logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు. విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు. పుస్తకాలు చదివిజ్ఞానాన్ని సంపాదించాలన్నారు.

4 hrs ago
user_BHEEMARAO BYPALLI
BHEEMARAO BYPALLI
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
62cd4580-1de8-463b-a69b-1ca5de8c9230
53ead73d-1769-4559-b7a5-61218e75860a
3f4b3bad-d727-41f7-9172-a4d061901fac
5a1cd9a2-1b48-4a41-b56b-cec615fa9455
dc4a287a-f5d2-4ac2-9968-a82d8f21a59c

విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు. విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు. పుస్తకాలు చదివిజ్ఞానాన్ని సంపాదించాలన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మెలియాపుట్టి మండలంలో జలక లింగుపురం ప్రాథమికోన్నత పాఠశాల నందు హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు దేవేందర్ రావు, పద్మనాభరావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్య తోనే భవిష్యత్తు బాగుంటుందని అందరూ చక్కగా చదువుకోవాలని తెలిపారు.సర్పంచ్ ప్రతినిధి రవ్వల గణపతి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.ప్రత్యేకంగా సురేష్ మాస్టారు డాన్స్ ని అందరూ చూసి ఆనందించారు. చిన్నారులకు అభినందనలు తెలిపారు.
    1
    మెలియాపుట్టి మండలంలో జలక లింగుపురం ప్రాథమికోన్నత పాఠశాల నందు హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు దేవేందర్ రావు, పద్మనాభరావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్య తోనే భవిష్యత్తు బాగుంటుందని అందరూ చక్కగా చదువుకోవాలని తెలిపారు.సర్పంచ్ ప్రతినిధి రవ్వల గణపతి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.ప్రత్యేకంగా సురేష్ మాస్టారు డాన్స్ ని అందరూ చూసి ఆనందించారు. చిన్నారులకు అభినందనలు తెలిపారు.
    user_JDR
    JDR
    మేలియాపుట్టి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • శ్రీకాకుళం,ఏప్రిల్,22: ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జడ్పీ సీఈవో వెంకటరామన్ లతో కలసి బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో సభలో ప్రజా సమస్యల పై సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. భూ గర్భజలాలు సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. *డ్వామా* ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులను పిడి వివరించగా జాబ్ కొన్ని గ్రామాల్లో జారీ చేయాల్సి ఉందని సభ్యులు తెలుపగా అందరికి జాబ్ కార్డులు జారీ చేసినట్లు పిడి వివరించారు. శత శాతం జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కూలీల అకౌంట్ల అప్డేషన్ పై సమీక్షించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయం పై ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రాష్ట్రంలోనే వేజస్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సభ్యులకు తెలిపారు. సీతంపేట ఐటిడిఎ పిఓ తో కలసి సమావేశం ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావులు సూచించారు. వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జడ్పీటీసీ ఉత్తరావల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పిడికి తెలియజేస్తానని జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. ఉపాధి హామీ పై వంగర మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. *ఆర్డబ్ల్యూఎస్ పై* ఆర్డబ్ల్యుఎస్ ద్వారా చేపడుతున్న పనులు గూర్చి ఎస్ఈ వివరించగా ఉద్దానం తాగునీటి పైపులైన్లలో ఉన్న లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కి చెప్పారు. హిరమండలం నుండి తాగునీరు ఉద్దానంకు ఇస్తున్నారు కాని హిరమండలం టౌన్ లో తాగునీరు లేదని హిరమండలంనకు తాగునీరు ఇవ్వాలని, హిరమండలం మండల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరారు. ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ జెజెఎం ద్వారా పనులు చేపడుతున్నారని, పనులు చేయని ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాంటి వారిని రద్దు చేయాలని సూచించారు. నీటికి ఇబ్బంది లేకుండా బోర్లు వేయాలని చెప్పగా బోర్లు వేస్తామని ఎస్ఈ చెప్పారు. జడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలిలో తాగునీటి పైపులకు ఉన్న లీకేజీలు అరికట్టాలని చెప్పగా లీకేజీలు లేకుండా చూస్తామని ఎస్ఈ చెప్పారు. కుషాలపురం, తదితర గ్రామాలకు కొన్ని తాగునీటి పనులు రద్దు జరిగిందని, మున్సిపాలిటీలో లేక, పంచాయతీకి లేకుండా ఉందని, ఆ గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు తెలిపారు. భూ గర్భ జలాలు సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలో తాగునీటి సమస్య గూర్చి జడ్పీటీసీ చెప్పగా శాశ్వత పరిష్కారం కింద తాగునీరు ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. టెక్కలిలో వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా అన్ని వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ ఎందుకు చేయడం లేదని ఛైర్మన్ విజయ నిలదీశారు. వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిపిఓ ను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వేసవి ప్రణాళికలు తక్షణమే సిద్ధం చేస్తే నిధులు ఉన్న పంచాయతీల్లో అవసరమైన పనులు చేసుకుంటారని, నిధులు లేని పంచాయతీలు జిల్లా అధికారులకు తెలియజేయజేస్తారని శాసన సభ్యులు కూన రవి కుమార్ వివరించారు. మండలాల వారీగా వేసవి ప్రణాళికలు ఉండాలని చెప్పారు. *సాంఘిక సంక్షేమ శాఖ* సాంఘిక సంక్షేమ శాఖ పై ఇన్ చార్జ్ డిడి ఇటీవల పాతపట్నంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్న బాలిక మెట్ల పై నుండి జారి పడి మృతి చెందినట్లు పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా, సాంఘిక సంక్షేమ వసతి భవనాల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా, స్లాబ్ లపై రక్షణ గోడలు కొద్దిగా ఎత్తు పెంచాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. *ఉద్యానవన శాఖ* సోంపేట, కంచిలి, పలాస మండలాల్లో టమోటా ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఎంపిపి కోరగా రైతులకు నష్టపరిహారంగా 25 వేల రూపాయలు వస్తుందని ఉద్యానవన శాఖ ఎడి వివరించారు. దువ్వాడ వాణి వేసిన ప్రశ్న కు సమాధానంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని, అందుకు ప్రభుత్వ భూములైతే అది ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రైవేటు ల్యాండ్ అయితే భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. హిరమండలంలో వంశధార కుడి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు భూములు ఇచ్చారు కాని వాటికి పాసుపుస్తకాలు జారీ చేయలేదని శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా పాసు పుస్తకాలు జారీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. *వ్యవసాయ శాఖ* వంగర మండలంలో మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వంగర మండలం జడ్పీటీసీ సభ్యులు సురేష్ బెనర్జీ చెప్పగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ జెడి వివరించారు. శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. *వైద్య ఆరోగ్య శాఖ* పత్రికలో వచ్చిన కథనంపై తాను స్వయంగా వెళ్లి పరిశీలించానని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సికెడి మందులు గత 8 నెలలుగా సరఫరా చేయడం లేదని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఇన్ చార్జ్ డిఎంహెచ్ఓ ను అడుగగా ఇండెంటెడ్ పంపినట్లు డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ రోగులు ఎంత మంది ఉన్నారు.. డయాలసిస్ రోగులు గూర్చి శాసన సభ్యులు కూన రవి కుమార్ అడుగగా జిల్లా వ్యాప్తంగా ఉన్న, ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రోగుల గూర్చి వివరించారు. డయాలసిస్, పడకల గూర్చి తెలిపారు. గతంలో మందులకు ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. డిఎంహెచ్ఓ తో మాట్లాడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల పై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని చైర్మన్ సూచించారు. గతంలో పిహెచ్సీ ద్వారా డ్రగ్స్ ఇచ్చింది లేనిది లేదా సి.హెచ్ సీ ద్వారా ఇచ్చారా లేదని కలెక్టర్ డిసిహెచ్ఎస్ నుఅడుగగా పిహెచ్సీల ద్వారా ఇచ్చినట్లు వివరించారు. సోంపేటలో డయాలసిస్ యూనిట్ మరమ్మతులకు గురయ్యిందని తక్షణమే మరమ్మతులు చేయాలని సోంపేట జడ్పీటీసీ కోరారు. మరమ్మతులు చేపడతామని డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, క్యాన్సర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు విస్తారంగా, విస్తృతంగా విస్తరిస్తుందని, రైతులు విరివిగా ఎరువులు వాడుతున్నారని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. విషతుల్యమైన ఆహారం తినడం వలన క్యాన్సర్ వ్యాధికి గురవుతన్నట్లు వివరించారు. ఒకానొక సమయంలో హెచ్ఐవి ఉండేదని, ప్రస్తుతం క్యాన్సర్ శర వేగంగా విస్తరిస్తుందన్నారు. దీనిపై రైతులను అవగాహన పరచాలన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచన చేయాలని కోరారు. *ఎపిఈపీడిసియల్* వ్యవసాయ బోర్లుకు నెలకు 30 రూపాయలు బిల్లులు రైతులకు ఇవ్వాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ ఎస్ఈ కు సూచించారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీలకు బిల్లులు జారీ చేయాలన్నారు. కవిటి సోంపేట, పాతపట్నం లో వోల్టేజీ సమస్య ఉందని దీని వలన ఫ్రిజ్, ఎసిలు పాడవుతున్నాయని, దానిని సరి చేయాలని జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ, పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావులు చెప్పగా లో వోల్టేజ్ సమస్యను సరి చేస్తామని ఎస్ఈ తెలిపారు. ఈ సమావేశంలో ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవి కుమార్, శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు, గొండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, గౌతు శిరీష, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, డిసిఎంఎస్ అధ్యక్షులు అవినాష్, జడ్పీటీసీలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీకాకుళం,ఏప్రిల్,22: ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జడ్పీ సీఈవో వెంకటరామన్ లతో కలసి బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో సభలో ప్రజా సమస్యల పై సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. భూ గర్భజలాలు సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. 
*డ్వామా* 
ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న పనులను పిడి వివరించగా జాబ్ కొన్ని గ్రామాల్లో జారీ చేయాల్సి ఉందని సభ్యులు తెలుపగా అందరికి జాబ్ కార్డులు జారీ చేసినట్లు పిడి వివరించారు. శత శాతం జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కూలీల అకౌంట్ల అప్డేషన్ పై సమీక్షించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయం పై ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ చెప్పారు. 
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రాష్ట్రంలోనే వేజస్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సభ్యులకు తెలిపారు. 
సీతంపేట ఐటిడిఎ పిఓ తో కలసి సమావేశం ఏర్పాటు చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావులు సూచించారు. 
వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జడ్పీటీసీ ఉత్తరావల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పిడికి తెలియజేస్తానని జడ్పీ సీఈవో వెంకటరామన్ చెప్పారు. ఉపాధి హామీ పై వంగర మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. 
*ఆర్డబ్ల్యూఎస్ పై*
ఆర్డబ్ల్యుఎస్ ద్వారా చేపడుతున్న పనులు గూర్చి ఎస్ఈ వివరించగా ఉద్దానం తాగునీటి పైపులైన్లలో ఉన్న లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కి చెప్పారు. హిరమండలం నుండి తాగునీరు ఉద్దానంకు ఇస్తున్నారు కాని హిరమండలం టౌన్ లో తాగునీరు లేదని హిరమండలంనకు తాగునీరు ఇవ్వాలని, హిరమండలం మండల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరారు. 
ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ జెజెఎం ద్వారా పనులు చేపడుతున్నారని, పనులు చేయని ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాంటి వారిని రద్దు చేయాలని సూచించారు. నీటికి ఇబ్బంది లేకుండా బోర్లు వేయాలని చెప్పగా బోర్లు వేస్తామని ఎస్ఈ చెప్పారు. 
జడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలిలో తాగునీటి పైపులకు ఉన్న లీకేజీలు అరికట్టాలని చెప్పగా లీకేజీలు లేకుండా చూస్తామని ఎస్ఈ చెప్పారు. కుషాలపురం, తదితర గ్రామాలకు కొన్ని తాగునీటి పనులు రద్దు జరిగిందని, మున్సిపాలిటీలో లేక, పంచాయతీకి లేకుండా ఉందని, ఆ గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని ఎచ్చెర్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు తెలిపారు. భూ గర్భ జలాలు సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలో తాగునీటి సమస్య గూర్చి జడ్పీటీసీ చెప్పగా శాశ్వత పరిష్కారం కింద తాగునీరు ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. 
టెక్కలిలో వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా అన్ని వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. 
వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ ఎందుకు చేయడం లేదని ఛైర్మన్ విజయ నిలదీశారు. వాటర్ ట్యాంక్ లు క్లోరినేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిపిఓ ను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వేసవి ప్రణాళికలు తక్షణమే సిద్ధం చేస్తే నిధులు ఉన్న పంచాయతీల్లో అవసరమైన పనులు చేసుకుంటారని, నిధులు లేని పంచాయతీలు జిల్లా అధికారులకు తెలియజేయజేస్తారని శాసన సభ్యులు కూన రవి కుమార్ వివరించారు. మండలాల వారీగా వేసవి ప్రణాళికలు ఉండాలని చెప్పారు. 
*సాంఘిక సంక్షేమ శాఖ*
సాంఘిక సంక్షేమ శాఖ పై ఇన్ చార్జ్ డిడి 
ఇటీవల పాతపట్నంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్న బాలిక మెట్ల పై నుండి జారి పడి మృతి చెందినట్లు పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా, సాంఘిక సంక్షేమ వసతి భవనాల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా, స్లాబ్ లపై రక్షణ గోడలు కొద్దిగా ఎత్తు పెంచాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. మృతి చెందిన బాలికకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 
*ఉద్యానవన శాఖ*
సోంపేట, కంచిలి, పలాస మండలాల్లో టమోటా ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఎంపిపి కోరగా రైతులకు నష్టపరిహారంగా 25 వేల రూపాయలు వస్తుందని ఉద్యానవన శాఖ ఎడి వివరించారు. దువ్వాడ వాణి వేసిన ప్రశ్న కు సమాధానంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని, అందుకు ప్రభుత్వ భూములైతే అది ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రైవేటు ల్యాండ్ అయితే భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. హిరమండలంలో వంశధార కుడి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు భూములు ఇచ్చారు కాని వాటికి పాసుపుస్తకాలు జారీ చేయలేదని శాసన సభ్యులు మామిడి గోవిందరావు సభ దృష్టికి తీసుకురాగా పాసు పుస్తకాలు జారీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. 
*వ్యవసాయ శాఖ*
వంగర మండలంలో మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వంగర మండలం జడ్పీటీసీ సభ్యులు సురేష్ బెనర్జీ చెప్పగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ జెడి వివరించారు. శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. 
*వైద్య ఆరోగ్య శాఖ*
పత్రికలో వచ్చిన కథనంపై తాను స్వయంగా వెళ్లి పరిశీలించానని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సికెడి మందులు గత 8 నెలలుగా సరఫరా చేయడం లేదని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఇన్ చార్జ్ డిఎంహెచ్ఓ ను అడుగగా ఇండెంటెడ్ పంపినట్లు డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కిడ్నీ రోగులు ఎంత మంది ఉన్నారు.. డయాలసిస్ రోగులు గూర్చి శాసన సభ్యులు కూన రవి కుమార్ అడుగగా జిల్లా వ్యాప్తంగా ఉన్న, ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రోగుల గూర్చి వివరించారు. డయాలసిస్, పడకల గూర్చి తెలిపారు. గతంలో మందులకు ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. డిఎంహెచ్ఓ తో మాట్లాడి కిడ్నీ వ్యాధిగ్రస్తుల పై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని చైర్మన్ సూచించారు. గతంలో పిహెచ్సీ ద్వారా డ్రగ్స్ ఇచ్చింది లేనిది లేదా సి.హెచ్ సీ ద్వారా ఇచ్చారా లేదని కలెక్టర్ డిసిహెచ్ఎస్ నుఅడుగగా పిహెచ్సీల ద్వారా ఇచ్చినట్లు వివరించారు. సోంపేటలో డయాలసిస్ యూనిట్ మరమ్మతులకు గురయ్యిందని తక్షణమే మరమ్మతులు చేయాలని సోంపేట జడ్పీటీసీ కోరారు. మరమ్మతులు చేపడతామని డిసిహెచ్ఎస్ చెప్పారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, క్యాన్సర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు విస్తారంగా, విస్తృతంగా విస్తరిస్తుందని, రైతులు విరివిగా ఎరువులు వాడుతున్నారని శాసన సభ్యులు కూన రవి కుమార్ చెప్పారు. విషతుల్యమైన ఆహారం తినడం వలన క్యాన్సర్ వ్యాధికి గురవుతన్నట్లు వివరించారు. ఒకానొక సమయంలో హెచ్ఐవి ఉండేదని, ప్రస్తుతం క్యాన్సర్ శర వేగంగా విస్తరిస్తుందన్నారు. దీనిపై రైతులను అవగాహన పరచాలన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచన చేయాలని కోరారు. 
*ఎపిఈపీడిసియల్*
వ్యవసాయ బోర్లుకు నెలకు 30 రూపాయలు బిల్లులు రైతులకు ఇవ్వాలని శాసన సభ్యులు కూన రవి కుమార్ ఎస్ఈ కు సూచించారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీలకు బిల్లులు జారీ చేయాలన్నారు. కవిటి సోంపేట, పాతపట్నం లో వోల్టేజీ సమస్య ఉందని దీని వలన ఫ్రిజ్, ఎసిలు పాడవుతున్నాయని, దానిని సరి చేయాలని జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ, పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావులు చెప్పగా లో వోల్టేజ్ సమస్యను సరి చేస్తామని ఎస్ఈ తెలిపారు. 
ఈ సమావేశంలో ఆమదాలవలస శాసన సభ్యులు కూన రవి కుమార్, శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు, గొండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, గౌతు శిరీష, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, డిసిఎంఎస్ అధ్యక్షులు అవినాష్, జడ్పీటీసీలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వెంకంపేట పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని వెంకంపేట పాఠశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులు, స్థానిక యువత నిరసన తెలిపారు. పాలకొండ నగరపంచాయితీ పరిధిలో సేకరించిన చెత్తను వెంకంపేటలో డంపింగ్ చేస్తున్న నగరపంచాయితీ తీరును ఆ ప్రాంత వాసులతో కలిసి విద్యార్థులు, యువత ముక్తకంఠంతో ఖండించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారు నివసిస్తారని అలాంటి చోట చెత్తను డంప్ చేయడం అన్యాయం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ చాలా రోజులపాటు అప్రకటిత డంపింగ్ యార్డును నడిపి మా ప్రాంత వాసుల ఆరోగ్యాలతో నగరపంచాయితీ ఆడుకుందని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేసి ఇక్కడ నుండి అప్పటి డంపింగ్ యార్డును తొలగించేలా ఒత్తిడి తెచ్చి అప్పట్లో దీన్ని తరలించేలా చేశామని ప్రస్తుతం మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డు కోసం నగరపంచాయితీ అధికారులు హడావిడిగా పనులు చేయడం మా ప్రాంతం పై పగపట్టడంలా ఉందని వెంకంపేట వాసులు వాపోతున్నారు. శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చొరవతో వెంకంపేట పాఠశాల ఎలిమెంటరీ నుండి హై స్కూల్ గా మారుతున్న తరుణంలో ఆ డంపింగ్ యార్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతాన్ని క్రీడామైదానం గా పిల్లలకు కేటాయించి వారికి కానుకగా అందిస్తారని అంతా భావించిన తరుణంలో నగరపంచాయితీ వారు ఇక్కడ డంపింగ్ యార్డు, సీ అండ్ డి యూనిట్ నిర్మాణానికి అర్దరాత్రి పూట గుంతలు తవ్వడం అంటే విద్యార్థులు , స్థానికులకు తీవ్ర అన్యాయం చేయడమే అని విద్యార్థి సంఘాలు తెలియజేసాయి. ఇప్పటికైనా నగరపంచాయితీ కమిషనర్ నిర్ణయాన్ని పునరాలోచించి ఇక్కడనుండి డంపింగ్ యార్డును తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని స్థానికులు తెలిపారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ 
వెంకంపేట పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని వెంకంపేట పాఠశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులు, స్థానిక యువత నిరసన తెలిపారు. పాలకొండ నగరపంచాయితీ పరిధిలో సేకరించిన చెత్తను వెంకంపేటలో డంపింగ్ చేస్తున్న నగరపంచాయితీ తీరును ఆ ప్రాంత వాసులతో కలిసి విద్యార్థులు, యువత ముక్తకంఠంతో ఖండించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారు నివసిస్తారని అలాంటి చోట చెత్తను డంప్ చేయడం అన్యాయం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ చాలా రోజులపాటు అప్రకటిత డంపింగ్ యార్డును నడిపి మా ప్రాంత వాసుల ఆరోగ్యాలతో నగరపంచాయితీ ఆడుకుందని, అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేసి ఇక్కడ నుండి అప్పటి డంపింగ్ యార్డును తొలగించేలా ఒత్తిడి తెచ్చి అప్పట్లో దీన్ని తరలించేలా చేశామని ప్రస్తుతం మళ్ళీ ఇక్కడే డంపింగ్ యార్డు కోసం నగరపంచాయితీ అధికారులు హడావిడిగా పనులు చేయడం మా ప్రాంతం పై పగపట్టడంలా ఉందని వెంకంపేట వాసులు వాపోతున్నారు. శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చొరవతో వెంకంపేట పాఠశాల ఎలిమెంటరీ నుండి హై స్కూల్ గా మారుతున్న తరుణంలో ఆ డంపింగ్ యార్డు నిర్మాణం తలపెట్టిన ప్రాంతాన్ని క్రీడామైదానం గా పిల్లలకు కేటాయించి వారికి కానుకగా అందిస్తారని అంతా భావించిన తరుణంలో నగరపంచాయితీ వారు ఇక్కడ డంపింగ్ యార్డు, సీ అండ్ డి యూనిట్ నిర్మాణానికి అర్దరాత్రి పూట గుంతలు తవ్వడం అంటే విద్యార్థులు , స్థానికులకు తీవ్ర అన్యాయం చేయడమే అని విద్యార్థి సంఘాలు తెలియజేసాయి. ఇప్పటికైనా నగరపంచాయితీ కమిషనర్ నిర్ణయాన్ని పునరాలోచించి ఇక్కడనుండి డంపింగ్ యార్డును తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని స్థానికులు తెలిపారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • “Every mile carries comfort… MGM Vests on the move.” #MGMBanians #MensVest #InnerwearIndia #MadeInIndia #QualityWear #DailyWear #ComfortWear #IndianBrand
    1
    “Every mile carries comfort… MGM Vests on the move.”
#MGMBanians #MensVest #InnerwearIndia #MadeInIndia #QualityWear #DailyWear #ComfortWear #IndianBrand
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అల్లూరి జిల్లా కడుతుల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ఆదివాసి గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన మండల అధ్యక్షుడు కొర్ర నర్సయ్య, కార్యదర్శి ఎం.ఎం శ్రీను మాట్లాడుతూ— విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల లో వోల్టేజ్ సమస్య ఏర్పడి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. పీవీడీజీ కుటుంబాలు ఉన్నప్పటికీ పీఎం జన్మన్ పథకం ద్వారా మంచినీరు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందన్నారు. వేసవిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో బడ్జెట్ ప్రణాళికలు చేసినా అమలు కాలేదని విమర్శించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే మహిళలతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు.
    1
    అల్లూరి జిల్లా కడుతుల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ఆదివాసి గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన మండల అధ్యక్షుడు కొర్ర నర్సయ్య, కార్యదర్శి ఎం.ఎం శ్రీను మాట్లాడుతూ— విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల లో వోల్టేజ్ సమస్య ఏర్పడి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. పీవీడీజీ కుటుంబాలు ఉన్నప్పటికీ పీఎం జన్మన్ పథకం ద్వారా మంచినీరు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందన్నారు. వేసవిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో బడ్జెట్ ప్రణాళికలు చేసినా అమలు కాలేదని విమర్శించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే మహిళలతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    1 day ago
  • ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని వై. రామవరం పోలీసులు కొమరవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ 158 కిలోల గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వీరిపై రంపచోడవరం డివిజన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఎస్పీ అష్రఫ్ తెలిపారు.
    1
    ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని వై. రామవరం పోలీసులు కొమరవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ 158 కిలోల గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వీరిపై రంపచోడవరం డివిజన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఎస్పీ అష్రఫ్ తెలిపారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • శ్రీకాకుళం, ఏప్రిల్ 22 ; ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ధరిత్రిని అందించగలమని విజయనగరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు బుధవారం నగరంలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ గారు తొలుత విద్యార్థుల అవగాహన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెడ్‌క్రాస్ పరిపాలనా భవనంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమన్నారు. విద్యార్థులు పర్యావరణ హిత చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అవగాహన ర్యాలీని ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కె. శివశంకర్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు డాక్టర్ నిక్కపన్న, పి. శ్రీకాంత్, బి. చిన్మయిరావు, పి. వైకుంఠరావు, ప్రతినిధులు కె. సత్యనారాయణ, జి. రమణ, పి. చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం, ఏప్రిల్ 22 ;
ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ధరిత్రిని అందించగలమని విజయనగరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు బుధవారం నగరంలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ గారు తొలుత విద్యార్థుల అవగాహన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం రెడ్‌క్రాస్ పరిపాలనా భవనంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమన్నారు. విద్యార్థులు పర్యావరణ హిత చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. 
అవగాహన ర్యాలీని ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కె. శివశంకర్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు డాక్టర్ నిక్కపన్న, పి. శ్రీకాంత్, బి. చిన్మయిరావు, పి. వైకుంఠరావు, ప్రతినిధులు కె. సత్యనారాయణ, జి. రమణ, పి. చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.