Shuru
Apke Nagar Ki App…
Ali ammu
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్/ *వీర కిశోరం,భారత స్వాతంత్ర్య సమర యోధుడు షాహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి* భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టుదయానంద రెడ్డిపిలుపునిచ్చారు.. సోమవారం రోజున జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సీపీఐ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభ లో ఆయన పాల్గొని మాట్లాడారు..ఈ సందర్భంగా దయానంద రెడ్డి మాట్లాడుతూ విప్లవ విరకిశోరం ,భగభగ మండే నిప్పుకనిక షాహిద్ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 న పంజాబ్ లోని బంగా అనే గ్రామంలో కిషన్ సింగ్,విద్యావతి లకు జన్మించాడని,చిన్నతనంలోనే విప్లవ భావజాలాన్ని అలవర్చుకున్నడని,దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి జైలు పాలయ్యారని,దేశం కోసం 23 సంవత్సరాల యుక్తవయసులో నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన సమరయోధులు భగత్ సింగ్ అని,ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని కామ్రేడ్ భగత్ సింగ్ ఇవ్వటం జరిగిందన్నారు.భగత్ సింగ్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భగత్ సింగ్ జీవిత చరిత్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో చేర్చి ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని, భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యారని, ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం, రైతాంగ ,ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం షాహిద్ భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ లు,భానుప్రకాష్ రావు తిగుల్ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి pacs మాజీడైరెక్టర్ భూమయ్య, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి భిక్షపతి. మండల కార్యదర్శి తొందురు నర్సింహారెడ్డి. గజ్వేల్ పట్టణ కార్యదర్శి స్వర్గంరాజేశం. ఉపాధ్యా యులు సత్తయ్య సార్. సిపిఐ నాయకులు. ఎల్లారెడ్డి నరసింహారెడ్డి లింగం సార్ బిక్షపతి. కృష్ణమూర్తి అనంతం కరుణాకర్ రెడ్డి. రామ్ రెడ్డి. చిన్న మల్లారెడ్డి. పరశురాం.మరియు యువజన నాయకులు నితీష్ రెడ్డి. మనోజ్. అనిల్. నవీన్ . గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..4
- Post by Ali ammu1
- శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.1
- సదాశివపేట పోలీస్ స్టేషన్ ముందు పొట్టు పొట్టు కొట్టుకున్న రెండు కుటుంబాలు1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం 135 ఫిర్యాదులు స్వీకరించినట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.1
- సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.1
- సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్/ బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో “6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి” అనే డిమాండ్‌తో నేడు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ నాయకులు బండారి మహేష్ గారు మరియు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ గారు బిజెపి నాయకులతో కలిసి అసెంబ్లీని ముట్టనించడం జరిగింది. ఈ సందర్భంగా బండారు మహేష్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటం. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు వంటి చర్యలతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలన్న ప్రయత్నాలు ఎంత చేసినా, ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కళ్లిబోల్లి మాటలు చెప్పి ప్రజలతోని ఓట్లను వేయించుకొని ప్రజా పాలన అని చెప్పి ప్రజలను ముంచే పార్టీగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే పూర్తి మొత్తంలో అమలు చేయాలని చేసేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వంలో ఈ ఉద్యమం మరింత బలంగా ముందుకు సాగుతుందని. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల న్యాయం కోసం బీజేపీ ఎప్పటికీ వెనుకడుగు వేయదని గుర్తు చేశారు.4