Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.... తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
Chetty:Ramesh
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.... తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
More news from తెలంగాణ and nearby areas
- హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు1
- మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1
- *మీ సొంత మండలంలో డీలర్షిప్ పొందే అవకాశం** మొదటిగా మన రెండు తెలుగు రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్ట్ గా స్వీకరించింది అనగా మొత్తం 59 జిల్లాలు, 1280 మండలాలు మండల రిసోర్స్ పర్సన్(మండల రిప్రజెంటేటివ్) ఎలాట్మెంట్స్ జరుగుతున్నాయి మీకు, మీ కెరీర్ కు సార్థకత ఇచ్చే బెస్ట్ బిజినెస్ అవకాశం పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి! వేరొకరు మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు!మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి!!! ఎందుకంటే, ఒక మండలానికి ఒకరే రిసోర్స్ పర్సన్!ఉంటారు??? *CONTACT NO:9030818546*💐💐🤝🙏👇👇👇2
- కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.2
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.3
- ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…1