Shuru
Apke Nagar Ki App…
తడ Panasonic carbon pvt.Ltd(imcc) company పక్కనే ఉన్న తడ గ్రామ ప్రజలకు చేసిన ఆక్రమణ మరియు విషాదం ద్వార్జన్యం.... దయచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం MLA శ్రీ విజయలక్ష్మి గార్లకు షేర్ చేయండి..
Tada viewers
తడ Panasonic carbon pvt.Ltd(imcc) company పక్కనే ఉన్న తడ గ్రామ ప్రజలకు చేసిన ఆక్రమణ మరియు విషాదం ద్వార్జన్యం.... దయచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం MLA శ్రీ విజయలక్ష్మి గార్లకు షేర్ చేయండి..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.1
- భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర 'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం.. వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు. మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు పుంగనూరు పట్టంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.2
- బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పుంగనూరు మండల పరిధి వ్యవసాయ మార్కెట్ కు సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం తొలి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు హోమాలు, నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం కడప నగరంలోని బాలాజీ నగర్‌లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు. టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్‌తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.1
- బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సినీ నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం మొపూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, అభిషేకం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.1
- దళిత గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు జి. చంద్రశేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జక్కరయ్య మాట్లాడుతూ, జులై 16 నుంచి 26 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన "అసమానతలు లేని సమాజం కోసం సామాజిక శంఖారావం" అధ్యయన యాత్రలో దళితవాడల్లో అనేక సమస్యలు వెలుగుచూశాయని తెలిపారు. మైదుకూరు మండలంలోని 10 గ్రామాల్లో పర్యటించగా, ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసించడం, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు లేకపోవడం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న చోట్ల రోడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం అభివృద్ధి గురించి చెబుతున్న మాటలకు దళిత గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. "గడపగడపకు టీడీపీ" కార్యక్రమాన్ని దళిత గ్రామాల్లో నిర్వహించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. దళితుల సంక్షేమానికి ఉన్న చట్టాలు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. దళిత గ్రామాల్లోని మౌలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస, కేవీపీఎస్, ఆవాజ్ నాయకులు గురయ్య, షరీఫ్, ఖాదర్ బాషా, రవి, సుధాకర్, ఇమామ్ ఓబులేసు, లక్ష్మీదేవి, తామస్, లక్ష్మయ్య, బాలరాజుతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.1
- కుప్పం లో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు* *శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు* *:కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఐఏఎస్* కుప్పం శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లు, టెలివిజన్ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శ్రీ గంగమ్మ ఆలయ అభివృద్ధి అంశంపై సోమవారం సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి అధికారులతో సాధారణ సమీక్ష సమావేశం మాత్రమే నిర్వహించామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివిధ నమూనాలు, ప్రతిపాదనలపై చర్చించినప్పటికీ ఎలాంటి తీర్మానం చేయలేదని, పునర్నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సుమారు ఏడాదిన్నర క్రితం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జాతరకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో మరుగుదొడ్లు, మౌలిక వసతులు, పరిసరాల అభివృద్ధి వంటి పనులకు సుమారు రూ.8 నుంచి రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముఖ్యమంత్రి సహకారంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. సోమవారం నిర్వహించిన సమావేశం పూర్తిగా చర్చల కోసమేనని, ఎలాంటి తీర్మానాలు చేయలేదని, మీడియాకు ప్రకటించే స్థాయిలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని తెలిపారు. ఆలయానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా అధికారికంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని, ఎలాంటి విషయాన్నీ రహస్యంగా ఉంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వికాస్ మర్మత్ గారు తెలిపారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటు, రహదారుల విస్తరణ, భూసేకరణ వంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అందువల్లే ప్రస్తుతం కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పడి, సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అదేవిధంగా రీచ్-2, రీచ్-3 రహదారులు, బస్టాండ్, పార్కులు, పెరిమీటర్ వాల్, చెరువుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, హైమాస్ట్ లైట్లు, డీపీఓఎన్, హార్టికల్చర్, పీ-4, సంజీవని, కేర్ అండ్ గ్రో తదితర కార్యక్రమాలు ప్రజల సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. శ్రీ గంగమ్మ ఆలయం కుప్పం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఆలయానికి విచ్చేస్తారని తెలిపారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి భక్తులకు తగిన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల ఆగస్ట్ 31వ తేదీ వరకు కడ కార్యాలయంలో లిఖితపూర్వకంగా వినతులు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజల నుంచి అందిన అభిప్రాయాలు, సూచనలను శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీతో సమగ్రంగా చర్చించిన అనంతరం, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకోబడుతుంది అని పేర్కొన్నారు.1