logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అలంపూర్: వంటశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. రిజ్వాన్ భాషా అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయాలకు వచ్చి భక్తులకు ఏర్పాటుచేసిన వంటశాలను నేడు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పరిశీలించారు. వచ్చిన భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మార్వో ప్రభాకర్, ఎస్సై రామకృష్ణ, కమిషనర్ రాజేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

5 hrs ago
user_Zakeer
Zakeer
Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
5 hrs ago
b3cd32fa-f920-4816-9397-fdfa64185f0a

అలంపూర్: వంటశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. రిజ్వాన్ భాషా అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయాలకు వచ్చి భక్తులకు ఏర్పాటుచేసిన వంటశాలను నేడు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పరిశీలించారు. వచ్చిన భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మార్వో ప్రభాకర్, ఎస్సై రామకృష్ణ, కమిషనర్ రాజేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
    1
    అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు
అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • అలంపూరు కాంగ్రెస్ నాయకులకు రాఖీలు కట్టిన తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) పురస్కరించుకుని_ *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, in ub మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య గారు* _అలంపూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు_ *తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజర్ కమిటీ మాజీ మెంబర్ "మహమ్మద్ ఇస్మాయిల్", కౌన్సిలర్ "జమ్మన్న," నాయకులు "రజిని బాబు," "మద్దిలేటి," "సురేష్" కురాఖీలు కట్టి సోదరభావం చాటారు._ ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సరిత* *తిరుపతయ్యగారికి శుభాకాంక్షలు తెలిపారు.*
    1
    అలంపూరు కాంగ్రెస్ నాయకులకు రాఖీలు కట్టిన తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య 
శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) పురస్కరించుకుని_  *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, in ub మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య గారు* _అలంపూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు_  *తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజర్ కమిటీ మాజీ మెంబర్ "మహమ్మద్ ఇస్మాయిల్", కౌన్సిలర్ "జమ్మన్న," నాయకులు "రజిని బాబు," "మద్దిలేటి," "సురేష్" కురాఖీలు కట్టి సోదరభావం చాటారు._
ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సరిత* *తిరుపతయ్యగారికి శుభాకాంక్షలు తెలిపారు.*
    user_Khajavali
    Khajavali
    General Store ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • అర్జీల పరిష్కారంపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాములపాడు:- ప్రజా సమస్యలను ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించాలనే ఉద్దేశంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు జిల్లాలో అమలు చేస్తున్న “వన్ మంత్ –ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. వన్ మంత్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు, కొత్తపల్లి మండలాలకు సంబంధించి పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నందికొట్కూరు నియోజకవర్గం శ్రీశైలం జి.జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశా నిర్దేశాల మేరకు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వారాల పాటు మండల హెడ్‌క్వార్టర్లు లేదా నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌లో ప్రజా వినతులు స్వీకరించి, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి నెలలో ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని పూర్తి చేయగా సుమారు 2,500 గ్రీవెన్స్ స్వీకరించినట్లు తెలిపారు. రెండో నెలలో శ్రీశైలం నియోజకవర్గంలో సుమారు 2,200 గ్రీవెన్స్ స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడవ నియోజకవర్గంగా నందికొట్కూరులో పిజిఆర్ఎస్ ప్రారంభించామని, పాములపాడు, కొత్తపల్లి రెండు మండలాలను ఒక యూనిట్‌గా తీసుకుని నాలుగు వారాల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అర్జిదారులు అందజేయాలని ప్రతి అర్జీని పరిశీలించేందుకు సుమారు 15 రోజుల సమయం కేటాయించి, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిశీలిస్తారని తెలిపారు. సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని చూపడం జరుగుతుందన్నారు. కొత్త పింఛన్ల కోసం అర్జీలు అందజేయవచ్చని, అయితే ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం అర్హత ఆధారంగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సిబ్బంది అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హతను నిర్ధారిస్తారని చెప్పారు. కొత్త పింఛన్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన ప్రజలు హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా తప్పనిసరిగా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయంలోని సంబంధిత సిబ్బంది ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు, హౌసింగ్ బిల్లుల చెల్లింపులు, కొత్త ఇళ్లకు సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు రీ సర్వే తదితర అంశాలపై కూడా ప్రజలు అర్జీలు అందజేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలోనే పరిష్కరించగలిగే సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం మీదుగా NH-340C జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా భూములు కోల్పోయిన వారికి సంబంధించిన నష్టపరిహారం, చెల్లింపుల్లో సమస్యలు, అదనపు పరిహారం కోరడం, ఆర్బిట్రేషన్‌కు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలు, నీటి లభ్యత తదితర అన్ని విషయాలకు సంబంధించి ప్రజలు వినతులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే, సాధ్యమైన ప్రతి సమస్యకు నిబంధనల పరిధిలో పరిష్కార మార్గం చూపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే జిల్లా యంత్రాంగం వచ్చి సమస్యలను స్వీకరిస్తున్నందున, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పాములపాడు, కొత్తపల్లి మండలాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు సహకరిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ....ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న One Month - One Constituency కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లె, పాములపాడు ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరించడం, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ప్రభుత్వ పాలనలో ప్రత్యేకతగా తెలిపారు. గతంలో చేపట్టిన భూ రీ-సర్వే కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పారదర్శక విధానంలో నోటీసులు జారీ చేస్తూ రీ-సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాటెడ్ ల్యాండ్స్, ఇనాం భూములు, అసైన్డ్ భూములు, జాయింట్ ఖాతానంబర్లు తదితర సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, సుమారు రూ.250 కోట్లతో చేపట్టిన గుమ్మడాపురం తాగునీటి పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా సాగునీటి వనరులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు రూ.65 కోట్లతో ఇరిగేషన్ మరమ్మతు పనులకు అనుమతులు లభించినట్లు తెలిపారు. VRSP కనెక్టివిటీ సమస్య కారణంగా వరదల సమయంలో కొత్తపల్లె మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలో చేస్తున్నామన్నారు. ఎదురుపాడు, లింగాల, కొక్కెరంచ, నాంపల్లె ప్రాంతాలకు సంబంధించిన లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణకు DMF నిధుల ద్వారా సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ హౌసింగ్, సామాజిక పింఛన్లు, శ్మశాన వాటికలు (బరియల్ గ్రౌండ్స్) తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది ప్రజా వినతులను స్వీకరించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమయపాలన పాటిస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి అర్జీదారుడి సమస్యను స్వీకరించి, సంబంధిత శాఖల ద్వారా నిబంధనల మేరకు పరిశీలించి తగిన పరిష్కారం, న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ప్రాంతంలోనే అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నందున One Month - One Constituency కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజా వినతులను స్వీకరించారు.
    1
    అర్జీల పరిష్కారంపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పాములపాడు:- ప్రజా సమస్యలను ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించాలనే ఉద్దేశంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు జిల్లాలో అమలు చేస్తున్న “వన్ మంత్ –ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. వన్ మంత్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు, కొత్తపల్లి మండలాలకు సంబంధించి పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో  నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నందికొట్కూరు నియోజకవర్గం శ్రీశైలం జి.జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశా నిర్దేశాల మేరకు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వారాల పాటు మండల హెడ్‌క్వార్టర్లు లేదా నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌లో ప్రజా వినతులు స్వీకరించి, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి నెలలో ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని పూర్తి చేయగా సుమారు 2,500 గ్రీవెన్స్ స్వీకరించినట్లు తెలిపారు. రెండో నెలలో శ్రీశైలం నియోజకవర్గంలో సుమారు 2,200 గ్రీవెన్స్ స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడవ నియోజకవర్గంగా నందికొట్కూరులో పిజిఆర్ఎస్ ప్రారంభించామని, పాములపాడు, కొత్తపల్లి రెండు మండలాలను ఒక యూనిట్‌గా తీసుకుని నాలుగు వారాల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ  రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అర్జిదారులు అందజేయాలని ప్రతి అర్జీని పరిశీలించేందుకు సుమారు 15 రోజుల సమయం కేటాయించి, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిశీలిస్తారని తెలిపారు. సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని చూపడం జరుగుతుందన్నారు. కొత్త పింఛన్ల కోసం అర్జీలు అందజేయవచ్చని, అయితే ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం అర్హత ఆధారంగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సిబ్బంది అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హతను నిర్ధారిస్తారని చెప్పారు. కొత్త పింఛన్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన ప్రజలు హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా తప్పనిసరిగా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయంలోని సంబంధిత సిబ్బంది ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు, హౌసింగ్ బిల్లుల చెల్లింపులు, కొత్త ఇళ్లకు సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు రీ సర్వే తదితర అంశాలపై కూడా ప్రజలు అర్జీలు అందజేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలోనే పరిష్కరించగలిగే సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం మీదుగా NH-340C జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా భూములు కోల్పోయిన వారికి సంబంధించిన నష్టపరిహారం, చెల్లింపుల్లో సమస్యలు, అదనపు పరిహారం కోరడం, ఆర్బిట్రేషన్‌కు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలు, నీటి లభ్యత తదితర అన్ని విషయాలకు సంబంధించి ప్రజలు వినతులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే, సాధ్యమైన ప్రతి సమస్యకు నిబంధనల పరిధిలో పరిష్కార మార్గం చూపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే జిల్లా యంత్రాంగం వచ్చి సమస్యలను స్వీకరిస్తున్నందున, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పాములపాడు, కొత్తపల్లి మండలాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు సహకరిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రెవెన్యూ, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ....ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న One Month - One Constituency  కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లె, పాములపాడు ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరించడం, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ప్రభుత్వ పాలనలో ప్రత్యేకతగా తెలిపారు. గతంలో చేపట్టిన భూ రీ-సర్వే కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పారదర్శక విధానంలో నోటీసులు జారీ చేస్తూ రీ-సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాటెడ్ ల్యాండ్స్, ఇనాం భూములు, అసైన్డ్ భూములు, జాయింట్ ఖాతానంబర్లు తదితర సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, సుమారు రూ.250 కోట్లతో చేపట్టిన గుమ్మడాపురం తాగునీటి పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా సాగునీటి వనరులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు రూ.65 కోట్లతో ఇరిగేషన్ మరమ్మతు పనులకు అనుమతులు లభించినట్లు తెలిపారు. VRSP కనెక్టివిటీ సమస్య కారణంగా వరదల సమయంలో కొత్తపల్లె మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలో చేస్తున్నామన్నారు. ఎదురుపాడు, లింగాల, కొక్కెరంచ, నాంపల్లె ప్రాంతాలకు సంబంధించిన లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణకు DMF నిధుల ద్వారా సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ హౌసింగ్, సామాజిక పింఛన్లు, శ్మశాన వాటికలు (బరియల్ గ్రౌండ్స్) తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది ప్రజా వినతులను స్వీకరించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమయపాలన పాటిస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి అర్జీదారుడి సమస్యను స్వీకరించి, సంబంధిత శాఖల ద్వారా నిబంధనల మేరకు పరిశీలించి తగిన పరిష్కారం, న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ప్రాంతంలోనే అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నందున One Month - One Constituency  కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజా వినతులను స్వీకరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    52 min ago
  • నందికొట్కూరు: మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలి! సీపీఎం బషీర్ బాగ్ ఉద్యమ స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం నాయకుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు నందికొట్కూరులో పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక భారాలు మోపుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడుతున్నాయని ఆరోపించారు.
    1
    నందికొట్కూరు: మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలి! సీపీఎం 
బషీర్ బాగ్ ఉద్యమ స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం నాయకుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు నందికొట్కూరులో పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక భారాలు మోపుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడుతున్నాయని ఆరోపించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    56 min ago
  • విద్యుత్ కోతల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇలా అయితే ఎలా ధరూర్: మండలంలోని నీలహల్లి గ్రామ సమీపంలో ఉన్న కె.టి.దొడ్డి మండలం పాతపాలెం 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నుంచి వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా కొనసాగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా తరచూ విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించాలని రైతుల కోరారు.
    1
    విద్యుత్ కోతల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇలా అయితే ఎలా
ధరూర్: మండలంలోని నీలహల్లి  గ్రామ సమీపంలో ఉన్న కె.టి.దొడ్డి మండలం పాతపాలెం 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం నుంచి వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ సరఫరా కొనసాగుతోంది. అయితే గత రెండు మూడు రోజులుగా తరచూ విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పందించాలని రైతుల కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    5 hrs ago
  • ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    1
    ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది. రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    1
    రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి

రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మిడుతూరు మండల కేంద్రమైన వీపనగండ్లలో జోరుగా కురిసిన వర్షం మిడుతూరు మండలం వీపనగండ్లలో మధ్యాహ్నం 4 గంటల సమయంలో వర్షం జోరుగా కురిసిందని స్థానికులు తెలిపారు. చాలా రోజులకు వర్షాలు లేక ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. మరోవైపు మిరప, కంది తదితర పంటలకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఈ వర్షం భారీ వర్షం గా మారితే అన్ని పంటలకు లబ్ది చేకూరుతుందని రైతులు వివరించారు.
    1
    మిడుతూరు మండల కేంద్రమైన వీపనగండ్లలో జోరుగా కురిసిన వర్షం
మిడుతూరు మండలం వీపనగండ్లలో మధ్యాహ్నం 4 గంటల సమయంలో వర్షం జోరుగా కురిసిందని స్థానికులు తెలిపారు. చాలా రోజులకు వర్షాలు లేక ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. మరోవైపు మిరప, కంది తదితర పంటలకు ఈ వర్షం ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఈ వర్షం భారీ వర్షం గా మారితే అన్ని పంటలకు లబ్ది చేకూరుతుందని రైతులు వివరించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.