Shuru
Apke Nagar Ki App…
మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం ఆరోపణలు.. రైతుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.
M D Azizuddin
మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం ఆరోపణలు.. రైతుల ఆందోళన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1
- కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.2
- *మీ సొంత మండలంలో డీలర్షిప్ పొందే అవకాశం** మొదటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ గా స్వీకరించింది అనగా మొత్తం 59 జిల్లాలు, 1280 మండలాలు మండల రిసోర్స్ పర్సన్(మండల రిప్రజెంటేటివ్) ఎలాట్మెంట్స్ జరుగుతున్నాయి మీకు, మీ కెరీర్ కు సార్థకత ఇచ్చే బెస్ట్ బిజినెస్ అవకాశం పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి! వేరొకరు మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు!మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి!!! ఎందుకంటే, ఒక మండలానికి ఒకరే రిసోర్స్ పర్సన్!ఉంటారు??? *CONTACT NO:9030818546*💐💐🤝🙏👇👇👇2
- హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు1
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.3
- నకిరేకల్ 30 :నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తోందని, ఆఖరికి ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. వాతావరణ మార్పులతో పంట తడిసిపోతుందేమోనని రైతులు భయాందోళన చెందుతుంటే, స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ధనదాహం తప్ప రైతుల గోడు పట్టడం లేదని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి గింజను మద్దతు ధరతో సేకరించాలని జాయింట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగినా లేదా రైతులకు నష్టం కలిగించినా కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగుతామని ఘాటుగా హెచ్చరించారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గన్ని సంచులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ అగ్నిప్రమాదానికి గురైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గన్నీ సంచుల లోడుతో బయలుదేరిన ట్రక్, కొత్తగూడెం సమీప అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా మంటలు గాలికి ఎగిరి వాహనంపై పడటంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు గమనించిన డ్రైవర్ భయంతో వాహనాన్ని నియంత్రించలేక చెట్టును ఢీకొట్టడంతో ట్రక్ బోల్తా పడింది. ఎండ వేడి, గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. అటుగా వెళ్తున్న వారు సహాయం చేసి గన్ని సంచులను బయటకు తీశారు. అయితే గన్ని సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రక్కు కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో డ్రైవర్ సుధాకర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.1