అర్జీల పరిష్కారంపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాములపాడు:- ప్రజా సమస్యలను ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించాలనే ఉద్దేశంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు జిల్లాలో అమలు చేస్తున్న “వన్ మంత్ –ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. వన్ మంత్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు, కొత్తపల్లి మండలాలకు సంబంధించి పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నందికొట్కూరు నియోజకవర్గం శ్రీశైలం జి.జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశా నిర్దేశాల మేరకు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వారాల పాటు మండల హెడ్‌క్వార్టర్లు లేదా నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌లో ప్రజా వినతులు స్వీకరించి, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. మొదటి నెలలో ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని పూర్తి చేయగా సుమారు 2,500 గ్రీవెన్స్ స్వీకరించినట్లు తెలిపారు. రెండో నెలలో శ్రీశైలం నియోజకవర్గంలో సుమారు 2,200 గ్రీవెన్స్ స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడవ నియోజకవర్గంగా నందికొట్కూరులో పిజిఆర్ఎస్ ప్రారంభించామని, పాములపాడు, కొత్తపల్లి రెండు మండలాలను ఒక యూనిట్‌గా తీసుకుని నాలుగు వారాల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అర్జిదారులు అందజేయాలని ప్రతి అర్జీని పరిశీలించేందుకు సుమారు 15 రోజుల సమయం కేటాయించి, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యను పరిశీలిస్తారని తెలిపారు. సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని చూపడం జరుగుతుందన్నారు. కొత్త పింఛన్ల కోసం అర్జీలు అందజేయవచ్చని, అయితే ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసిన అనంతరం అర్హత ఆధారంగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సిబ్బంది అర్హుల ఇళ్ల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హతను నిర్ధారిస్తారని చెప్పారు. కొత్త పింఛన్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన ప్రజలు హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా తప్పనిసరిగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయంలోని సంబంధిత సిబ్బంది ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు, హౌసింగ్ బిల్లుల చెల్లింపులు, కొత్త ఇళ్లకు సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు రీ సర్వే తదితర అంశాలపై కూడా ప్రజలు అర్జీలు అందజేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలోనే పరిష్కరించగలిగే సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం మీదుగా NH-340C జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా భూములు కోల్పోయిన వారికి సంబంధించిన నష్టపరిహారం, చెల్లింపుల్లో సమస్యలు, అదనపు పరిహారం కోరడం, ఆర్బిట్రేషన్‌కు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలు, నీటి లభ్యత తదితర అన్ని విషయాలకు సంబంధించి ప్రజలు వినతులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే, సాధ్యమైన ప్రతి సమస్యకు నిబంధనల పరిధిలో పరిష్కార మార్గం చూపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే జిల్లా యంత్రాంగం వచ్చి సమస్యలను స్వీకరిస్తున్నందున, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పాములపాడు, కొత్తపల్లి మండలాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు సహకరిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ, తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ....ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న One Month - One Constituency కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లె, పాములపాడు ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరించడం, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ప్రభుత్వ పాలనలో ప్రత్యేకతగా తెలిపారు. గతంలో చేపట్టిన భూ రీ-సర్వే కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పారదర్శక విధానంలో నోటీసులు జారీ చేస్తూ రీ-సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాటెడ్ ల్యాండ్స్, ఇనాం భూములు, అసైన్డ్ భూములు, జాయింట్ ఖాతానంబర్లు తదితర సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, సుమారు రూ.250 కోట్లతో చేపట్టిన గుమ్మడాపురం తాగునీటి పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా సాగునీటి వనరులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు రూ.65 కోట్లతో ఇరిగేషన్ మరమ్మతు పనులకు అనుమతులు లభించినట్లు తెలిపారు. VRSP కనెక్టివిటీ సమస్య కారణంగా వరదల సమయంలో కొత్తపల్లె మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలో చేస్తున్నామన్నారు. ఎదురుపాడు, లింగాల, కొక్కెరంచ, నాంపల్లె ప్రాంతాలకు సంబంధించిన లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణకు DMF నిధుల ద్వారా సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ హౌసింగ్, సామాజిక పింఛన్లు, శ్మశాన వాటికలు (బరియల్ గ్రౌండ్స్) తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది ప్రజా వినతులను స్వీకరించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమయపాలన పాటిస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి అర్జీదారుడి సమస్యను స్వీకరించి, సంబంధిత శాఖల ద్వారా నిబంధనల మేరకు పరిశీలించి తగిన పరిష్కారం, న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ప్రాంతంలోనే అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నందున One Month - One Constituency కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజా వినతులను స్వీకరించారు.

- భార్యపై అనుమానంతో సంధ్య హత్య - భర్త అరెస్ట్........... బద్వేలు/సూళ్లూరుపేట, ఆగస్టు 28: తిరుపతి జిల్లా కోటపోలూరుకు చెందిన పనబాక సంధ్య హత్య కేసులో భర్త శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్త భార్యపై అనుమానంతో వేధిస్తుండడంతో ఆమె 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. పథకం ప్రకారం ఆగస్టు 25న సూళ్లూరుపేటలోని ఆర్‌కె లాడ్జికి పిలిపించి గొడవపడ్డాడు. సిబ్బంది వారించడంతో బైక్‌పై కోటపోలూరు పుచ్చ కాలువ పొలాల వద్దకు తీసుకెళ్లి గొంతుపై కాలితో తొక్కి హత్య చేశాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.1
- నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.1
- రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️ పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢1
- జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ1
- లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. బద్వేలు రేంజ్ ఆఫీసర్ ఆలీ. బద్వేలు, ఆగస్టు 28: బద్వేలు మండలం లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల తవ్వకాలు వేట కలకలం రేగింది బద్వేల్ కు సమీపంలోని కొత్తచెరువు గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాఅనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అధికారులను చూసి మరో నలుగురు అడవిలోకి పరార్ అయినట్లు సమాచారం పట్టుబడిన వ్యక్తులు తిరుపతి, సిద్ధవటం, రాయచోటి ప్రాంతాలకు చెందిన వారిగా అనుమానం గా ఉందని అధికారులు తెలిపారుఘటనా స్థలంలో 3 బైకులు, 1 కారును స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు గుప్త నిధుల కోసం అభయారణ్యంలోకి అక్రమంగా ప్రవేశించి గుప్త నిధులకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు3
- హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ1
- కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.1
- నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. పట్టణానికి చెందిన కంభంపాటి కవిత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. తొలుత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు, మరుసటి రోజు శిశువు హార్ట్‌బీట్ సరిగా లేదంటూ ఆపరేషన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేశారని, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.1
- మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ నడిరోడ్డుపై కోదాడ సీఐ దాష్టీకం_ హైదరాబాద్, ఆగస్టు 28..దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన కోదాడ టౌన్ సీఐ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితుల ఆరోపణలు మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరుపై నిరసనకు దిగిన బాధితులు బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన కోదాడ టౌన్ సీఐ1