మేడే వేడుకల సందర్భంగా మహబూబాబాద్‌లో వామపక్షాల భారీ ర్యాలీ ఎరుపు జెండాలతో పట్టణం మార్మోగింది – కార్మిక హక్కుల కోసం గళమెత్తిన నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మేడే సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ (ఎన్డీ) పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎరుపు రంగు షర్ట్లు ధరించిన కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా క్రమబద్ధంగా ర్యాలీ నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటారు. నినాదాలతో పట్టణం మార్మోగింది. ర్యాలీ అనంతరం తహశీల్దార్ కార్యాలయం సెంటర్ వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడే వేడుకల సందర్భంగా మహబూబాబాద్‌లో వామపక్షాల భారీ ర్యాలీ ఎరుపు జెండాలతో పట్టణం మార్మోగింది – కార్మిక హక్కుల కోసం గళమెత్తిన నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మేడే సందర్భంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ (ఎన్డీ) పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎరుపు రంగు షర్ట్లు ధరించిన కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా క్రమబద్ధంగా ర్యాలీ నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటారు. నినాదాలతో పట్టణం మార్మోగింది. ర్యాలీ అనంతరం తహశీల్దార్ కార్యాలయం సెంటర్ వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గన్ని సంచులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ అగ్నిప్రమాదానికి గురైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గన్నీ సంచుల లోడుతో బయలుదేరిన ట్రక్, కొత్తగూడెం సమీప అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా మంటలు గాలికి ఎగిరి వాహనంపై పడటంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు గమనించిన డ్రైవర్ భయంతో వాహనాన్ని నియంత్రించలేక చెట్టును ఢీకొట్టడంతో ట్రక్ బోల్తా పడింది. ఎండ వేడి, గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అటుగా వెళ్తున్న వారు సహాయం చేసి గన్ని సంచులను బయటకు తీశారు. అయితే గన్ని సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రక్కు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో డ్రైవర్ సుధాకర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.1
- కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.2
- *మీ సొంత మండలంలో డీలర్షిప్ పొందే అవకాశం** మొదటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ గా స్వీకరించింది అనగా మొత్తం 59 జిల్లాలు, 1280 మండలాలు మండల రిసోర్స్ పర్సన్(మండల రిప్రజెంటేటివ్) ఎలాట్మెంట్స్ జరుగుతున్నాయి మీకు, మీ కెరీర్ కు సార్థకత ఇచ్చే బెస్ట్ బిజినెస్ అవకాశం పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి! వేరొకరు మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు!మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి!!! ఎందుకంటే, ఒక మండలానికి ఒకరే రిసోర్స్ పర్సన్!ఉంటారు??? *CONTACT NO:9030818546*💐💐🤝🙏👇👇👇2
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…1
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.3
- నకిరేకల్ 30 :నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తోందని, ఆఖరికి ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వాతావరణ మార్పులతో పంట తడిసిపోతుందేమోనని రైతులు భయాందోళన చెందుతుంటే, స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ధనదాహం తప్ప రైతుల గోడు పట్టడం లేదని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి గింజను మద్దతు ధరతో సేకరించాలని జాయింట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగినా లేదా రైతులకు నష్టం కలిగించినా కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగుతామని ఘాటుగా హెచ్చరించారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.1