Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణస్వీకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
Naga kanth
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణస్వీకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Mahesh Mahi1
- బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.1
- కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది.. మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు.. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు.. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు .. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..1
- కర్నూలు జిల్లా.... ఆలూరు నియోజకవర్గం... త్రాగు నీటి కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మహిళలు హోళగుoద మండల కేంద్రంలో త్రాగునీటిని అందించాలని కాలి బిందెలు తో నిరసన తెలిపిన మహిళలు. గుక్కెడు నీటి కోసం పడరాని పడుబాట్లు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం. తమకు నీరు అందించాలని డిమాండ్ చేసిన మహిళలు ....2
- అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.1
- *అటవీ భూముల్లో మట్టి మాఫియా పంజా..* *వెంకుపాలెంలో గ్రామస్థుల గర్జన!* **దిశ వినుకొండ:** అక్రమార్కుల ఆకలికి ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. కళ్లముందే కోట్లాది రూపాయల విలువైన సంపద దోపిడీకి గురవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. సర్వే నంబర్ 1లోని సుమారు 89 ఎకరాల అటవీ భూముల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. *కోట్లలో వ్యాపారం..* *సామాన్యులకు మాత్రం ఆంక్షలు!* వెంకుపాలెం గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న మేలిరకం ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. భారీ జేసీబీలతో భూమిని తవ్వేస్తూ, టిప్పర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. "గ్రామ అవసరాల కోసం ఒక తట్ట మట్టి తీసుకెళ్లాలన్నా స్థానికులను వేధిస్తున్నారు.. కానీ, మాఫియా పగలు రేయి తేడా లేకుండా వేల టిప్పర్ల మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నిలిచిన టిప్పర్లే ఇక్కడ జరుగుతున్న దోపిడీకి సజీవ సాక్ష్యాలని వారు చూపుతున్నారు. *అధికారుల 'వాటాల' పర్వం.. అడ్డుకోకుంటే ఉద్యమమే!* ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా నుంచి అధికారులకు భారీగా 'వాటాలు' అందుతున్నాయని, అందుకే ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అడ్డుకోకపోతే, గ్రామస్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.3
- కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.1
- ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.1