హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికులతో మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్... కార్మికుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.
హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికులతో మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్... కార్మికుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ
డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి
వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.
- హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపనలో సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బైండ్ల పంబాల కళాకారులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. జమదగ్ని మహర్షితో ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.1
- కరీంనగర్ నగరంలోని శుభాష్ నగర్‌లో ఉన్న కార్మిక సంఘ కార్యాలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం (BRTU) ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ MLC నరదాసు లక్ష్మణ్ రావు, BRS మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణలో BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు బొంకూరి రాములు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డులు తీసుకోవాలని సూచించారు. సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశమున్నందున అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS మైనారిటీ నాయకులునాఇమ్,మొబీన్,BRS విద్యార్థి నాయకులు, బొంకూరి మెహన్, భావన నిర్మాణ సంఘం సభ్యులు పులిపాక లక్ష్మణ్, కొమ్ము రమేష్, నీర్ల శ్రీనివాస్, గంగాధర శంకర్, ఆశీర్వాదం, మొదుంపెల్లి శంకరయ్య, గంట లక్ష్మణ్, చిప్ప శ్రీనివాస్, బత్తుల అనిల్ రాజ్ పాల్గొన్నారు.1
- ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.2
- *మీ సొంత మండలంలో డీలర్షిప్ పొందే అవకాశం** మొదటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ గా స్వీకరించింది అనగా మొత్తం 59 జిల్లాలు, 1280 మండలాలు మండల రిసోర్స్ పర్సన్(మండల రిప్రజెంటేటివ్) ఎలాట్మెంట్స్ జరుగుతున్నాయి మీకు, మీ కెరీర్ కు సార్థకత ఇచ్చే బెస్ట్ బిజినెస్ అవకాశం పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి! వేరొకరు మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు!మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి!!! ఎందుకంటే, ఒక మండలానికి ఒకరే రిసోర్స్ పర్సన్!ఉంటారు??? *CONTACT NO:9030818546*💐💐🤝🙏👇👇👇2
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గన్ని సంచులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ అగ్నిప్రమాదానికి గురైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గన్నీ సంచుల లోడుతో బయలుదేరిన ట్రక్, కొత్తగూడెం సమీప అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా మంటలు గాలికి ఎగిరి వాహనంపై పడటంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు గమనించిన డ్రైవర్ భయంతో వాహనాన్ని నియంత్రించలేక చెట్టును ఢీకొట్టడంతో ట్రక్ బోల్తా పడింది. ఎండ వేడి, గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అటుగా వెళ్తున్న వారు సహాయం చేసి గన్ని సంచులను బయటకు తీశారు. అయితే గన్ని సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రక్కు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో డ్రైవర్ సుధాకర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.1
- Post by Venu Gopal1
- ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.2
- డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.3