
  • పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
    1
    పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    3 hrs ago
  • గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    4
    గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు
గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
చిప్పగిరి, సెప్టెంబర్ 16:
ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు.
వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.