ఏలూరు : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించాలి. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలి. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి* ... జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. గిరిజన తండాల్లో యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు వెలుగులు నింపాలని అన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఏర్పాటు లక్ష్యం 168 కాగా 95 గ్రౌండింగు, 72 వివిధ దశల్లో ఉండటం పట్ల జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిన ఒకటి కూడా పనులు మొదలు పెట్టేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు నూటికినూరు శాతం లక్ష్యాలను పూర్తిచెయ్యాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కులు పురోగతిపై నియోజకవర్గాల వారి సమీక్షించారు. చింతలపూడి నియోజకవర్గం రహదారులు, డ్రైన్లు నిర్మాణాన్ని పూర్తి చేసామన్నారు. ఏలూరు నియోజకవర్గంలో భూసేకరణ జరిగిందని పనులు పనులు ప్రారంభించునున్నామన్నారు. నూజివీడు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో భూ సేకరణ జరిగిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. కైకలూరు, పోలవరం భూమిని స్వాధీనం చేసుకుని పనులు మొదలు పెట్టుటకు చర్యలు చేపట్టాలన్నారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి నిర్ణీత సమయంకంటే ముందుగానే అనుమతులు మంజూరు చేసి, ప్రతి యూనిట్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు రాయితీపై సమీక్షించి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెట్టుబడి రాయితీ 18 యూనిట్లకు రూ 3 కోట్ల 81 లక్షలు ఇందులో ఇన్సెంటివ్ సబ్సిడీ రెండు యూనిట్లకు రూ 2 కోట్ల 50 లక్షలు, పవర్ సబ్సిడీ 6 యూనిట్లకు రూ 60,72,640 లు, వడ్డీ రాయితీ 9 యూనిట్లకు రూ 62,24,388 లు, స్టాంపు డ్యూటీ సబ్సిడీ ఒక యూనిటుకు రూ 8,03,005 లు మంజూరు చేసామని తెలిపారు. ఋణాలు మంజూరులో ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రుణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా రంగాలలో నూతన వరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు దారులను మరింత ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానించి ప్రభుత్వం నుండి వారికి కావలసిన సౌకర్యాలు, సహాయం అందించడం కోసం వారితో సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చెయ్యాలని అధికారులు ఆదేశించారు. 2025-26 సంవత్సరంలో పి ఎం ఈ జి పి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం క్రింద జిల్లాలో 377 దరఖాస్తులు రాగా రు. 293 లక్షల రూపాయలతో 193 యూనిట్స్ ను గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. కొబ్బరి పీచు మరియు కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లభ్యమయ్యే విధంగా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేసే దిశగా అధికారులు స్వయం సహాయక సంఘాల గ్రూపులకు అవగాహనతో కూడిన శిక్షణను అందించాలని అన్నారు. అదేవిధంగా పర్యావరణ కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, క్రమబద్ధీకరించి, శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా చేసి, కొత్త ఉత్పత్తులుగా మార్చే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించే దిశగా యువతను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, పొల్యూషన్ బోర్డు ఇఇ ఏ.రామచంద్ర మూర్తి, జిల్లా గ్రౌండు డిడి పైలా కోదండరామ్, యస్ సి కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా పంచాయతీరాజ్ యస్ఇ జెడ్.రమేష్, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్. జితేంద్రబాబు, యల్డియం డి.నీలాద్రి, మెప్మా పిడి యం.రాజబాబు, జిల్లా ట్రాన్సుపోర్టు అధికారి యస్.బి.శేఖరు, జిల్లా మత్స్యశాఖ ఇంచార్జి డిడి బి.రాజ్ కుమార్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించాలి. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలి. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి* ... జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. గిరిజన తండాల్లో యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు వెలుగులు నింపాలని అన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఏర్పాటు లక్ష్యం 168 కాగా 95 గ్రౌండింగు, 72 వివిధ దశల్లో ఉండటం పట్ల జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిన ఒకటి కూడా పనులు మొదలు పెట్టేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు నూటికినూరు శాతం లక్ష్యాలను పూర్తిచెయ్యాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కులు పురోగతిపై నియోజకవర్గాల వారి సమీక్షించారు. చింతలపూడి నియోజకవర్గం రహదారులు, డ్రైన్లు నిర్మాణాన్ని పూర్తి చేసామన్నారు. ఏలూరు నియోజకవర్గంలో భూసేకరణ జరిగిందని పనులు పనులు ప్రారంభించునున్నామన్నారు. నూజివీడు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో భూ సేకరణ జరిగిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. కైకలూరు, పోలవరం భూమిని స్వాధీనం చేసుకుని పనులు మొదలు పెట్టుటకు చర్యలు చేపట్టాలన్నారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, అవసరాన్ని బట్టి నిర్ణీత సమయంకంటే ముందుగానే అనుమతులు మంజూరు చేసి, ప్రతి యూనిట్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు రాయితీపై సమీక్షించి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెట్టుబడి రాయితీ 18 యూనిట్లకు రూ 3 కోట్ల 81 లక్షలు ఇందులో ఇన్సెంటివ్ సబ్సిడీ రెండు యూనిట్లకు రూ
2 కోట్ల 50 లక్షలు, పవర్ సబ్సిడీ 6 యూనిట్లకు రూ 60,72,640 లు, వడ్డీ రాయితీ 9 యూనిట్లకు రూ 62,24,388 లు, స్టాంపు డ్యూటీ సబ్సిడీ ఒక యూనిటుకు రూ 8,03,005 లు మంజూరు చేసామని తెలిపారు. ఋణాలు మంజూరులో ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రుణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా రంగాలలో నూతన వరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు దారులను మరింత ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానించి ప్రభుత్వం నుండి వారికి కావలసిన సౌకర్యాలు, సహాయం అందించడం కోసం వారితో సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చెయ్యాలని అధికారులు ఆదేశించారు. 2025-26 సంవత్సరంలో పి ఎం ఈ జి పి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం క్రింద జిల్లాలో 377 దరఖాస్తులు రాగా రు. 293 లక్షల రూపాయలతో 193 యూనిట్స్ ను గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. కొబ్బరి పీచు మరియు కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లభ్యమయ్యే విధంగా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేసే దిశగా అధికారులు స్వయం సహాయక సంఘాల గ్రూపులకు అవగాహనతో కూడిన శిక్షణను అందించాలని అన్నారు. అదేవిధంగా పర్యావరణ కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, క్రమబద్ధీకరించి, శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా చేసి, కొత్త ఉత్పత్తులుగా మార్చే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించే దిశగా యువతను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, పొల్యూషన్ బోర్డు ఇఇ ఏ.రామచంద్ర మూర్తి, జిల్లా గ్రౌండు డిడి పైలా కోదండరామ్, యస్ సి కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా పంచాయతీరాజ్ యస్ఇ జెడ్.రమేష్, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్. జితేంద్రబాబు, యల్డియం డి.నీలాద్రి, మెప్మా పిడి యం.రాజబాబు, జిల్లా ట్రాన్సుపోర్టు అధికారి యస్.బి.శేఖరు, జిల్లా మత్స్యశాఖ ఇంచార్జి డిడి బి.రాజ్ కుమార్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Post by V Ramarao1
- Post by Syyed taher1
- మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు1
- కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.1
- 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”1
- పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన పట్టా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇంచార్జ్,రాష్ట్ర పిఎసి సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలోని పట్టా భూముల వద్ద బాధితులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణ పరిధిలోని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో సుమారు 20 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా,ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోగా, ఉన్న భూమిని లాక్కోవడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. పట్టాదారులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, పేదలకు ఇచ్చిన పట్టా భూములను వారికే అప్పగించి,తక్షణమే ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, పేదల హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా ప్రజల పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు, చెల్లూరి లోవరాజు, ఖండవల్లి చిన్న లోవరాజు లబ్ధిదారులు మరియు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.2
- ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని వై. రామవరం పోలీసులు కొమరవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ 158 కిలోల గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వీరిపై రంపచోడవరం డివిజన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఎస్పీ అష్రఫ్ తెలిపారు.1
- Post by V Ramarao2