ఆశాల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలి : సిఐటియు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తవిటి వెంకటమ్మ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చే అతి తక్కువ పారితోషికాలు కూడా నెల నెల రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆశా వర్కర్లకు ఏప్రిల్ నెల పారితోషికం ఇప్పటివరకు రాలేదు. పారితోషికం రాక ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. అవసరాల కోసం ఆశా వర్కర్లు అప్పులు చేయాల్సి వస్తుంది. ఇ.ఎం.ఐ. లు కట్టలేక ఆశాలు అల్లాడుతున్నారు. ఆశాల ఆర్ధిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకొని వెంటనే ఏప్రిల్ నెల పారితోషికం చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ద సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు ఆ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 50 లక్షల ఇన్సూరెన్స్, 50 వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పి.ఆర్.సి. ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, 2022 నుండి 2025 వరకు నాలుగు సంవత్సరాల లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలని కోరారు.ఎగ్జామ్ డ్యూటీలకు అదనపు పారితోషికాన్ని ప్రభుత్వం నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులకు వెంటనే జి.ఓ. లు ఇవ్వాలని,పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ., సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని. ఎ.ఎన్.ఎం, జి.ఎన్.ఎం. ట్రైనింగు్పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం వెంటనే నిర్ణయించాలని కోరారు.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని,ఆశాలతో ఎన్ . సి.డి ఆన్లైన్ పని చేయించకూడదు. స్పూటమ్ డబ్బాలు మోయించకూడదు. పూనమ్ క్లాత్తో కూడిన క్వాలిటీ యూనిఫాం సప్లై చేయాలని కోరారు ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటిని గుర్తించాలని,ప్రభుత్వ అన్ని ఆస్పత్రుల్లో ఆశాలకు ప్రత్యేకంగా రెస్టు రూమ్ లు ఏర్పాటు చేయాలి. ఆశాలకు పనిభారం తగ్గించాలి. పారితోషికం లేని పనులు చేయించకూడదు.ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించని యడల జూలైలో సమ్మె చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ వీరభద్రమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లకపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమల్ల సుధీర్, ఆశా వర్కర్లు ప్రేమలత, వజ్రమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.1
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.1