Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ సమ్మె ఉధృతి.. బాన్సువాడలో మహిళా కార్మికుల నిరసన బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
SUDHAM VITTAL
ఆర్టీసీ సమ్మె ఉధృతి.. బాన్సువాడలో మహిళా కార్మికుల నిరసన బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
More news from Telangana and nearby areas
- వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.1
- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పాల్గొన్నారు.1
- రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా సిరిసిల్లలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా డిపో గేటు ముందు నిరసన తెలిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టారు.2
- జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు. గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.4
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.1
- వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐ అధికారిణులు ఇర్షాద్ కుటుంబసభ్యులకు ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారులు రూ.40,000 లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగి, రూ.20,000 సీఐకి, ఎస్ఐకి ఇచ్చిన బాధితుడు మిగతా రూ.20,000 విషయంలో బాధితుడు ఇర్షాద్ సమాచారం ఇవ్వడంతో సీఐ సరోజ, ఎస్ఐ రాణితో సహా మరో ముగ్గురిని ఆధారాలతో పట్టుకున్న అధికారులు4
- సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- ఆర్టీసీలో సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.1
- ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె వలన ప్రజలకు ఆటంకాలు ఏర్పడకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడుపుటకు అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఏ బస్సులోనైతే కండక్టర్ ఉండడో ఆ బస్సు ప్రయాణికులకు ఉచితంగా తమ గమ్యం వరకు చేర్చుటకు సహకరించడం జరుగుతుంది. కానీ మెట్పల్లి డిపో మేనేజర్ కల్పనాశీల కండక్టర్ లేకుండా నడిచే బస్సులలో కూడా ప్రయాణికుల వద్ద నుండి ఎలాంటి టికెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది2