Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పోర్ట్స్ మ్యాన్ అవతారమెత్తారు. MLAలు, MLCల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. పలువురు MLAలు, విద్యార్థులతో సరదాగా ఆడి సందడి చేశారు. ఈ క్రమంలో తన టీమ్ తరఫున ఆయన 4 గోల్స్ సాదించారు. దీంతో సహచర ప్లేయర్లు ఆయనను భుజాలపై ఎత్తుకొని అభినందించారు. ఈ మ్యాచులో CM టీమ్ గెలిచింది. ఇక్కడ 2 రోజుల పాటు ప్రజాప్రతినిధుల ఆటలపోటీలు జరగనున్నాయి.
Ramesh Solanki
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పోర్ట్స్ మ్యాన్ అవతారమెత్తారు. MLAలు, MLCల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. పలువురు MLAలు, విద్యార్థులతో సరదాగా ఆడి సందడి చేశారు. ఈ క్రమంలో తన టీమ్ తరఫున ఆయన 4 గోల్స్ సాదించారు. దీంతో సహచర ప్లేయర్లు ఆయనను భుజాలపై ఎత్తుకొని అభినందించారు. ఈ మ్యాచులో CM టీమ్ గెలిచింది. ఇక్కడ 2 రోజుల పాటు ప్రజాప్రతినిధుల ఆటలపోటీలు జరగనున్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మోస్తా నుండి భారీ వర్షం నమోదవుతుంది. సోమవారం సాయంత్రం మూడున్నర గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం జన్నారంతో పాటు పలు గ్రామాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. జన్నారం మండలంలో ప్రతిరోజు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రైతు కార్యదర్శి జంగం అంజయ్య విద్యుత్ షాక్ తో మృతి. వెంకట్రాయుని చెరువు సమీపంలో పంట పొలం వద్ద ఘటన.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- కరీంనగర్ జిల్లాలో కొత్త తరహాలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ పేరుతో మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడం తో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళా మోసపోయనని గ్రహించి ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. చేసింది. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండలం రాజంపేట గ్రామ పంచాయతీలో సోమవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ పోచయ్యతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి ఈ రోడ్డు పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి పటేల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.1
- విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.1
- తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ తమకు రావలసిన బకాయిల కోసం కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరసన ఆందోళనకు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ తెలంగాణ జాగృతి జిల్లా అద్యక్షులు హరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని , జిపిఎఫ్ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు బకాయి ఉన్న డీఏ ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారని ఉద్యోగ సమయంలో వారు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 25 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని.. వారు రిటైర్డ్ అనంతరం పిల్లల వివాహానికి కావచ్చు ఇల్లు నిర్మించుకోవడం కోసం కావచ్చు.. ఇలా భవిష్యత్తు కొరకు ఉద్యోగం చేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బును రిటైర్డ్ అయిన తర్వాత వస్తుందని ఎదురు చూసే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక రెండున్నరెండ్లుగా సుమారు 50మంది వరకు మానసికక్షోభకు గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ లలో కమిషన్ల కోసం ప్రభుత్వం సుమారు 63 వేల కోట్లను విడుదల చేసిందని ఆరోపించారు.2