Shuru
Apke Nagar Ki App…
మార్కాపురం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 10,11,12 వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 32 కోట్ల రూపాయలు రాబోతున్నాయి వాటిలో సిసి రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు
M. ADINARAYANA
మార్కాపురం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 10,11,12 వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 32 కోట్ల రూపాయలు రాబోతున్నాయి వాటిలో సిసి రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మార్కాపురం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 10,11,12 వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 32 కోట్ల రూపాయలు రాబోతున్నాయి వాటిలో సిసి రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు1
- చంచల్‌గూడలో బీజేపీ నేతలు, హిందూ సంఘాల వ్యక్తులు నిరసన దిగారు చంచల్‌గూడలో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. గణేశ్ ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.1
- మహానంది మండలంలో చిగురుస్తున్న రైతన్న ఆశలు.. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన వర్షం మహానంది మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్లీనో ప్రభావంతో మండలంలో సరైన వర్షాభావం లేకపోవడంతో రైతులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అడపాదడపా వర్షాలు పడిన పంటలు సాగులో చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న నేడు వర్షాలు కురుస్తుండడంతో ఎండిపోయిన పంటలకు జీవం వస్తుందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడా కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.1
- వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.1
- స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.1
- పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.1
- అలంపూర్: కరువు మండలంగా ప్రకటించాలని ప్రజావాణి అధికారి చంద్రకళకు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి విజ్ఞాపన పత్రం అందజేత అలంపూర్ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని నేడు అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళను విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు ,రైతు కూలీలకు పని కల్పించాలని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ వీధిలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఉభయ దాతల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణం కాపాడడంలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆటలు పాటలుతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాటలో లడ్డును 7116 రూపాయలకు సుబ్బారావు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసుకొని పురవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఆనందంతో కేరింతల కొడుతూ డాన్సులు వేశారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1