Shuru
Apke Nagar Ki App…
😭
Rambabu Adhimulam
😭
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 😭1
- Post by గెద్దాడ ఈశ్వర్3
- రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవ పై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత లను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన “మే-3 ఛలో ఆకివీడు” పిలుపు నేపథ్యంలో, కాకినాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో వాల్‌పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో దళితులపై ఒత్తిడి, వివక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రఘురామ కృష్ణం రాజు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మతాల మధ్య విభేదాలు రేకెత్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రం శాంతి, సామరస్యాల తో ముందుకు సాగాలంటే దళితుల హక్కులను కాపాడటం అత్యవసరం అని, అందుకోసం దళితులు, దళిత క్రైస్తవులు, వివిధ దళిత సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మే 3న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో నిర్వహించే “ఛలో ఆకివీడు” కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయాలని, దళితుల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి BSP కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఇందులో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతలు కొండబాబు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తోటి చెంగల్ రావు, మాల మహానాడు నాయకుడు పండు అశోక్ కుమార్, దళిత ప్రజా చైతన్య రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, BSP జిల్లా ఇంచార్జ్ సబ్బారపు ఆప్పారావు, జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు, ట్రెజరర్ సాధన రాజు, అడ్వైజర్ ప్రత్తిపాటి బుల్లి రాజు తో పాటు పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.3
- Post by Meenakshi1
- పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంప గ్రామంలో లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై ఆరా తీస్తూనే.. జనగణన సర్వేకు సహకరించాలని, ఉపాధి హామీ 'జలధార' ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.1
- Post by Master Ameen Shaik1
- అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి కాసిన ఎండకు భారీ ఒక్క బోధకు ప్రజలు కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా కోరడంతో గొంతులతో ఉన్న రహదారులన్నీ వర్షపు నీరుతో మూసుకుపోయాయి దీనితో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏1