Shuru
Apke Nagar Ki App…
భార్యకు వీడియో కాల్ చేసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని భర్త ఆత్మహత్య.. మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
M D Azizuddin
భార్యకు వీడియో కాల్ చేసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని భర్త ఆత్మహత్య.. మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…1
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.3
- ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.1
- _వెలిమినేడు నోచ్ ల్యాబ్స్‌లో రియాక్టర్ పేలుడు కలకలం.!_ మూడో నెంబర్ రియాక్టర్ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు... గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు... నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం.. వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల “పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన... భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు.. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు... వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..1
- గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు మనసా దేవి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు శుక్రవారం వేడుకల్లో భాగంగా అన్నపూర్ణాదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, శ్రీ చక్రానికి ఒక లక్ష ఎనిమిది వేల నాణములతో అభిషేకం నిర్వహించారు. 108 కళాశాలతో మానసా దేవి అమ్మవారికి అభిషేకం చేశారు. చండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వైశాఖ పౌర్ణమి కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి వారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు1
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక అంబులెన్స్‌కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీ నగర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అదనపు తూకం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జిసిసి కొనుగోలు కేంద్రంలో క్వింటాకు అదనంగా ఒక కిలో తూకం తీసుకుంటున్నారని హమాలీలు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తూకం వసూలు జరుగుతోందని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.1
- తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.2