logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ ఆసిఫాబాద్ జిల్లా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహించేందుకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎంఆర్సీ కార్యాలయంలో శనివారం సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ అధ్యక్షతన సమావేశం జరిగింది.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను చాటిచెప్పే ప్రాముఖ్యమైన సందర్భంగా జాదవ్ అంబాజీ పేర్కొన్నారు. వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఐక్యతతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించి ఆదివాసీ సమాజ ఐకమత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత సమన్వయంతో పాల్గొని సహకరించాలని కోరారు.సమావేశంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి, అందరూ సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. రాజ్ గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు సిడాం అర్జు మాస్టర్, ఆసిఫాబాద్ మండల సార్ మేడి జ్ఞానేశ్వర్, ప్రధాన్ పురోహిత్ సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు పెందూర్ సుధాకర్, వెంకటేష్, పీఎంఆర్సీ ఏసీఎంఓ పూర్క ఉద్ధవ్, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 hr ago
6ce14ad4-d8b9-47dd-bee8-2ffed00416a9

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ ఆసిఫాబాద్ జిల్లా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహించేందుకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎంఆర్సీ కార్యాలయంలో శనివారం సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ అధ్యక్షతన సమావేశం

ef389bff-c36a-4509-b32a-bac1608b6dd1

జరిగింది.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను చాటిచెప్పే ప్రాముఖ్యమైన సందర్భంగా జాదవ్ అంబాజీ పేర్కొన్నారు. వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఐక్యతతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించి ఆదివాసీ సమాజ ఐకమత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత సమన్వయంతో పాల్గొని సహకరించాలని కోరారు.సమావేశంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి, అందరూ

a3f0ffb4-b9b8-4393-90e9-eff48ba00b26

సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. రాజ్ గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు సిడాం అర్జు మాస్టర్, ఆసిఫాబాద్ మండల సార్ మేడి జ్ఞానేశ్వర్, ప్రధాన్ పురోహిత్ సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు పెందూర్ సుధాకర్, వెంకటేష్, పీఎంఆర్సీ ఏసీఎంఓ పూర్క ఉద్ధవ్, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.
    1
    చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి
జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    1
    వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత

రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ

వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత
రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో మళ్లీ కురుస్తున్న వర్షం తాంసి మండల కేంద్రంలో శనివారం రాత్రి మళ్లీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. కప్పర్ల, బండల నాగపూర్, జామిడితో పాటు తదితర గ్రామాల్లోనూ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు అనుకూలిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    1
    తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో మళ్లీ కురుస్తున్న వర్షం
తాంసి మండల కేంద్రంలో శనివారం రాత్రి మళ్లీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. కప్పర్ల, బండల నాగపూర్, జామిడితో పాటు తదితర గ్రామాల్లోనూ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు అనుకూలిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ​కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​కుంటాల బి లో మళ్లీ గులాబీ జోష్ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో చేరికలు
నెరడిగొండ మండలం కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం, గ్రామస్తులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరగా,ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ.. గతంలో మరో పార్టీలో చేరడం తప్పిదమని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో కొనసాగుతామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    8 hrs ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.